కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

The Climbers: ఓటీటీకి వ‌చ్చేస్తున్న‌.. గూస్‌బంప్స్ తెప్పించే చైనీస్ అడ్వెంచర్

ABN, First Publish Date - 2023-12-12T20:18:30+05:30

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అడ్వెంచ‌ర్ జ‌ర్నీ చేయించ‌డానికి మ‌రో చిత్రం రెడీ అవుతున్న‌ది. చైనీస్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందిన ఆ చిత్రం పేరు ది క్లైంబర్స్. 2019 సెప్టెంబ‌ర్‌లో విడుద‌లైన ఈ చిత్రం చైనాలో భారీ విజ‌యాన్ని సాధించింది. కాగా నాలుగు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఇప్పుడు ఈ చిత్రాన్ని డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌స్తున్నారు.

The Climbers

ఓటీటీ ప్రేక్ష‌కుల‌ను అడ్వెంచ‌ర్ జ‌ర్నీ చేయించ‌డానికి మ‌రో చిత్రం రెడీ అవుతున్న‌ది. చైనీస్ అడ్వెంచర్ డ్రామాగా రూపొందిన ఆ చిత్రం పేరు ది క్లైంబర్స్ (The Climbers). ఈ సినిమాలో వు జింగ్ (Wu Jing), జాంగ్ జియీ (Zhang Ziyi), జాంగ్ యి (Zhang Yi), జింగ్ బోరాన్ (Jing Boran) మరియు హు గే (Hu Ge) ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా డానియల్ లీ(Daniel Lee) దర్శకత్వం వహించారు. 2019 సెప్టెంబ‌ర్‌లో విడుద‌లైన ఈ చిత్రం చైనాలో భారీ విజ‌యాన్ని సాధించింది. కాగా నాలుగు సంవ‌త్స‌రాల త‌ర్వాత ఇప్పుడు ఈ చిత్రాన్ని డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌స్తున్నారు.

క‌థ విష‌యానికి వ‌స్తే 1960, 1975ల‌లో న‌లుగురితో కూడిన టీం చైనాలో చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ ఉత్త‌రం వైపు నుంచి శీతాకాలంలోనే ఎవ‌రెస్ట్ శిఖ‌రాన్ని అధిరోహించ‌డానికి ప్ర‌య‌త్నం చేసిన ప‌ర్వ‌తారోహ‌కుల నేప‌థ్యంలో వారు ప‌డ్డ క‌ష్టాల అధారంగా నిజ జీవిత గాధ‌ల‌ను ఆధారంగా చేసుకుని తెర‌కెక్కించారు. సిపిమాలో స‌గ భాగం నైరుతి చైనాలోని టిబెట్ అటానమస్ రీజియన్‌లోని లొకేషన్‌ల‌లో చిత్రీకరించారు. జాకీచాన్ అతిథి పాత్ర‌లో న‌టించాడు. ఈ సినిమా షూటాంగ్‌కు ముందు కీ రోల్ పాత్ర‌దారి వు జింగ్ రెండు మూడు నెల‌లు క‌ఠోర శిక్ష‌ణ తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.


ఇప్ప‌టికే ఇదేర‌క‌మైన జాన‌ర్‌లో గ‌తంలో వ‌చ్చిన వర్టికల్ లిమిట్ వంటి హాలీవుడ్ చిత్రాన్ని చూసి ఉన్న వారిని సైతం మెప్పించేలా తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 15న గానీ 22 నుంచి గానీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకు వ‌స్తున్న‌ట్లు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్ర‌క‌టించింది. సినిమాలో న‌టీనటుల న‌ట‌న, ఎమోషనల్ సీన్స్‌, స్పెషల్ ఎఫెక్ట్స్, పర్వతారోహణ దృశ్యాలు అద్యంతం ఆక‌ట్టుకునేలా చిత్రీక‌రించారు.

అయితే చిత్రంలో చాలా సార్లు ఎవ‌రెస్ట్ మ‌న‌ది దీన్ని ప్ర‌తి ఒక్క‌రూ అధిరోహించి తీరాల్సిందే అంటూ వ‌చ్చే డైలాగ్స్ మ‌న ప్రేక్ష‌కుల‌ను అస‌హానానికి గురి చేసే అవ‌కాశం ఉన్న‌ది. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఒక‌రిద్ద‌రు పర్వతారోహకులు మాత్రమే చైనా ఉత్త‌ర భాగం నుంచి ఎవ‌రుస్ట్‌ను అధిరోహించిన‌ట్టు స‌మాచారం. అదేవిధంగా ఈ చిత్రాన్ని 1960లో మొద‌టిసారిగా ఎవ‌రెస్ట్‌ను విజయవంతంగా అధిరోహించిన ఫాంగ్ వుజౌకు అంకితం చేశారు.

Updated Date - 2023-12-12T20:27:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!