RGV Vyooham: అనుకున్నట్టే అబద్ధాలతో ఆ పార్టీ కోసం తీసిన చీప్ సినిమా
ABN, First Publish Date - 2023-10-13T13:11:41+05:30
ఆర్జీవీ విడుదలచేసిన 'వ్యూహం' ట్రైలర్ అనుకున్నట్టుగానే అంత ఆసక్తికరంగా లేదు. ఈ సినిమా అంతా కూడా వైస్సార్సీపీ, జగన్ ని భజనగా వుండబోతోంది అని చాలా క్లియర్ గా అర్థం అయిపోతోంది.
రామ్ గోపాల్ వర్మ (RamGopalVarma) 'వ్యూహం' #Vyooham టీజర్ విడుదల చేసాడు. అయితే అనుకున్నట్టుగానే ఈ టీజర్ లో ఏమీ ఆసక్తికరంగా లేదని తెలిసిపోయింది. వైస్సార్సీపీ (YSRCP) ఇచ్చిన ఆర్ధిక సహాయంతో తీసిన ఈ సినిమా ఆ పార్టీకి, ఆ పార్టీ నాయకుడు అయిన వై ఎస్ జగన్ (YSJagan) కి బాగా ఉపయోగపడేట్టు మాత్రం ఆర్జీవీ (RGV) తీసాడు. సినిమాలో కూడా విషయం ఏమీ ఉండదు అని కూడా అర్థం అయిపొయింది. ఒక పార్టీకి, నాయకుడికి భజన వేసే విధంగానే ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
అదీ కాకుండా ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ కథ అంతా వన్ సైడెడ్ భజన అని, అంటే ఎవరు ఈ సినిమాకి ఆర్ధిక సాయం అందించారో, వాళ్ళకే భజన ఎక్కువ చేశారు అని అర్థం అవుతోంది. అయితే ఈ సినిమాలో నిజాలుని పక్కన పెట్టి, తన పార్టీకి ఎలా తీస్తే అనుకూలంగా ఉంటుందో అలా తీసాడు ఆర్జీవీ. రామ్ గోపాల్ వర్మ తనకి నచ్చిన విధంగా, ఆర్ధిక సాయం చేసిన పార్టీకి అనుకూలంగా ఈ సినిమా మలచినట్టు క్లియర్ గా అర్థం అవుతోంది అని కూడా తెలుస్తోంది. అయితే ఇలాంటి సినిమాలు ఎన్ని తీసిన అవి థియేటర్స్ లో నడవవు అన్న సంగతి కూడా ఆర్జీవీ కి తెలుసు.
ఎందుకంటే అతను ఇంతకు ముందు కూడా ఇలాంటి సినిమాలు చాలానే తీసాడు, కానీ అవి థియేటర్స్ లో ఒక్కటి కూడా సరిగ్గా నడవలేదు. ఒకటి రెండు రోజులు నడిస్తే ఎక్కువ, అతని యూట్యూబ్ ఛానల్ లో ఇవే సినిమాలు చూపించుకోవచ్చు అని కూడా పరిశ్రమలో అంటున్నారు. ఆర్జీవీ బాగా మాట్లాడతాడు, మీడియా వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నని తనదైన రీతిలో మలచుకొని చాలా తెలివిగా సమాధానాలు చెప్తాడు. ఆంధ్ర రాజకీయాలు తెలియదు అని అంటున్నాడు, మరి తెలియనప్పుడు అదే రాజకీయాల మీద సినిమా ఎలా తీస్తున్నాడు. ఏమన్నా అంటే ఇది నాకు తెలిసిన నిజం, మీకు తెలిసిన నిజం కాదు అని మీడియా వాళ్ళకి తెలివిగా చెప్తాడు. అతను ఎంత చెప్పినా అతను వైస్సార్సీపీ కి భజన చేస్తున్నాడు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే.
ఇప్పుడు ఈ 'వ్యూహం' కూడా అంతే అని ఆ సినిమా ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతోంది. పవన్ కళ్యాణ్ (PawanKalyan)ని, టీడీపీ నేత చంద్రబాబు నాయుడిని (ChandrababuNaidu) విలన్స్ గా చూపించటమే ఆర్జీవీ కి తెలిసిన నిజం. అందువలన ఈ సినిమా కూడా అతను ఇంతకు ముందు తీసిన సినిమాల్లానే ఒకటి రెండు రోజులు ఆడి వెళ్లిపోయేవే అని కూడా అంటున్నారు.