I am Salman: సల్మాన్ ఖాన్ ఇలా మారిపోయాడేంటి? గ్రూట్ ఎంత పని చేశావ్..
ABN, First Publish Date - 2023-05-02T22:45:10+05:30
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) నోటి వెంట ‘ఐ యామ్ సల్మాన్’ (I am Salman) తప్పితే మరో మాట రావడం లేదు. సల్మాన్ ఇలా మారిపోవడానికి కారణం ఏమిటో తెలిస్తేనా..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) నోటి వెంట ‘ఐ యామ్ సల్మాన్’ (I am Salman) తప్పితే మరో మాట రావడం లేదు. సల్మాన్ ఇలా మారిపోవడానికి కారణం ఏమిటో తెలుసా? మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’. అవును.. ఇప్పుడీ ప్రపంచంలోకి సల్మాన్ కూడా చేరిపోయాడు. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ’ (Guardians of the Galaxy) వీడియోని చూసి చూసి సల్మాన్ పూర్తిగా అందులో లీనమైపోయాడు. మీడియా సమావేశంలో కూడా సల్మాన్ ఆ మాట తప్పితే వేరే మాట చెప్పలేదు. దీంతో మీడియా వారు కూడా పరార్ అయ్యారు. ఈ విషయంలో తాజాగా మార్వెల్ వారు వదిలిన వీడియోని చూస్తే అర్థమవుతుంది.
విషయంలోకి వస్తే.. ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3’ (Guardians of the Galaxy Volume 3) ఈ వారం విడుదలకానుంది. అందుకే అభిమానులలో ఉత్సాహం రెట్టింపు స్థాయికి చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ ముఖ్యంగా భారతీయ అభిమానులు తమ అభిమాన గ్రూట్ కోసం ఎదురుచూస్తున్నారు. అందులో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఒకరు. గ్రూట్ (Groot) ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అభిమానుల హృదయాల్లో తన ముద్ర వేసుకున్నాడు. సల్మాన్ ఖాన్ తక్కువ మాటలు మాట్లాడే వ్యక్తి. గ్రూట్ నుంచి స్ఫూర్తి పొందిన సల్మాన్.. ఇప్పుడీ సినిమా ప్రమోషన్స్‌లో భాగమయ్యారు. గ్రూట్ వీడియోని చూసి.. సేమ్ అదే ఫాలో అయ్యే క్రమంలో ఉన్న సల్మాన్ వీడియోని మార్వెల్ సంస్థ విడుదల చేసింది. ఈ వీడియోలో సల్మాన్ తన రోజువారీ సినిమా ప్రమోషన్‌లలో లానే హాస్యభరితమైన టేక్‌తో గ్రూట్ (Groot) స్టైల్‌లో ఉన్నాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
కాగా.. మే 5న మార్వెల్ స్టూడియోస్ (Marvel Studios) వారి ‘గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3’ ఆంగ్లం, హిందీ, తమిళం మరియు తెలుగు భాషలలో విడుదలకాబోతోంది. ఈ సందర్భంగా అన్ని భాషలలో ఈ చిత్ర ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
************************************************
*JD Chakravarthy: ఆ టైటిల్ కొట్టేద్దామనుకున్నా..
*Heat Trailer Talk: ప్రత్యర్థిని అంచనా వేసేవాడు.. ప్రెజర్‌ను హ్యాండిల్ చేసేవాడే విన్నర్
* The Kerala Story: కథ నిజమని నిరూపించండి.. కోటీశ్వరులు కండి!
*Naga Chaitanya: నా లైఫ్‌లో ఇప్పటి వరకు నేను బాధపడలేదు
*Sarath Kumar: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 20 సినిమాలు
*Balagam: కానిస్టేబుల్ పరీక్షలో సినిమాపై ప్రశ్న.. ఫూలిష్ క్వశ్చన్ అంటూ నెటిజన్ల ఫైర్