కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Devil: విజయ్ మీద ట్వీట్ చేసి వార్తల్లో వున్న అభిషేక్, ఏకంగా దర్శకుడి పేరే తీసేసాడు, దీన్నేమంటారో మరి...

ABN, First Publish Date - 2023-09-12T11:58:39+05:30

ఎవరిమీదైనా ఆరోపణలు చెయ్యడమో, లేదా ఒక మాట అనడంలో, లేదా వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడమో చాలా సులువైన పని. కానీ తన దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఆ మాటలు, వ్యాఖ్యలు తనకి వర్తించవు అన్నట్టుగా, అభిషేక్ నామ ఇప్పుడు చేసిన పనికి పరిశ్రమలో అందరూ విమర్శిస్తున్నారు

Nandamuri Kalyan Ram in Devil

ఆమధ్య నిర్మాత అభిషేక్ నామా (AbhishekNama) వార్తల్లో వున్నాడు. అభిషేక్ కి సంబంధం లేని సినిమా 'ఖుషి' #Khushi కథానాయకుడి విజయ్ దేవరకొండ (VijayDeverakonda) మీద ట్వీట్ పెట్టి వార్తల్లోకి ఎక్కాడు. అభిషేక్ అంతకు ముందు విజయ్ దేవరకొండతో 'వరల్డ్ ఫేమస్ లవర్' #WorldFamousLover అనే సినిమా తీసాడు, అది విడుదలై మూడు సంవత్సరాలు అయింది, సినిమా సరిగ్గా ఆడలేదు, అయితే ఇప్పుడు ఆ సినిమాకి డబ్బులు ఇప్పించమని, అదీ ఆ సినిమాలో కథానాయకుడిగా చేసిన విజయ్ ని అడిగాడు అభిషేక్ నామా. దీనిమీద అటు పరిశ్రమ నుండి, ఇటు విజయ్ అభిమానుల నుండి కూడా అభిషేక్ ని బాగా ట్రోల్ చేశారు, బాగా నెగటివ్ వచ్చింది అతని మీద ఆలా ట్వీట్ పెట్టినందుకు.

విజయ్ ని డబ్బులు ఇప్పించమని అడిగి, అలాగే 'ఖుషి' కలెక్షన్స్ గురించి కూడా మాట్లాడి, విజయ్ దేవరకొండ స్టామినా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా వుందో అని అనవసరంగా అతని గురించి మాట్లాడిన అభిషేక్ నామా, తన సొంత సినిమా 'డెవిల్' #Devil కి ఏమి చేసాడో చూసారా. ఆ సినిమాకి దర్శకత్వం వహించిన నవీన్ (Naveen) పేరు తీసేసాడు. మరి ఇంతలా వేరే సినిమా గురించి, వేరే నటుడి గురించి మాట్లాడిన తన సొంత సినిమా దర్శకుడికి ఇచ్చిన గౌరవం అతని పేరు లేకుండా 'డెవిల్' #Devil పోస్టర్ విడుదల చెయ్యడమే. ఇది మరి దేనికి పరాకాష్టో అని పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

ఇంతకీ విషయం ఏంటంటే 'డెవిల్' సినిమా దర్శకుడు ఈ సినిమా పూర్తవకుండానే ఇంకో సినిమా వేరేవాళ్లకి చెయ్యడానికి ఒప్పుకున్నాడు అని తెలిసింది. 'డెవిల్' ప్రచార చిత్రాలు చూసి వేరేవాళ్లు ఆ దర్శకుడిని అప్రోచ్ అయి సినిమా చెయ్యమని అడ్వాన్స్ ఇస్తే, 'డెవిల్' నిర్మాతగా అభిషేక్ గర్వపడాలి, తన సినిమా వ్యాపారం మరింత మెరుగవ్వడానికి అది సహాయ పడుతుందని అనుకోవాలి. కానీ అలా అనుకోకుండా తనకి తెలియకుండా ఆ దర్శకుడు వేరే సినిమా ఎలా ఒప్పుకుంటాడు అని ఆ దర్శకుడిని ఇబ్బందుల పాలు చెయ్యాలని అతని పేరు తీసేసినట్టుగా పరిశ్రమలో టాక్ నడుస్తోంది.

దర్శకుడి పేరు వెయ్యకుండా ఆ సినిమా వ్యాపారం అవుతుందా? నిన్న 'డెవిల్' సినిమాలో కథానాయిక సంయుక్త (Samyuktha) పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో దర్శకుడి పేరు లేకపోవటం పరిశ్రమలో అందరూ చూసి షాకయ్యారు. అందరికీ తెలుసు అది నవీన్ దర్శకత్వం వహించాడని, ఇప్పటికే అందరినీ విమర్శిస్తూ నిర్మాత అభిషేక్ వివాదాల వార్తల్లో వున్నాడు. ఇప్పుడు దర్శకుడి పేరు తీసేసి తన బ్యానర్ పెట్టడం ఎంతవరకు సబబు, ఆ సినిమాకి పూర్తి నెగటివ్ తప్పితే, సినిమాకి ఎటువంటి ప్లస్ అవదు అని పరిశ్రమలో అంటున్నారు.

ఇప్పుడు ఈ 'డెవిల్' సినిమాకి కలెక్షన్స్ రాకపోతే ఇందులో కథానాయకుడిగా నటించిన నందమూరి కళ్యాణ్ రామ్ (NandamuriKalyanRam) ని డబ్బులు ఇప్పించమని అభిషేక్ అడుగుతాడా అని కూడా పరిశ్రమలో ఒక జోక్ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలతో ఆసక్తికరంగా వున్న 'డెవిల్' సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే వివాదాలు మని, దర్శకుడికి ఇవ్వాల్సిన గౌరవం అతనికిచ్చి, సినిమా విజయపథంలో నడిపించేటట్టు చేసుకోవాలని పరిశ్రమలో అనుకుంటున్నారు.

Updated Date - 2023-09-12T11:58:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!