కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Salaar: సినిమాలో ప్రభాస్ కనిపించేది 40 నిముషాల తరువాత, అంటే...

ABN, First Publish Date - 2023-12-02T16:57:03+05:30

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న 'సలార్' ట్రైలర్ నిన్న విడుదలైంది, అందులో ప్రభాస్ రెండో నిముషం తరువాత కనిపిస్తారు అంటే మరి సినిమాలో ప్రభాస్ పాత్ర చాలా తక్కువగా ఉండొచ్చు అని ఒక టాక్ వినిపిస్తోంది.

A still from Salaar

ప్రభాస్, (Prabhas) ప్రశాంత్ నీల్ (PrashanthNeel) కాంబినేషన్ లో వస్తున్న 'సలార్' #Salaar సినిమా ట్రైలర్ నిన్న డిసెంబర్ 1న విడుదలైంది. ఈ ట్రైలర్ కి మిశ్రమ స్పందన లభించింది. ఇది కూడా కెజిఎఫ్ #KGF లానే ఉంటుందని కొందరు అంటే, కాదు అదే నేపధ్యం కానీ కథ వేరేగా ఉండొచ్చు అని ఇంకొందరు ఇలా ఎవరికీ తోచింది వారు అంటున్నారు. అయితే విడుదలైన ట్రైలర్ లో ప్రభాస్ కనిపించింది ఇంచుమించు రెండో నిముషం వచ్చేసరికి. అంటే ప్రభాస్ చిన్నప్పటి సన్నివేశాలు కూడా సినిమాలో ఉన్నాయని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పకనే చెప్పారు.

అయితే ట్రైలర్ లోనే ఇంతసేపు చిన్నప్పటి ప్రభాస్ ని చూపిస్తే మరి సినిమాలో ఇది ఎంతసేపు ఉంటుంది అని అందరికి ఆసక్తి పెరిగింది. పరిశ్రమలో ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే సినిమా మొదలైన 40 నిముషాల వరకు ప్రభాస్ కనిపించరు అని, ఆ తరువాత మాత్రమే తెరమీదికి వస్తారు అని. దీనితో ప్రభాస్ అభిమానులు కొంచెం డీలా పడుతున్నారు అని కూడా అంటున్నారు.

సినిమాలో ప్రధాన కథానాయకుడు అంతసేపు సినిమాలో కనిపించపోతే, అందులోకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు వున్న ప్రభాస్ లాంటి నటుడు కనిపించకపోతే, అభిమానులు ఊరుకుంటారా. దర్శకుడు ప్రశాంత్ నీల్ ట్రైలర్ లోనే చాలాసేపు ప్రభాస్ కుర్రాడిగా వుండే సన్నివేశాలని అంతసేపు చూపించారు అంటేనే అర్థం అవుతోంది అని అందరూ అంటున్నారు. అదీ కాకుండా, ఈ ట్రైలర్ కి మిశ్రమ స్పందన రావటంతో కొన్ని రోజుల తరువాత ఇంకో ట్రైలర్ కూడా విడుదల చెయ్యడానికి రెడీ గా పెట్టుకున్నారు అని ఒక టాక్ వినిపిస్తోంది.

Updated Date - 2023-12-02T16:57:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!