కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mega Star Chiranjeevi: 'భోళాశంకర్' ప్రీ రిలీజ్ వేడుకలో సురేష్ కొండేటి డాన్స్ అరాచకం

ABN, First Publish Date - 2023-08-03T18:42:04+05:30

ఆగస్టు 11న విడుదలవుతున్న చిరంజీవి 'భోలాశంకర్' సినిమాకి ఈసారి చాలా గట్టి పోటీ వుంది. ఒక పక్క రజనీకాంత్ సినిమా 'జైలర్', ఇంకో పక్క రెండు హిందీ సినిమాలు, ఒకటి అక్షయ్ కుమార్ నటించిన 'ఓ మై గాడ్ 2', రెండోది సన్నీడియోల్ నటించిన 'గదర్ 2' కూడా ఆగస్టు 11నే విడుదలవుతున్నాయి. 'భోళాశంకర్' ప్రీ రిలీజ్ వేడుక ఈనెల 6న హైద్రాబాదులో జరగనుంది

Chiranjeevi from Bholaa Shankar

మెగాస్టార్ చిరంజీవి (MegaStar Chiranjeevi) నటించిన 'భోళాశంకర్' #BholaaShankar ప్రీ రిలీజ్ (pre-release) వేడుక ప్రకటన వచ్చేసింది. హైద్రాబాదులోనే శిల్పకళావేదిక లో ఆగష్టు 6 వ తేదీ సాయంత్రం ఈ వేడుక జరగనుంది. ఇందులో తమన్నా (TamannahBhatia) కథానాయకురాలు కాగా, కీర్తి సురేష్ (KeerthySuresh) చిరంజీవి చెల్లెలుగా నటిస్తోంది. మెహెర్ రమేష్ (MeherRamesh) దీనికి దర్శకుడు, అనిల్ సుంకర (AnilSunkara) నిర్మాత. ఈ సినిమా ట్రైలర్ కొన్ని రోజుల క్రితం విడుదలయింది, అలాగే ఈ సినిమాలో ఒక పాట కూడా విడుదల చేశారు. పాట బాగానే వైరల్ అయింది.

అయితే చిరంజీవి 'భోళాశంకర్' సినిమాకి అనుకున్నంత బజ్ అయితే ఇంతవరకు రాలేదు అని పరిశ్రమలో అంటున్నారు. ఆ సినిమా ప్రచార చిత్రాలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి అని కూడా అంటున్నారు. ఎందుకంటే ఈ సినిమా విడుదలైనప్పుడు వేరే పెద్ద సినిమాలు చాలా విడుదలవుతున్నాయి. రజనీకాంత్ (Rajinikanth) 'జైలర్' #Jailer సినిమా చిరంజీవి సినిమాకన్నా ఒకరోజు ముందుగా విడుదలవుతోంది. రజనీకాంత్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్నారు, అలాగే ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో విడుదలవుతోంది.

హిందీ నటుడు అక్షయ్ కుమార్ (AkshayKumar) నటించిన 'ఓ మై గాడ్ 2' OhMyGod2 OMG2 సినిమా కూడా ఆగస్టు 11న విడుదలవుతోంది, దానితో పాటు సన్నీ డియోల్ (SunnyDeol), అమీషా పటేల్ (AmeeshaPatel) నటించిన 'గదర్ 2' (Gadar2) కూడా అదే రోజు విడుదలవుతోంది. మరి ఈ రెండు సినిమాలు, అలాగే రజనీకాంత్ సినిమా ఈసారి చిరంజీవికి గట్టి పోటీ ఇవ్వనున్నాయి. అందుకనే 'భోళాశంకర్' ప్రచారాలు భారీగా చెయ్యాలి కానీ ఎందుకనో చిత్రనిర్వాహకులు దాని మీద అంత దృష్టి పెట్టలేదు అని పరిశ్రమలో ఒక టాక్ నడుస్తోంది. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అయినా ప్రచారం చేయనిదే ఈమధ్య ప్రేక్షకులు రావటం లేదని కూడా అంటున్నారు.

ఇదిలా ఉండగా, 'భోళా శంకర్' ప్రీ రిలీజ్ వేడుకకి ఇప్పటికే సాంఘీక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న సురేష్ కొండేటి (SureshKondeti), ఈ సినిమాలో ఒక పాటకి డాన్స్ చేయనున్నాడని తెలిసింది. మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ విషయం చాలా సీక్రెట్ గా ఉంచారని కూడా తెలిసింది. ఎందుకంటే సురేష్ కొండేటి ఆ పాట కోసం 'భోళాశంకర్' లో చిరంజీవి ధరించిన అవుట్ ఫిట్ కుట్టించుకున్నాడని, ఆ పాటకి రిహార్సల్స్ కూడా చేస్తున్నాడని తెలిసింది. ఈమధ్య సురేష్ కొండేటి తనదైన స్టైల్ లో ప్రశ్నలు అడుగుతూ చిత్రాల్లోని నటీనటుల నుంచి వెరైటీ సమాధానాలు రాబడుతూ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అందుకనే సురేష్ కొండేటి డాన్స్ ఈ ప్రీ రిలీజ్ వేడుకలో హైలైట్ గా ఉంటుంది అని కూడా అంటున్నారు.

Updated Date - 2023-08-03T18:42:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!