సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

RGV: రామ్ గోపాల్ వర్మ ఏంటి ఇలా తయారయ్యాడు, నిజం అంటూ అబద్ధాలు చెప్తున్నాడు

ABN, First Publish Date - 2023-04-29T14:02:58+05:30

ఆఖరికి రామ్ గోపాల్ వర్మ ఏంటి ఇలా తయారయ్యాడు పాపం అని అందరూ జాలి పడుతున్నారు. ఒకప్పుడు అతని సినిమా అంటే ఎదురుచూసేవారు, ఇప్పుడు వర్మ కేవలం సాంఘీక మాధ్యమంకి మాత్రమే పరిమితం అయిపోయాడు. పై మెట్టు వరకు వెళ్లి ఇప్పుడు సరాసరి కింద మెట్టు మీద పడ్డాడు అని కూడా అంటున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రామ్ గోపాల్ వర్మ (RamGopalVarma) ఆఖరికి ఇలా తయారయ్యేది ఏంటి అన్న చర్చ పరిశ్రమలో నడుస్తోంది. ఎందుకంటే ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి వైస్సార్సీపీ #YSRCP పార్టీ తరుపున డిజిటల్ కంటెంట్ హెడ్ గా చేస్తున్నాడు అని అంటున్నారు. ఆ పార్టీ నుండి వర్మ కి బాగానే ముడుతున్నాయన్నది కూడా ఒక టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు ఆర్జివి #RGV కి సినిమాలు కూడా ఏమి పెద్దగా లేవు, తీస్తే గీస్తే మళ్ళీ ఎవడిలాగో వున్న ఒక నటుడిని తెచ్చి వాడి మీద ఈ సినిమా తీసా అంటూ సాంఘీక మాధ్యమాల్లో పెడతాడు, అంతే కానీ, రెగ్యులర్ సినిమాలు అయితే ఎవరూ చెయ్యరు అని కూడా అంటున్నారు. అవి లేనప్పుడు ఇలా ఆ పార్టీ తరుపున డిజిటల్ కాంపైనర్ గా ఉంటే కాస్తో కూస్తో డబ్బులు అయినా వస్తాయి కదా అని కూడా అంటున్నారు.

అయితే తాను మొదలెట్టిన నిజం అనే ఈ ఛానల్ లో అన్నీ అబద్ధాలే అని కూడా అంటున్నారు. వై.ఎస్. వివేకానంద రెడ్డి #YSVivekaMurder హత్య గురించి ఎవరికీ తోచింది వాళ్ళు చెపుతూనే వున్నారు, ఈ నిజం ఛానల్ లో రామ్ గోపాల్ వర్మ కూడా తనకు తోచింది తానూ చెప్పేస్తూ వున్నాడు. అసలు వాళ్ళ కుటుంబం లో వాళ్ళు మాట్లాడేరు అంటే అర్థం వుంది, వర్మ కి ఏమి తెలుసు, ఇతను కూడా ఎదో చెప్పేస్తున్నాడు. మరీ అంతలా వైస్సార్సీపీ కి మౌత్ పీస్ లా తయారయ్యేట్టు మాట్లాడుతున్నాడు.

షర్మిల #YSSharmila ఆమె అభిప్రాయం ఆమె చెప్పింది వివేకానందరెడ్డి #YSVivekanandaReddy గురించి. చనిపోయిన వారి మీద ఎందుకు ఆలా దుష్ప్రచారాలు చేస్తారని కూడా అడిగింది. ఇక మన వర్మ అయితే షర్మిల చెప్పిన దానికి అటు తిప్పి, ఇటు తిప్పి తన పార్టీ వాళ్ళకి దానిలో ఎటువంటి హస్తం లేదు అని చెప్పడానికి ఎన్ని తంటాలు పడుతున్నాడో పాపం. ఒక్కప్పుడు వర్మ అంటే ఒక సినిమా ఏదైనా తీస్తే ప్రేక్షకులు ఎదురు చూసేవారు, ఇప్పుడు వర్మ కేవలం సాంఘీక మాధ్యమంలో వైరల్ అవటానికి, వ్యూస్ పెంచుకోవడానికి మాత్రమే పనికొస్తున్నాడు.

Updated Date - 2023-04-29T14:02:58+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!