Keerthy Suresh: ఇంకో తెలుగు సినిమా చేస్తోంది, అయితే ఈసారి ఎవరితోటో తెలుసా....
ABN, First Publish Date - 2023-08-22T15:43:57+05:30
'మహానటి' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకొని, అవార్డులు కూడా అందుకొని ఇటు తెలుగులోనూ, అటు తమిళం, మలయాళం భాషల్లోనూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్న కీర్తి సురేష్ ఇప్పుడు ఇంకో తెలుగు సినిమా చేస్తోంది. అది ఎవరితో అంటే...
కీర్తి సురేష్ (KeerthySuresh) ఇప్పుడున్న నటీమణుల్లో బిజీగా వున్న నటీమణి. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో వరసగా సినిమాలు చేసుకుంటూ దక్షిణాదిలో అటు ఇటు పరిగెడుతూ బిజీ బిజీగా వుండే కీర్తి ఇప్పుడు ఇంకో తెలుగు సినిమా వొప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అది ఇంకెవరితోటో కాదు, అక్కినేని నాగ చైతన్యతో (AkkineniNagaChaitanya).
దర్శకుడు చందు మొండేటి (ChandooMondeti), అక్కినేని నాగ నాగచైతన్య (AkkineniNagaChaitanya) తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీత ఆర్ట్స్ (GeethaArts), బన్నీ వాసు (BunnyVasu) దీనికి నిర్మాత. ఈ సినిమా కోసం టీము ఆల్రెడీ శ్రీకాకుళం (Srikakulam) వెళ్లి అక్కడ చేపలు పట్టే వాళ్ళతో ఒకటి రెండు రోజులు ఉండి వాళ్ళ స్థితిగతులు తెలుసుకొని వచ్చారు. ఎందుకంటే ఇందులో నాగ చైతన్య ఒక ఫిషర్ మాన్ పాత్ర వేస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసమని అతను నిజ జీవితంలో వాళ్ళు ఎలా వుంటారు, ఎలా జీవిస్తారు, వాళ్ళు సముద్రంలోకి వెళ్లే విధానం అన్నీ తెలుసుకొని ఆ పాత్రని ఆకళింపు చేసుకొని నటించాలని అనుకుంటున్నాడు.
ఇందుకోసం దర్శకుడు చందు, నాగ చైతన్య కలిసి చాలా వర్క్ చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమా కథా నేపధ్యం కూడా నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తీస్తున్నవి అని దర్శకుడు చందు చెప్పాడు. ఈ సినిమా కొన్ని రోజుల్లో షూటింగ్ మొదలెడతారని తెలిసింది. అయితే ఈ సినిమాలో కథానాయకురాలిగా ఇద్దరినీ చివరికి ఎంపిక చేసుకున్నారు, అందులో ఒకరు సాయి పల్లవి (SaiPallavi), రెండో ఆమె కీర్తి సురేష్ (KeerthySuresh). ఇప్పుడు టీము కీర్తి సురేష్ ని కథానాయకురాలిగా తీసుకున్నట్టుగా తెలిసింది. సాయి పల్లవి ఇంతకు ముందు నాగ చైతన్యతో 'లవ్ స్టోరీ' #LoveStory అనే సినిమా చేసింది. ఇప్పుడు కీర్తి సురేష్, నాగ చైతన్య పక్కన అతని ప్రియురాలిగా నటిస్తోంది అని తెలుస్తోంది.
కీర్తి సురేష్ ఈమధ్యనే విడుదలైన 'భోళాశంకర్' #BholaaShankar సినిమాలో చిరంజీవి (Chiranjeevi) చెల్లెలు గా నటించింది, అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. దీనికి ముందు 'దసరా' #Dasara అనే సినిమాలో నాని (Nani) పక్కన చేసింది, ఆ సినిమా బాగా నడిచింది, అలాగే కీర్తి సురేష్ నటనకి గాను మంచి పేరు వచ్చింది.