Samantha: వేసుకున్న చెప్పులు ఖరీదు వింటే షాక్ అవుతారు, మరి మిగతా సంగతేంటి?
ABN, First Publish Date - 2023-05-30T10:55:01+05:30
సమంత పాపులారిటీ బాగా పెరిగిపోయింది. 'పుష్ప' లో స్పెషల్ సాంగ్, 'ఫామిలీ మాన్' వెబ్ సిరీస్ తో ఆమె పేరు జాతీయంగా మారుమోగుతోంది. ఇప్పుడు 'సిటాడెల్' అనే హిందీ వెబ్ సిరీస్ కూడా చేస్తోంది. ఇలా అన్ని భాషల్లోనూ చేసుకుంటూ పోతున్న సమంత వేసుకున్న చెప్పులు ఖరీదు ఎంతో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు
ఈమధ్య చాలామంది సెలెబ్రిటీలు ఎయిర్ పోర్ట్ లో వెళ్లడం, రావటం లాంటి ఫోటోస్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి. అయితే నెటిజన్స్ ఎక్కువగా ఈ సెలెబ్రిటీస్ వేసుకున్న చెప్పుల మీద దృష్టి పెడుతున్నారు. వాటి ధరలు చూస్తుంటే బాబోయ్ వెళ్లేంటి చెప్పుల మీద ఇన్నేసి లక్షలు ఖర్చు పెడుతున్నారు అని ఆశ్చర్యం వేస్తుంది. ఒక్క చెప్పుల మీదే వాళ్ళు అంత డబ్బు ఖర్చు పెడుతుంటే, ఇక మిగతా వాటి మీద ఎంతెంత ఖర్చు పెడుతున్నారో ఆలోచించుకోండి.
ఇప్పుడు ఈ చెప్పుల విషయం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, మొన్న సమంత (SamanthaRuthPrabhu) 'ఖుషీ' #Khushi సినిమాకోసం టర్కీ (Turkey) వెళ్ళింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ (VijayDeverakonda) పక్కన ఆమె నటిస్తోంది. శివ నిర్వాణ (ShivaNirvana) దీనికి దర్శకుడు. అలా వెళుతూ ఎయిర్ పోర్ట్ లో కనపడింది. అందరి దృష్టి ఆమె చెప్పుల మీద పడింది. ఇంతకీ ఆమె వేసుకున్న చెప్పుల ఖరీదు ఎంతో తెలుసా రెండు లక్షల రూపాయలకు పైనే ఉంటుంది అంటున్నారు.
ఆమె వేసుకున్నవి లూయిస్ విట్టన్ కంపెనీ (Louis Vuitton) కి చెందిన చెప్పులు వేసుకుంది అంటున్నారు. ఇది ఈమధ్య 'సిటాడెల్' (Citadel) వెబ్ సిరీస్ షూటింగ్ కోసం లండన్ (London) వెళ్ళినప్పుడు ఈ చెప్పులు అక్కడ కొనింది అని కూడా అంటున్నారు. ఈ కంపెనీ చెప్పులు అన్నీ లక్షల రూపాయల్లోనే ఉంటాయి. అయితే ఒక్క సమంతనే #Samantha కాదు, చాలామంది సెలబ్రిటీస్ వేసుకున్న చెప్పులు ఇలానే చాలా ఖరీదు వుంటాయని అంటున్నారు.
'బ్రో' #Bro సినిమాలో పవన్ కళ్యాణ్ (PawanKalyan), సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) కలిసి వున్న స్టిల్ విడుదల చేశారు కదా. అందులో పవన్ కళ్యాణ్ #PawanKalyan వేసుకున్న షూ ఖరీదు కూడా లక్ష రూపాయలు ఉంటుంది అని అంటున్నారు నెటిజెన్ లు. ఇలా చాలామంది సెలబ్రిటీస్ తమ షూ దగ్గరనుండి వేసుకున్న బట్టలు, వాచీలు, ఉంగరాలు ఇలా ఒకటేమిటి అనీ ఇంతింత ఖరీదువి వేసుకుంటున్నారు అంటే, ఆ సెలబ్రిటీ కాస్ట్ ఇలా మొత్తం చేసుకుంటూ పోతే కోట్లలో ఉంటుందేమో కదా! ఏమైనా విలువ ఇచ్చేది వస్తువు కాదు, మనిషికి అని గుర్తుంచుకోవాలి !