Oscar 2024: అధికారిక ఎంట్రీ కోసం పోటీ పడుతున్న తెలుగు సినిమాలు ఇవే
ABN, First Publish Date - 2023-09-21T18:47:57+05:30
ఈ సంవత్సరం గుజరాతి సినిమా 'చెల్లో' భారత దేశం నుండి అధికారికంగా ఆస్కార్ కి పంపారు, కానీ అవార్డు గెలుచుకోలేదు. ఇప్పుడు 2024 సంవత్సరానికి గాను ఏ సినిమా పంపాలి అనే ప్రక్రియ మొదలైందని తెలిసింది. ఇందులో రెండు తెలుగు సినిమాలు, చాలా హిందీ సినిమాలు, తమిళం సినిమా, మరాఠీ సినిమాలు రెండు ఉన్నాయని తెలిసింది. పూర్తి వివరాలు కిందన చదవండి.
రాజమౌళి (Rajamouli) దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్' #RRR సినిమాలోని 'నాటు నాటు' #NaatuNaatu పాట ఆస్కార్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆ పాటని చంద్రబోస్ (Chandrabose) రాస్తే, దానికి సంగీతం ఎంఎం కీరవాణి (MMKeeravani) అందించారు, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు. సినిమాలో ఆ పాటని చక్కగా ప్రేమ్ రక్షిత్ (PremRakshit) కోరియోగ్రఫీ చేస్తే, ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (RamCharan) లు ఇద్దరూ అద్భుతమైన డాన్స్ చేసి అలరించారు. ఈ సినిమా ఆస్కార్ (OscarAward) బరిలో ఉండగా, పాటకి ఆస్కార్ గెలుచుకుంది.
ఎప్పుడైతే 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ గెలుచుకుందో, ఈసారి భారత దేశం నుండి చాల సినిమాలని పంపాలని చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. భారత దేశం నుండి అధికారికంగా సినిమాలను ఆస్కార్ కి పంపే పనిలో ఇప్పుడు వున్నారు అని తెలిసింది. ఈ సంవత్సరం గుజరాతి సినిమా 'చెల్లో' ని అధికారికంగా పంపారు, కానీ దానికి అవార్డు రాలేదు. ఇంకో డాక్యుమెంటరీ 'ఎలిఫెంట్ విస్పర్స్' #ElephantWhispers అనే దానికి కూడా వచ్చింది.
అయితే ఇప్పుడు 2024 సంవత్సరానికి గాను అంటే వచ్చే సంవత్సరానికి ఆస్కార్ కి ఏ సినిమా అధికారికంగా పంపాలి అనే విషయంలో ప్రక్రియ మొదలైంది అని తెలిసింది. కన్నడంలో ప్రఖ్యాతి గాంచిన గిరీష్ కాసరవెల్లి (GirishKasaravilli) అధ్యక్షతన 17 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ ప్రక్రియని చెన్నైలో మొదలెట్టింది తెలిసింది. మొత్తం దేశ వ్యాప్తంగా 22 సినిమాలు వచ్చాయని తెలిసింది. ఇందులో రెండు తెలుగు సినిమాలు నాని (Nani) నటించిన 'దసరా' #Dasara, అలాగే ఎన్నో అవార్డులు గెలుచుకొని, ఇటు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులతో కూడా మెప్పు పొందిన 'బలగం' #Balagam సినిమా కూడా వున్నాయన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. 'బలగం' సినిమాకి జబర్దస్త్ వేణు దర్శకుడు (VenuYeldandi) కాగా దిల్ రాజు (DilRaju) నిర్మాత.
ఇక హిందీ నుంచి, 'ది స్టోరీ టెల్లర్', 'మ్యూజిక్ స్కూల్', 'మిస్ ఛటర్జీ వెర్సస్ నార్వే', '12th ఫెయిల్' సినిమాలు వున్నాయి. అలాగే ఈమధ్యే విడుదలైన 'గదర్ 2' #Gadar2, 'ఘుమర్', 'అబ్ తో సబ్ భగవాన్ భరోసే' (AbTohSabBhagwanBharose), 'రాఖీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని' (RockyAurRaniKiiPremKahaani (Hindi) ఉన్నాయని తెలిసింది. అలాగే తమిళం నుండి 'విడుదలై -1' #Vidudalai-1 ఉందని అంటున్నారు. ఇక మరాఠీ నుండి 'వాల్వి', 'బాప్ లాయక్' సినిమాలు వున్నట్టుగా తెలిసింది. ఈ వార్తలు కొన్ని ఆంగ్ల మాధ్యమాలు ప్రచురించినట్టుగా తెలుస్తోంది.