Chandramukhi 2: ‘చంద్రముఖి 2’ వాయిదా పడిందా.. ఈ సినిమా వచ్చేది కూడా ఆ తేదీనేనా?
ABN, First Publish Date - 2023-09-08T16:15:29+05:30
స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్ పి.వాసు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి ఉండగా.. ఇప్పుడు సెప్టెంబర్ 28కి వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.
స్టార్ కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ భారీ బడ్జెట్ చిత్రం ‘చంద్రముఖి 2’. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) టైటిల్ పాత్రలో నటిస్తోంది. సీనియర్ డైరెక్టర్ పి.వాసు (P Vasu) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) ఈ సినిమాను అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తోంది. సుభాస్కరన్ నిర్మాత. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్స్, ‘స్వాగతాంజలి...’ లిరికల్ సాంగ్, రీసెంట్‌గా వచ్చిన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమాని వినాయక చవితి స్పెషల్‌గా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తూ.. సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ సినిమా వినాయక చవితికి రావడం లేదని తెలుస్తోంది. (Chandramukhi 2 Postponed)
‘చంద్రముఖి 2’ చిత్రం కూడా సెప్టెంబర్ 28వ తేదీనే విడుదల అంటూ సోషల్ మీడియా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే మేకర్స్ మాత్రం ఇంకా అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేయలేదు. మరి ఎందుకు ఈ సినిమాని వాయిదా వేశారనే దానిపైగానీ, అసలు వాయిదా పడిందా? లేదా? అనే విషయంగానీ ఇంకా బయటికి రాలేదు. మేకర్స్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే సెప్టెంబర్ 28న ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 15న రావాల్సిన ‘స్కంద’ (Skanda) కూడా సెప్టెంబర్ 28కి వాయిదా పడింది. ఇప్పుడు ‘చంద్రముఖి2’ కూడా అదే డేట్ అంటే.. మొత్తంగా ఆ రోజు ఓ అరడజను సినిమాల వరకు బరిలో ఉండే అవకాశం ఉంది.
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్, వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్ కుమార్, విఘ్నేష్, రవిమారియ, శృష్టి డాంగే, శుభిక్ష, వై.జి.మహేంద్రన్, రావు రమేష్ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించారు. ఈ సినిమాకు విడుదలకు సంబంధించి మరోసారి చిత్రయూనిట్ అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి:
============================
*Jawan: లెజెండ్‌లో ఉన్న స్టఫ్ ఇది.. ‘జవాన్’పై మహేష్ బాబు రివ్యూ.. ఎంత బాగుందో
*********************************
*Srimanthudu: ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సినిమాగా ‘శ్రీమంతుడు’ రికార్డ్
**********************************
*Rules Ranjann Trailer: గంట లేదు, అరగంట లేదు.. ఎక్కడో విన్నట్టుందే..
**********************************
*Jailer Fame Marimuthu: గుండెపోటుతో ‘జైలర్’ యాక్టర్ కన్నుమూత
**********************************
*Vetrimaaran: ‘ఇండియా’ అనే పేరే చాలు
**********************************
*Atlee: ‘జవాన్’తో కల నెరవేరింది.. టాలీవుడ్‌లోని ఆ హీరోలతో టచ్‌లోనే ఉన్నా..
************************************