కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bigg Boss Telugu 7: షకీలా బిగ్ బాస్ హౌస్ లోకి, ఆమెతో పాటూ..

ABN, First Publish Date - 2023-08-28T12:05:31+05:30

తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షోలో హౌస్ లోకి ఎవరెవరు వెళ్ళాలి అనేది ఆర్గనైజర్స్ అప్పుడే ఖరారు చేసినట్టుగా తెలిసింది. అయితే ఒక చిన్న లేకు ద్వారా కొంతమంది పేర్లు బయటకి వచ్చాయి. సెప్టెంబర్ 3 నుండి స్టార్ మా లో మొదలవ్వబోయే ఈ షోలో ఈసారి కంటెస్టెంట్స్ పేర్లు తెలిస్తే షాకే మరి..

Shakeela

తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 7 #BiggBoss7 సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభం అవుతుందని అనుకుంటున్నారు. ఈ షో హోస్ట్ గా మరోసారి నాగార్జున (Akkineni Nagarjuna) కనిపిస్తారు, అయితే హౌస్ లోకి ఎవరెవరు వెళతారు అనేది సస్పెన్స్. కానీ అప్పుడప్పుడు కొంచెం సమాచారం లీక్ అవటంతో ఈ హౌస్ లోకి ఎవరెవరు వెళతారు అనేది చొచాయగా బయటకి వస్తోంది. ఈసారి బిగ్ బాగ్ హౌస్ లో కొంచెం ప్రాముఖ్యం చెందిన సెలెబ్రెటీస్ ని తేవాలని ఆర్గనైజర్స్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది.

హౌస్ లోకి ఎవరు వెళ్ళాలి అనేది ఈ షో ఆర్గనైజర్లు ఇప్పటికే పేర్లు ఖరారు చేసినట్టుగా కూడా తెలిసింది. ఒక వారం ముందు నుండే వాళ్ళకి తర్ఫీదు ఇస్తారు, హౌస్ లో ఎలా ఉండాలి, ఎటువంటి మాటలు మాట్లాడాలి, మిగతా సభ్యులతో ఎలా ప్రవర్తించాలి, అలాగే వారి వారి వ్యక్తిగత అర్రోగ్య సమస్యలను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళని ఖరారు చేస్తారు.

ఇలా ఖరారు చేసిన లిస్ట్ లో ప్రముఖ నటి షకీలా (Shakeela) ఉందని తెలిసింది. షకీలా మలయాళం లో ఒకప్పుడు ప్రముఖంగా వినపడింది పేరు, ఆ తరువాత తెలుగు, తమిళంలో కూడా సినిమాలు చేసింది ఈమీ. షకీలా అంటే అప్పట్లో యువత పది చచ్చేవారని ఒక నానుడి. ఆమె సినిమాలు చాలా భాషల్లోకి తర్జుమా అయి విడుదలయ్యేవి. మలయాళంలో అయితే ఆమె సినిమా వస్తోంది అంటే చాలు, పెద్ద పెద్ద సినిమా విడుదలలు కూడా పోస్టుపోన్ చేసుకునేవారు అని అనేవారు.

అటువంటి నటి ఆయిన షకీలా ఈసారి బిగ్ బాస్ హౌస్ #TeluguRealityShowBiggBoss7 లోకి అడుగు పెడుతోంది. ఆమెతో పాటు కిరణ్ రాథోడ్ (KiranRathod) అనే నటి కూడా అడుగుపెడుతున్నట్టుగా తెలిసింది. కిరణ్ చాలా తెలుగుసినిమాలలో నటించింది. ముఖ్యంగా 'భాగ్యలక్ష్మి బంపర్ డ్రా', 'అందరూ దొంగలే దొరికితే', 'కెవ్వు కేక' లాంటి తెలుగు సినిమాల్లో కనిపిస్తుంది, అలాగే చాలా తమిళ సినిమాల్లో నటించింది. ఈమె ప్రముఖ నటి రవీనా టాండన్ (RaveenaTandon) కి కజిన్. ఈ ఇద్దరూ ఈసారి బిగ్ బాస్ లో హల్ చల్ చేయనున్నారని తెలిసింది.

Updated Date - 2023-08-28T12:22:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!