Tiger Nageswara Rao: అరగంట తీసేసారట, అయినా అదే పరిస్థితి, షాకింగ్ కలెక్షన్స్
ABN, First Publish Date - 2023-10-23T16:30:14+05:30
రవితేజ నటించిన 'టైగర్ నాగేశ్వర రావు' సినిమా నిడివి తగ్గించారని తెలిసింది. మూడు గంటలకి పైగా వున్న ఈ సినిమా నిడివిని సుమారు ఒక అరగంట కట్ (ట్రిమ్) చేశారని తెలిసింది. అయినా కలెక్షన్స్ లో మార్పు లేదని టాక్ నడుస్తోంది.
రవితేజ (RaviTeja) నటించిన సినిమా 'టైగర్ నాగేశ్వర రావు' #TigerNageswaraRao గతవారం అంటే అక్టోబర్ 20న తెలుగులోనే కాకుండా మిగతా భాషల్లో కూడా విడుదలైంది. ఈ సినిమా విడుదలైనరోజు చాలా నెగటివ్ రివ్యూస్ వచ్చాయి. అందులో ఒకటి కంటెంట్ సరిగ్గా లేకుండా, సినిమా నిడివి సుమారు మూడుగంటలకి పైగా ఉండటం, ప్రేక్షకుడిని బోర్ కొట్టించిందని చెప్పారు. అయితే రెండో రోజుకి చిత్ర నిర్వాహకులు కొంచెం తేరుకొని సినిమాని ట్రిమ్ చెయ్యడం మొదలెట్టారట.
ఆలా చేసుకుంటూ వెళితే సుమారు అరగంట వరకు ట్రిమ్ చేసినట్టుగా తెలుస్తోంది. మూడుగంటలకి పైగా వున్న సినిమాలో అరగంట సినిమా తీసేస్తే మరి సన్నివేశాల కనెక్టివిటీ ఉంటుందా అంటే, అది మరి ట్రిమ్ చేసేవాళ్ళకే తెలియాలి అని అంటున్నారు. అసలు విడుదల చెయ్యకమునుపే సినిమాని ట్రిమ్ చేస్తే బాగుండేది అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఒకసారి సినిమా విడుదలయ్యాక, అది మళ్ళీ ట్రిమ్ చెయ్యడం, ఇప్పుడు బాగుంటుంది చూడండి అనటం, ఇవన్నీ ప్రేక్షకులకు సినిమా బాగోలేదు అనే సందేశాన్నే పంపిస్తుంది తప్ప సినిమా బాగుంది చూడండి అనే మెసేజ్ పోదు అని కూడా ఇంకో టాక్. ఈ సినిమాకి వంశీ (Vamsee) దర్శకుడు, అభిషేక్ అగర్వాల్ (AbhishekAgarwal) నిర్మాత. నుపుర్ సనన్ (NupurSanon), గాయత్రీ భరద్వాజ్ (GayatriBharadwaj) కథానాయికలు.
ఇదిలా ఉండగా ఈ సినిమా మూడు రోజులకు గాను ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో సుమారు రూ. 9.51 కోట్ల రూపాయల షేర్ కలెక్టు చేసిందని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రూ. 11.83 కోట్ల రూపాయలు షేర్ వసూలు చేసిందని, ఇది ఇంకా బాగా కలెక్టు చెయ్యాలని కూడా చెపుతున్నారు. ఎందుకంటే సుమారు రూ.39 కోట్ల రూపాయలవరకు ఈ సినిమా వ్యాపారం జరిగిందని, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే సుమారు రూ.40 కోట్లు కలెక్టు చెయ్యాలని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ సినిమా కలెక్షన్స్ ఎలా వుంటాయో చూడాలి మరి. రవితేజ సినిమాకి ఈ కలెక్షన్స్ సరిపోవని, ఇవి ఇంకా బాగా కలెక్టు చెయ్యాలని, ఏమి చేసిన ఈ సోమవారం, మంగళవారం మాత్రమే చెయ్యాలి అని, ఎందుకంటే ఈ రెండు రోజులు సెలవు రోజులు అని, చెపుతున్నారు.