Akanksha Dubey death case: నటి కేసులో మరో ట్విస్ట్.. బాయ్‌ఫ్రెండ్ అరెస్ట్.. అసలేం జరిగిందంటూ..
ABN, First Publish Date - 2023-04-07T16:53:33+05:30
భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే (Akanksha Dubey) మృతి కేసు కొత్త మలుపు తిరిగింది.
భోజ్‌పురి నటి ఆకాంక్ష దుబే (Akanksha Dubey) మృతి కేసు కొత్త మలుపు తిరిగింది. యూపీ పోలీసులు ఘజియాబాద్‌కు చెందిన నటి ప్రియుడు, గాయకుడు సమర్ సింగ్ (Samar Singh)ను అరెస్టు చేశారు. సమాచారం ప్రకారం.. సమర్ సింగ్‌తో పాటు అతని సోదరుడుపై పోలీసులు ప్రేరేపణ, దుర్వినియోగంతో పాటు మరికొన్ని అభియోగాలు మోపారు. మార్చి 26న వారణాసిలో ఆకాంక్ష మృతి చెందగా, పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు.
ఉత్తరప్రదేశ్ పోలీసుల బృందం ఘజియాబాద్‌లోని చార్మ్స్ క్యాజిల్ సొసైటీలో సమర్‌ను అరెస్టు చేసింది. ఘజియాబాద్ పోలీసుల సహకారంతో వారణాసి పోలీసుల బృందం ఆపరేషన్ నిర్వహించింది. ఈ కేసులో నిందితుడైన సమర్ సోదరుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) పరారీలో ఉండడంతో అతని కోసం పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేశారు.
Also Read - Vivek Agnihotri: జీవితాలను నాశనం చేయడమే మీ అలవాటు.. బాలీవుడ్ దర్శకుడిపై సెటైర్లు
అయితే.. అంతకుముందు ఆకాంక్ష కుటుంబ సభ్యులు నటి మరణంపై అనుమానం వ్యక్తం చేశారు. ఆకాంక్షతో సమర్ అసభ్యంగా ప్రవర్తించాడని, ఆమెను హింసించాడని తెలిపారు. దీంతో.. పోలీసులు సమర్‌పై ఆత్మహత్యకు ప్రేరేపించడం తదితర అభియోగాల కింద కేసు నమోదు చేశారు. ట్రాన్సిట్ రిమాండ్‌లో ఉన్న సమర్‌ని త్వరలో వారణాసికి తీసుకెళ్లనున్నారు. అలాగే.. నటి పోస్ట్‌మార్టంపై కూడా ఆకాంక్ష కుటుంబ సభ్యులు సందేహాలు లేవనెత్తడంతో పాటు స్వతంత్ర విచారణకి అభ్యర్థించారు. నివేదికల ప్రకారం, నటి తల్లి మధు దూబే తరపున వాదిస్తున్న న్యాయవాది శషక్ శేఖర్ త్రిపాఠి పోస్ట్‌మార్టం నివేదికను ప్రశ్నించారని, ఆ పోస్టు మార్టం విషయంలో వైద్య నిపుణుల సలహాను కోరుతున్నట్లు తెలుస్తోంది. (boyfriend Samar Singh)
ఆకాంక్ష సింగ్ (25) భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో చాలా పాపులర్. ఆమె ఎప్పటికప్పడు సినిమాలు, మ్యూజిక్ వీడియోలతో ప్రేక్షకులను పలకరిస్తూ ఉండేది. ఈ తరుణంలో ఓ సినిమా షూటింగ్ కోసం నటి వారణాసికి వచ్చిన నటి.. మార్చి 26న సారనాథ్‌లోని ఓ హోటల్ గదిలో ఉరి వేసుకుంది. ఆ మరణ వార్త తెలిసి భోజ్‌పురి చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్‌కి గురైంది. అయితే.. చనిపోయే ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి రావడం గమనార్హం. ప్రస్తుత ఆమె మృతికి సంబంధించిన కేసు విచారణ జరుగుతోంది. కాగా.. ‘మేరీ జంగ్ మేరా ఫైస్లా’తో ఇండస్ట్రీకి అరంగేట్రం చేసిన ఆకాంక్ష ‘ముజ్సే షాదీ కరోగి’, ‘ఫైటర్ కింగ్’ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సాధించింది. (Akanksha died in Varanasi)
ఇవి కూడా చదవండి:
Balagam: ‘బలగం’ ఖాతాలో మరో అవార్డు.. మొత్తం ఎన్ని అంతర్జాతీయ అవార్డులు గెలిచిందంటే..
Bholaa: మరో సౌత్ సూపర్‌హిట్ మూవీని చెడగొట్టిన బాలీవుడ్.. ఆ మూవీ ఫ్లాప్‌కి కారణాలివే..