కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Berlín: అంత‌కుమించి అనేలా మ‌నీహైస్ట్‌ ‘బెర్లిన్’.. సీట్ ఎడ్జ్, హైస్ట్‌ థ్రిల్ల‌ర్.. ఎప్ప‌టి నుంచంటే!

ABN, First Publish Date - 2023-11-29T11:31:31+05:30

ప్ర‌పంచాన్ని ఓ కుదుపేసిన‌ వెబ్ సిరీస్ మ‌నీ హైస్ట్‌. బ్యాంకు దొపిడీ నేప‌థ్యంలో సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా నెక్స్ట్‌ ఏం జ‌రుగబోతుందో అనేలా అనేక‌ ట్విస్టుల‌తో ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కించారు. చివ‌ర‌గా 2021లో లాస్ట్ 3వ సీజ‌న్ నెట్‌ఫ్లిక్స్‌లో టెలీకాస్ట్ అవ‌గా మంచి స్పంద‌న‌ వ‌చ్చింది. ఇప్పుడు ఈ సిరీస్‌కు ఫ్రీక్వెల్‌గా మ‌రో సీజ‌న్‌ను డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది.

Berlin

Berlín:

ప్ర‌పంచాన్ని ఓ కుదుపు కుదుపేసిన‌ వెబ్ సిరీస్ మ‌నీ హైస్ట్‌ (mony hiest). బ్యాంకు దొపిడీ నేప‌థ్యంలో సీట్ ఎడ్జ్ థ్రిల్ల‌ర్‌గా నెక్స్ట్‌ ఏం జ‌రుగబోతుందో అనేలా అనేక‌ ట్విస్టుల‌తో ఆక‌ట్టుకునేలా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికీ దీనికంటూ ప్ర‌త్యేక ఫ్యాన్ బేస్ ఉంది. భార‌తీయ ప్ర‌ధాన భాష‌ల‌న్నింటిలో దీనిని అనువాదం చేయ‌డ‌మే కాక ప్ర‌త్యేకంగా ప్ర‌మోష‌న్స్ చేశారంటే దీనికున్న క్రేజ్ ఎలాంటిదో తెలుసుకోవ‌చ్చు. ఈ సిరీస్ కు ఎంత పేరు వచ్చవిందో ఇందులో ఫ్రోఫెసర్ పాత్ర పోషించిన అల్వారో మోర్టేకు ప్రపంచవ్యాప్తంగా స్టార్ స్టేటస్ ను తీసుకువచ్చింది.

చివ‌ర‌గా 2021లో లాస్ట్ 3వ సీజ‌న్ నెట్‌ఫ్లిక్స్‌లో టెలీకాస్ట్ అవ‌గా మంచి స్పంద‌న‌ వ‌చ్చింది. ఇందులో బ్యాంకులో హైస్ట్ చేసే క్ర‌మంలో ప్ర‌తి క్యారెక్ట‌ర్ల‌కు దేశాల పేర్లతో సంబోధించగా అందులో ఓ క్యారెక్ట‌ర్ బెర్లిన్ (Berlín) పేరుతోనే ఇప్పుడు ఈ సిరీస్‌కు ఫ్రీక్వెల్‌గా పేరుతో మ‌రో సీజ‌న్‌ను డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం చేస్తున్నారు ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే దీని టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌గా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌గా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది.

హెయిస్ట్ , క్రైమ్‌, థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో వ‌చ్చిన ఈ సిరీస్‌ మొద‌ట‌ 2017లో స్పెయిన్‌లో స్పానిష్ భాష‌లో అక్క‌డి శాటిలైట్ ఛాన‌ల్‌లో మాత్ర‌మే ప్ర‌సార‌మై డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఆ త‌ర్వాత నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ను సొంతం చేసుకుని 2019లో మొద‌టి సీజ‌న్‌ను విడుద‌ల చేయ‌డంతో ప్ర‌పంచ‌వ్య‌ప్తంగా విశేష స్పంద‌న రాబ‌ట్టింది. దీంతో ఈ సిరీస్‌ను తెర‌కెక్కించిన టీమ్‌తోనే మ‌రో రెండు సీజ‌న్లు రూపొందించి విడుద‌ల చేసి జ‌నాల్లోకి మ‌రింత‌గా చొచ్చుకెల్లింది, ఇంకా చెప్పాలంటే ఈ సిరీస్‌తోనే నెట్ ఫ్లిక్స్‌కు అంత‌టి గుర్తింపు రావ‌డ‌మే కాక రెట్టింపు బిజినెస్‌ను తీసుకొచ్చి పెట్టింది.


అయితే మ‌నీహైస్ట్ పార్ట్ 3 ముగింపు అనంత‌రం మ‌రో సీజ‌న్ ఉంటుందా ఉండ‌దా అనే విష‌యాన్ని చెప్ప‌ని యూనిట్ అందులో బాగా హిట్ అయిన‌ ప్ర‌ధాన పాత్ర ప్రొఫెసర్ ఆయ‌న బ్రదర్, టీంకి సెకండ్ కమాండర్ బెర్లిన్ పేరుతో మ‌రో కొత్త‌ సీజ‌న్ త్వ‌ర‌లో నెట్‌ఫ్లిక్స్‌లోకి తీసుకువ‌స్తున్నారు. పెడ్రో అలోన్సో పోషించిన ఈ బెర్లిన్ క్యారెక్ట‌ర్‌కు గ‌త సీజ‌న్‌లోనే బ్యాగ్రౌండ్ స్టోరీ ఉన్న‌ట్లు చూయించ‌గా ఇప్పుడు మ‌నీ హైస్ట్‌కు ముందు జ‌రిగిన క‌థా నేప‌థ్యంతో ఓ ప్ర‌త్యేక సిరీస్‌నే రూపొందించారు.

తాజాగా రిలీజ్ చేసిన బెర్లిన్ ట్రైల‌ర్ మ‌నీహైస్ట్‌కు మించి ఉంది అనేలా ఉంది. కొత్త‌గా కొన్ని క్యారెక్ట‌ర్ల‌ను ప్ర‌వేశ‌పెట్టి మనీ హైస్ట్ లో చూయించిన‌ట్టుగానే ఈ సిరీస్‌లోనూ పారిస్‌లో జ‌రిగే అతిపెద్ద వేలంలో ఉండే ఆభరణాలు బెర్లిన్ కొట్టేయ బోతున్నట్టు చూపించారు. ఈ ట్రైలర్ ఆధ్యంతం ఆక‌ట్టుకోవ‌డంతో సిరీస్ విడుద‌ల కోసం అభిమానులు ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సిరీస్‌ను క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ చివ‌రి వారంలో నెట్‌ఫ్లిక్స్‌ (netflix)లో స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు ప్రకటించారు.

Updated Date - 2023-11-29T11:31:32+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!