సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sudigali Sudheer: ఆమెతో సీక్రెట్‌గా నిశ్చితార్థం.. నిజమేనా?

ABN, First Publish Date - 2023-07-01T20:58:52+05:30

ఇన్నాళ్లూ యాంకర్ రష్మీ గౌతమ్‌, సుడిగాలి సుధీర్ పెళ్లి చేసుకుంటారనేలా వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు సుధీర్ తన దగ్గర బంధువులలోని మరదలు వరస అయ్యే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడనేలా టాక్ వైరల్ అవుతోంది. దీనిపై సుధీర్ అండ్ టీమ్ స్పందించలేదు కానీ.. ఈ వార్తతో రష్మీతో సుధీర్ పెళ్లిని ఊహించుకున్నవారంతా బాధను వ్యక్తం చేస్తున్నారు.

Sudigali Sudheer
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer).. బుల్లితెర బాద్‌షా. జబర్ధస్త్ కమెడియన్‌గా (Jabardasth Comedian) ఎంతో పాపులర్ అయిన సుధీర్.. ఇప్పుడు హీరోగానూ తనని తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. అయితే వీటన్నింటికంటే కూడా సుడిగాలి సుధీర్ ఫేమస్ అయింది మాత్రం.. రష్మీ గౌతమ్‌ (Rashmi Gautam)తో వచ్చే వార్తల వల్లే అని ఎవరిని అడిగినా చెబుతారు. రష్మీ, సుధీర్‌ (Rashmi and Sudheer)ల మధ్య మ్యాటర్ ఉందంటూ, త్వరలోనే వారు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ.. ఇప్పటికే కథలుకథలుగా వారిపై వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇలా వార్తలు వచ్చిన ప్రతీసారి వాళ్లు.. ఖండిస్తూనే వస్తున్నారు. మంచి స్నేహితులం మాత్రమే అని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వార్తలు మాత్రం ఆగలేదు.

మరి ఈ వార్తలు ఆగాలంటే.. ఇక పెళ్లే శరణ్యం అని అనుకున్నాడో, లేదంటే ఏజ్ ఎక్కువ అయిపోతుందని భావించాడో తెలియదు కానీ.. ఇప్పుడు తన దగ్గర బంధువులలోని మరదలు వరుస అయ్యే ఓ అమ్మాయిని సుధీర్ సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్నాడనేలా టాక్ వైరల్ అవుతోంది. ఆ అమ్మాయి వివరాలు పూర్తిగా బయటికి అయితే రావడం లేదు కానీ.. సుధీర్ నిశ్చితార్థం పూర్తయిందని, చాలా దగ్గరైన బంధువుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని ఆయన ముగించాడనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలలో ఎంత నిజముందనేది తెలియదు కానీ.. ఈ వార్తలపై సుధీర్ అండ్ టీమ్ ఇప్పటి వరకు మాత్రం స్పందించలేదు. దీంతో అంతా.. నిజమే అయి ఉండవచ్చని అనుకుంటున్నారు. (Sudigali Sudheer Engagement Rumour Viral)

మరోవైపు సుధీర్, రష్మీ గౌతమ్‌ల జంటని ఇష్టపడే అభిమానులు (Rashmi and Sudheer Fans) మాత్రం ఇది నిజం అవకుండా ఉంటే బాగుండు అనేలా కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే, సుధీర్, రష్మీ పెళ్లి చేసుకోవాలని మొదటి నుంచి వారు ఎంతగానో కోరుకుంటున్నారు. సుధీర్, రష్మీ.. జస్ట్ స్నేహం మాత్రమే అన్నప్పుడల్లా వారు సోషల్ మీడియా వేదికగా బాధను వ్యక్తం చేస్తున్నారు. అందుకే సుధీర్‌కి తన మరదలితో నిశ్చితార్థం అయ్యిందనే వార్తలని వారు నమ్మలేకపోతున్నారు. సుధీర్ నిశ్చితార్థం విషయమై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. ప్రస్తుతం హీరోగా సునీల్ రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*Miriam Maa: 50 ఏళ్లు పైబడిన ఒక మహిళ కృత్రిమ గర్భధారణను ఎంచుకుంటే..

**************************************

*VV Vinayak: డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల్లో ‘సాక్షి’

**************************************

*TSPSC Group 4 Exam: గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న.. దానికి సమాధానమిదే!

**************************************

*D Imman: విద్యార్థిని చదువు కోసం సంగీత దర్శకుడి సాయం

**************************************

*Priyanka Chopra: ‘అపురూపం’గా టాలీవుడ్‌కి పరిచయం అవ్వాల్సిన నటి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా!

**************************************

Updated Date - 2023-07-01T20:58:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!