కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nandamuri family: శ్రీలీలతో నందమూరి మోక్షజ్ఞ, వారసుడు సినిమా ఎంట్రీకి రెడీ...

ABN, First Publish Date - 2023-10-11T11:49:13+05:30

నందమూరి మోక్షజ్ఞ ఈమధ్య బాలకృష్ణ సినిమా సెట్స్ లోనూ, షూటింగ్ సమయంలోనూ కనపడుతున్నాడు. 'భగవంత్ కేసరి' సినిమా ఫంక్షన్ లో బాలకృష్ణ తన కుమారుడి సినిమా ఎంట్రీ మీద క్లారిటీ ఇచ్చేసారు. నిన్న బాలకృష్ణ, కుమారుడు మోక్షజ్ఞ, శ్రీలీల ఒక ప్రైవేట్ స్టూడియోలో కనపడినప్పుడు, మోక్షజ్ఞ ఎంట్రీ ఖరారు అయిందని అంటున్నారు.

Nandamuri Balakrishna, Sreeleela and Balakrishna's son Mokhagna spotted at a private studio

'భగవంత్ కేసరి' #BhagavanthKesari ప్రీ రిలీజ్ వేడుక వరంగల్ లో అయినప్పుడు నందమూరి బాలకృష్ణ (NandamuriBalakrishna) తన కుమారుడు త్వరలో సినిమాల్లోకి రానున్నాడు అని చెప్పకనే చెప్పారు. తన తరువాత తన వారసుడు మోక్షు వస్తున్నాడు అని చాలా క్లియర్ గా చెప్పేసారు బాలకృష్ణ. 'భగవంత్ కేసరి' కి అనిల్ రావిపూడి (AnilRavipudi) దర్శకుడు, అందులో శ్రీలీల (Sreeleela), కాజల్ అగర్వాల్ (KajalAggarwal) ఇద్దరూ నటిస్తున్నారు. శ్రీలీల బాలకృష్ణ కుమార్తెగా నటిస్తుండగా, కాజల్ అగర్వాల్ బాలకృష్ణ పక్కన నటిస్తోంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదే సభలో బాలకృష్ణ, శ్రీలీల గురించి ప్రస్తావిస్తూ ఆమె కథానాయకురాలిగా ఒక సినిమాలో చెయ్యాలని వుంది అని ఇంటోలో భార్య, పిల్లలతో చెప్పినప్పుడు, కొడుకు తనని కోప్పడ్డాడు అని కూడా చెప్పాడు. "అదేంటి డాడీ నేను సినిమాల్లోకి వచ్చి ఆమెతో చెయ్యాలని చూస్తుంటే, నువ్వు ఆమెతో ఎలా చేస్తావు అని కోప్పడ్డాడు" అని చెప్పారు బాలకృష్ణ. అప్పుడు నందమూరి అభిమానులు అందరూ ఒక విధంగా ఆనందం పడ్డారు, ఎందుకంటే బాలకృష్ణ తన నట వారసుడిగా మోక్షజ్ఞ (NandamuriMokshagna) ని దింపుతున్నారు అని.

అయితే మోక్షజ్ఞ (Mokshagna) ఎప్పుడు ఆరంగేట్రం చేస్తున్నాడు అనే విషయం మాత్రం ఇంకా స్పష్టం కాలేదు. అయితే ఈలోగా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ విషయమై, థమన్ (Thaman) స్టూడియోలో బాలకృష్ణ, అతని కుమారుడు మోక్షజ్ఞ, నటి శ్రీలీల కలవటం, ఆ ఫోటో సాంఘీక మాధ్యమంలో వైరల్ అవటం జరిగుతోంది. ఇంకేముంది ఇది మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కి కూడా మార్గం సుగమం అయింది అని అభిమానులు ఒకటే ఆనందపడుతున్నారు.

అయితే 'భగవంత్ కేసరి' సినిమా ఫంక్షన్ లో బాలకృష్ణ ఆ మాట చెప్పడం, తరువాత తన కుమారుడు మోక్షు, శ్రీలీల తో ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు కలిసి కనపడటం ఇవన్నీ చూస్తుంటే, మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ త్వరలోనే జరగబోతోందని, అందులో శ్రీలీల కథానాయికగా ఉండబోతోందని, అభిమానులు అందరూ అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. సాంఘీక మాధ్యమంలో కూడా ఇదే వార్త హల్ చల్ చేస్తోంది.

Updated Date - 2023-10-11T11:49:13+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!