GunturKaram: స్కిట్ చెయ్యడానికి టైముంది కానీ, సినిమా చెయ్యడానికి మాత్రం...
ABN, First Publish Date - 2023-06-17T15:00:28+05:30
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఆహా ఓటిటి ఛానల్ కోసం స్కిట్ లు తీయడానికి టైము దొరుకుతోంది కానీ, మహేష్ బాబు తో 'గుంటూరు కారం' సినిమా షూటింగ్ చెయ్యడానికి మాత్రం టైము దొరకటం లేదు అని అంటున్నారు మహేష్ అభిమానులు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas), అల్లు అర్జున్ (AlluArjun), శ్రీలీల (Sreeleela) కలిపి ఆహా (Aha) ఓటిటి ఛానల్ కోసం ఎదో పెద్ద ప్రాజెక్ట్ చేస్తారు అని వచ్చేట్టుగా పెద్ద ప్రచారం చేశారు. తీరా చూస్తే అదొక చిన్న స్కిట్ అని అర్థం అయింది. అల్లు అర్జున్, శ్రీలీల, చమ్మక్ చంద్ర ఇంకా మరికొందరు ఆర్టిస్టులను పెట్టి చిన్న స్కిట్ లా తీశారు. అదే వీడియో ని విడుదల చేశారు. అందులో అల్లు అర్జున్, శ్రీలీల అల్లు అర్జున్ సినిమాలోని పాటలకు స్టెప్పులు వేస్తూ ఎదో సరదాగా స్కిట్ చేసాడు. దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు.
అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇలాంటి స్కిట్ లు దర్శకత్వం చెయ్యడానికి టైం వుంది కానీ, మరి అతను మహేష్ బాబు (MaheshBabu) తో చేస్తున్న 'గుంటూరు కారం' #GunturKaram సినిమా షూటింగ్ చెయ్యడానికి మాత్రం టైము లేదా అని పరిశ్రమలోని, మహేష్ బాబు అభిమానులు అడుగుతున్నారు. 'గుంటూరు కారం' షూటింగ్ ఇప్పటికీ ఎన్నో సార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఏకంగా జులై లో షూటింగ్ చేసుకుందాం అని అన్నారట. అంటే త్రివిక్రమ్ ఈ ఆహా #Aha ఓటిటి ఛానల్ కోసం తన సినిమా షూటింగ్ వాయిదా వేసుకున్నారా ఏంటి అని కూడా కొందరు అడుగుతున్నారు.
అయితే ఈ సినిమా షూటింగ్ ఎందుకు వాయిదా పడుతోందో ఇన్నిసార్లు ఎవరికీ అర్థం కావటం లేదు. త్రివిక్రమ్ బౌండ్ స్క్రిప్ట్ తో రావటం లేదు, మహేష్ బౌండ్ స్క్రిప్ట్ కావాలి అన్నాడు అని, కాంబినేషన్ కుదరటం లేదు అని, ఇలా ఏవేవో చెపుతున్నారు తప్పితే, సినిమా షూటింగ్ మాత్రం అవటం లేదు అనే చర్చ పరిశ్రమలో నడుస్తోంది. జులై లో నాలుగు రోజులు షూటింగ్ చేసే బదులు ఏకంగా ఆగష్టు 16 నుండు పెట్టుకుంటే బాగుటుంది కదా అని కూడా యూనిట్ సభ్యులు కొందరు అన్నట్టు భోగట్టా. ఎందుకంటే మహేష్ బాబు జులై లో వెకేషన్ కి వెళ్లి, మళ్ళీ ఆగస్టు 15 కి వస్తాడట. అందుకని అప్పుడే మొదలెట్టొచ్చు కదా అని కూడా అంటున్నారని తెలిసింది.
ఇంతకీ ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుంది, ఎప్పుడు విడుదల చేస్తారు అని ఇటు అభిమానులు, అటు బయ్యర్లు కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 'గుంటూరు కారం' లో పూజ హెగ్డే (PoojaHegde), శ్రీలీల (Sreeleela) కథానాయికలు కాగా, రమ్యకృష్ణ(RamyaKrishna), ప్రకాష్ రాజ్ (PrakashRaj) ఇంకా చాలామంది ఆర్టిస్టులు వున్నారు.