Old Boy: ఓటీటీలో కొరియన్ మాస్టర్ ఫీస్.. ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం అనాల్సిందే!
ABN, Publish Date - Dec 26 , 2023 | 04:38 PM
ఈమధ్య ఓటీటీలో రీ రిలీజైన ఓ కోరియా చిత్రం ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంటున్నది. దీన్ని ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం ఎందుకు మిస్సయ్యాం అంటూ ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అప్పుడెప్పుడో నవంబర్ 21, 2003లో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇటీవలే 4Kలో తిరిగి విడుదల చేయగా అన్ని వర్గాల నుంచి మంచి స్పందన రాబట్టుకుని ట్రెండింగ్‌లో నిలిచింది.
ఈమధ్య ఓటీటీలో రీ రిలీజైన ఓ కోరియా చిత్రం ఓల్డ్ బాయ్ (Old boy 2003) ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకుంటున్నది. దీన్ని ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం ఎందుకు మిస్సయ్యాం అంటూ ఇప్పుడు చూసిన ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. అప్పుడెప్పుడో నవంబర్ 21, 2003లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మధ్యలో కొన్ని ఓటీటీల్లోకి వచ్చినప్పటికీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇటీవలే 4Kలో తిరిగి విడుదల చేయగా అన్ని వర్గాల నుంచి మంచి స్పందన రాబట్టుకుని ట్రెండింగ్‌లో నిలిచింది.
ప్రస్తుతం ప్రపంచం అంతటా హలీవుడ్ సినిమాలకన్నా మిన్నగా ఆకట్టుకుంటున్నవి దక్షిణ కొరియా చిత్రాలు, వెబ్ సిరీస్‌లే. ఆ కోవలోనే 20 ఏండ్ల క్రితం వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఓల్డ్ బాయ్ (Old boy 2003) అక్కడి చిత్రాలలో మాస్టర్ పీస్‌గా,ఉత్తమ చిత్రాలలో ఒకటిగా రికార్డులకెక్కింది. రెండు గంటల 3 నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రానికి పార్క్ చాన్-వుక్ (Park Chan-wook) దర్శకత్వం వహించగా ఐ సా ది డెవిల్ I Saw the Devil (2010) చిత్రంలో క్రూరమైన సీరియల్ కిల్లర్‌గా నటించిన చోయ్ మిన్-సిక్ (Choi Min sik) కథానాయకుడిగా నటించడం విశేషం. జపనీస్ "మంగ" అని పిలువబడే బొమ్మల కథ ప్రేరణతో రూపొందించగా ఆసియాలో ఉత్తమ పది చిత్రాల్లో ఓల్డ్ బాయ్ (Old boy 2003) ఒకటిగా సి.ఎన్.ఎన్ 2008లో పేర్కొంది.
ఇక కథ విషయానికి వస్తే 1988 సంవత్సరంలో నడిచే కథగా సినిమా ప్రారంభమవుతుంది. డెసావు అనే ఓ బిజినెస్ మ్యాన్ తన కూతురు పుట్టిన రోజు నాడు బహిరంగంగా మధ్యం సేవించడానే నెపంతో పోలీసులు ఆరెస్టు చేసి జైల్లో పెడతారు. అనంతరం తన మిత్రుడు వచ్చి అతని బయటికి తీసుకురాగా కొంతమంది ఆగంతకులు కిడ్నాప్ చేసి బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా, మరో మనిషితో మాట్లాడకుండా 15 సంవత్సరాలు బంధిస్తారు. హీరో పలుమార్లు తప్పించుకుందామని, ఆత్మహత్య చేసుకుందామని ప్రయత్నాలు చేసినా అవి విఫలమై బందీగానే గడపాల్సి వస్తుంది. చివరకు 2003లో బయటకు వచ్చిన హీరో తన కూతురుని కనిపెట్టాడా, ఎవరు, ఎందుకు బంధించారనే కారణాలు వెతుకుతూ తన రివేంజ్ ఎలా తీసుకున్నాడనే ఇతివృత్తంతో ఆద్యంతం సస్పెన్స్‌తో, థ్రిల్లింగ్ అంశాలతో ఆకట్టుకునేలా తెరకెక్కించారు.
ఫస్టాప్‌లో వచ్చే యాక్షన్ సీన్ చరిత్రలో నిలిచి పోవడమే కాక, సెకండాఫ్ ట్విస్టులు, క్లైమాక్స్ ఒకదాన్ని మించి మరోటి స్టన్నింగ్‌గా ఉండి కొన్నాళ్ల పాటు మనల్ని హంట్ చేస్తాయి. ఇదిలాఉండగా పార్ చాన్-వుక్ దర్శకత్వం వహించిన వెంజెంస్ ట్రయాలజీ (The Vengeance Trilogy)లో ఈ ఓల్డ్ బాయ్ (Old boy 2003) చిత్రం రెండవది. సింపతి ఫర్ మిస్టర్ వెంజెంస్ (Sympathy for Mr. Vengeance 2002)మొదటి చిత్రం కాగా, సింపతి ఫర్ లేడి వెన్ జెంస్ (Lady Vengeance) (2005) చివరి చిత్రం. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఫ్లాట్ ఫాంలో తెలుగు, కొరియన్, తమిళం, ఇంగ్లీష్, హిందీ, భాషల్లో స్ట్రీమింగ్ జరుగుతున్నది. అయితే వయలెన్స్, బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉండడంతో కుటుంబంతో కలిసి ఈ మూవీని చూడడం కష్టం.