SamyukthaMenon: కోటి రూపాయల క్లబ్బులో ఈ 'విరూపాక్ష' అమ్మడు కూడా
ABN, First Publish Date - 2023-04-29T11:14:15+05:30
చాల తొందరగా కోటి రూపాయలు పారితోషికం తీసుకునే క్లబ్ లోకి ఎంటర్ అవటం అంత ఈజీ కాదు, కానీ 'విరూపాక్ష' కథానాయిక ఈ క్లబ్ లో చేరిపోయింది. తన తదుపరి సినిమాకి పారితోషికం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు
తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమంది అది ఫాలో అవుతూ వుంటారు, కొందరు అది ఫాలో ఎవరు. ఒక నటీమణి వరసగా హిట్స్ ఇస్తుంటే ఆమెనే తమ సినిమాలో పెట్టుకోవడానికి ఇష్టపడతారు. సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej), సంయుక్త మీనన్ (SamyukthaMenon) నటించిన 'విరూపాక్ష' (Virupaksha) సినిమా పెద్ద విజయం సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇందులో నటించిన నటి సంయుక్త #Samyuktha కి ఇది వరసగా నాలుగో హిట్ సినిమా. ఇంతకు ముందు ఆమె 'భీమ్లా నాయక్' #BheemlaNayak, 'బింబిసార' #Bimbisara, 'సర్' #Sir ఇప్పుడు ఈ 'విరూపాక్ష' #Virupaksha సినిమాతో ఆమె వరుసగా విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకుపోతోంది.
అయితే ఇవన్నీ ఆమె తెలుగు పరిశ్రమకి వచ్చినప్పుడు వొప్పుకున్నవే అని ఆమె సన్నిహితులు అంటున్నారు. ఇప్పుడు తదుపరి సినిమాలకి ఆమె పారితోషికం పెంచుతోందని వినికిడి. ఇప్పుడు సంయుక్త మీనన్ కూడా వన్ క్రోర్ క్లబ్ లోకి చేరుతోంది అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు వొప్పుకోబోయే సినిమాలకి కోటి రూపాయలు పైనే తీసుకోవాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీనితో తెలుగు పరిశ్రమలో కోటి రూపాయలు తీసుకుంటున్న చాలామంది నటీమణుల క్లబ్ లో సంయుక్త కూడా చేరిపోయినట్టే అని అంటున్నారు.
అనుష్క #AnushkaShetty, సమంత #Samantha, రకుల్ #RakulPreet, పూజహెగ్డే #PoojaHegde, రష్మిక మందన్న #RashmikaMandanna, కాజల్, తమన్నా, కీర్తి సురేష్, శృతి హాసన్ లాంటి నటీమణులు ఎప్పుడూ కోటి రూపాయలు కంటే ఎక్కువ తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ పారితోషికాలు చాలా ఎక్కువ కూడాను. సంయుక్త వరస నాలుగు సినిమాల హిట్స్ తో ఇప్పుడు ఈ క్లబ్ లోకి చేరింది. అయితే సంయుక్త ఈ నాలుగు సినిమాల్లో మంచి ప్రతిభ కనపరిచింది కూడా. తదుపరి సినిమాల విజయాల్ని బట్టి ఆమె పారితోషికం మరికొంత పెంచే అవకాశం కూడా వుంది.