Prabhas: ప్రభాస్ మోకాలికి ఆపరేషన్, ప్రస్తుతం రెస్ట్ లో వున్నాడా?
ABN, First Publish Date - 2023-09-23T13:29:53+05:30
ప్రభాస్ మోకాలికి శస్త్ర చికిత్స జరిగిందని, ప్రస్తుతం అతను విశ్రాంతి తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నవంబర్ నాటికి అతని పూర్తిగా కోలుకొని మళ్ళీ షూటింగ్స్ లో పాల్గొంటాడు అని కూడా వార్తలు వైరల్ అయ్యాయి. అతని పుట్టినరోజు అయిన అక్టోబర్ 23న 'సలార్' ట్రైలర్ ఉండొచ్చని ఊహాగానాలు.
ప్రభాస్ సినిమాలు ఒకటి 'సలార్' #Salaar విడుదలకి సిద్ధంగా వుంది కానీ, ఎప్పుడు విడుదల అనేది ఇంకా తేదీ ఖరారు కాలేదు. ఇంకో సినిమా 'కల్కి 2898 ఎడి' సినిమా కూడా షూటింగ్ జరగాలి, కానీ ప్రస్తుతం జరగటం లేదు అని అంటున్నారు. అలాగే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా 'రాజా డీలక్స్' #RajaDeluxe షూటింగ్ కొంత అయింది, ఈ సినిమాని పీపుల్స్ మీడియా నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా కొనసాగాలి. అయితే ప్రస్తుతం అభిమానులు 'సలార్' విడుదల తేదీ, ఆ సినిమా గురించి ఏదైనా సమాచారం వస్తుందేమో అని ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉండగా, ప్రభాస్ ప్రస్తుతం యూరోప్ లో వున్నాడని, అతని మోకాలికి శస్త్రచికిత్స అయిందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ విశ్రాంతి తీసుకుంటున్నాడని అంటున్నారు. అందుకనే అతను షూటింగ్ లు ఏమీ చెయ్యకుండా ముందు మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడని వార్త వైరల్ అయింది. (Knee surgery for Prabhas)
'బాహుబలి' #Baahubali సినిమాలో అతను చేసిన యాక్షన్ సన్నివేశాల తరువాత అతని మోకాలికి శస్త్రచికిత్స అవసరం పడింది. అయితే ప్రభాస్ మందులు వేసుకుంటూ వాయిదా వేసుకుంటూ వస్తున్నాడు. 'ఆదిపురుష్' #Adipurush సినిమా ప్రచారాలప్పుడు ప్రభాస్ మెల్లగా నడవటం చూసి అతని అభిమానులు కూడా చాలా ఆందోళన చెందిన మాట వాస్తవం. అలాగే 'ఆదిపురుష్', 'సలార్' #Salaar సినిమాలు పూర్తి చేసాడు, కానీ ఇప్పుడు శస్త్రచికిత్స ఎలా అయినా చేయించుకోవాలని సూచించటంతో యూరోప్ లో మోకాలికి ఆపరేషన్ అయిందని అంటున్నారు.
అందుకనే 'సలార్' విడుదల తేదీ కూడా ప్రకటించలేదు అని ఒక వార్త వస్తోంది. ఇక ప్రభాస్ ఇండియా రావటానికి కూడా కొంచెం టైము పడుతుందని కూడా అంటున్నారు. అతని పుట్టినరోజు అయిన అక్టోబర్ 23 నాడు 'సలార్' ట్రైలర్ విడుదల చేయొచ్చు అని కూడా ఒక వార్త. కాలినొప్పి పూర్తిగా తగ్గి, బాగా నడవగలిగితే 'కల్కి 2898 ఎడి', #Kalki2898AD అలాగే మారుతీ (DirectorMaruthi) సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు అని కూడా అంటున్నారు. కానీ ప్రభాస్ తరపున ఎటువంటి అధికారిక ప్రకటన దేని గురించి రాలేదు.