సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Anni Manchi Sakunamule Film Review నందిని రెడ్డి సినిమా ఎలా ఉందంటే...

ABN, First Publish Date - 2023-05-18T14:10:04+05:30

నందిని రెడ్డి దర్శకత్వంలో చాలామంది సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్, నరేష్, రావు రమేష్, గౌతమి, షావుకారు జానకి లాంటి వాళ్ళు నటించిన 'అన్నీ మంచి శకునములే' ఈరోజు విడుదల అయింది. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ లీడ్ పెయిర్. స్వప్న, ప్రియాంక దత్ లు ఈ సినిమాకి నిర్మాతలు, ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే..

A still from Anni Manchi Sakunamule
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా: అన్నీ మంచి శకునములే

నటీనటులు: సంతోష్ శోభన్, మాళవిక నాయర్, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, షావుకారు జానకి, నరేష్, గౌతమి, వాసుకి, వెన్నెల కిషోర్, రమ్య సుబ్రమణియన్, అశ్విన్ కుమార్ తదితరులు

మాటలు: లక్ష్మీ భూపాల్

ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి, రిచర్డ్ ప్రసాద్

సంగీతం: మిక్కీ జె మేయర్

నిర్మాత: ప్రియాంకా దత్

దర్శకత్వం: బీవీ నందినీ రెడ్డి

-- సురేష్ కవిరాయని

దర్శకురాలు నందినీ రెడ్డి (BVNandiniReddy) తీసినవి కొన్ని సినిమాలే అయినా, మంచి ఫీల్ గుడ్ సినిమాలు తీసింది. ఆమె సినిమాల్లో ఎక్కువ కుటుంబం గురించి , అందులో బంధాలు, అనురాగాలు ఉంటాయి. ఇప్పుడు 'అన్నీ మంచి శకునములే' (Anni Manchi Sakunamule) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో సంతోష్ శోభన్ (SantoshSobhan) కథానాయకుడు కాగా, మాళవిక నాయర్ (MalavikaNair) కథానాయకురాలు. సంతోష్ చాలా సినిమాలు చేస్తున్నాడు కానీ ఒక మంచి బ్రేక్ రాలేదు. ప్రియాంకా దత్ (PriyankaDutt), ఆమె సిస్టర్ స్వప్న దత్ (SwapnaDutt) ఈ సినిమాకు నిర్మాతలు. వీళ్ళిద్దరూ కలిసి ఇంతకు ముందు, 'ఎవడె సుబ్రహ్మణ్యం', 'మహానటి' (Mahanati) అలాగే ఈమధ్య వచ్చిన 'సీత రామం' (SitaRamam) లాంటి మంచి విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ఇప్పుడు నందినీ రెడ్డి తో ఈ 'అన్నీ మంచి శకునములే' తీశారు. ఈ సినిమా ఉందో చూద్దాం.

Anni Manchi Sakunamule Story కథ:

ఈ కథ ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు బోర్డర్ దగ్గర విక్టోరియా పురం అనే వూరిలో జరిగింది. దివాకర్ (రావు రమేశ్), సుధాకర్ (సీనియర్ నరేష్) అన్నదమ్ములు ఒక కుటుంబం. అలాగే ప్రసాద్ (రాజేంద్ర ప్రసాద్) ఇంకో కుటుంబానికి యజమాని. ఈ రెండు కుటుంబాల కొన్ని దశాబ్దాలకు పనిగా ఒక కాఫీ ఎస్టేట్ గురించి కోర్టు కేసులు నడుస్తూ ఉంటాయి. రెండు కుటుంబాలు పంతానికి పోయి తరాలు మారినా, ఈ కోర్టు కేసు మాత్రం వదలరు. ఇదిలా ఉంటే ప్రసాద్ కొడుకు రిషి (సంతోష్ శోభన్) సుధాకర్ కూతురు ఆర్య (మాళవికా నాయర్) ఇద్దరూ ఒకటే స్కూల్ లో చదువుతూ అప్పటి నుండే ప్రేమలో పడతారు. రెండు కుటుంబాలకు పడకపోయినా ఈ ఇద్దరూ రెండిళ్లకు వస్తూ పోతూ వుంటారు. రిషి చదువులో యావరేజ్, ఆర్య మంచి తెలివైన పిల్ల, అందుకని రిషి కొంచెం వెనకబడి ఉంటాడు. వాళ్ళిద్దరి ప్రేమకి అదే అడ్డంకి అవుతుంది. ఇంతకీ ఆ కోర్ట్ కేసు ఏమైంది, కోర్ట్ కేసులో ఎవరు గెలిచారు, రిషి, ఆర్యలు మ్యారేజ్ చేసుకున్నారా? వీటన్నటికీ సమాధానాలు కావాలంటే సినిమా చూడాల్సిందే. #AnniManchiSakunamuleReview

విశ్లేషణ:

నందిని రెడ్డి 'అన్నీ మంచి శకునములే' #AnniManchiSakunamuleReview సినిమాకి ఒక చిన్న పాయింట్ అనుకుంది. సొసైటీలో చాలామంది తరాలు మారినా జీవితంలో సగభాగం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండటం. ఎప్పుడో వందేళ్ల క్రితం కొట్టుకుంటే, ఇప్పుడున్న తరానికి ఏంటి సంబంధం? కానీ అప్పుడు కొట్టుకోవటం వలన, ఇప్పటి తరం వాళ్ళు కూడా పరిచయం లేకపోయినా, మిత్రులుగా ఉండాల్సిన వాళ్ళు, శత్రువులుగా తయారవుతున్నారు, జీవితాన్ని పాడుచేసుకుంటున్నారు. అలాంటిదే ఈ 'అన్నీ మంచి శకునములే' సినిమా. అయితే ఈ కథ చాలా చిన్నది, అందుకని నందిని అది చెప్పడానికి కొంచెం సాగదీసింది. మొదటి సన్నివేశాలు చూస్తున్నప్పుడు ప్రేక్షకుడికి 'అల వైకుంఠపురంలో' సినిమా గుర్తుకు వస్తుంది. అందులో ఇద్దరి అబ్బాయిలు ఆసుపత్రిలో మారిపోతే, ఇందులో అబ్బాయి, అమ్మాయి మారిపోయి ఇద్దరూ తమ వ్యతిరేక కుటుంబాల ఇళ్లలో పెరుగుతారు.

ఇంక కథగా చూస్తే సినిమాలో ఏమీ ఉండదు. కానీ నందిని రెడ్డి కుటుంబంలో వుండే చిన్న చిన్న మమకారాలు, అనుబంధాలు, అనురాగాలు ఆలా ఈ రెండు కుటుంబాల్లో చూపించి ఇంటర్వెల్ వరకు లాక్కొచ్చింది. #AnniManchiSakunamuleReview మధ్యలో సంతోష్, మాళవిక నాయర్ లో ప్రేమ సన్నివేశాలు, వాళ్ళ రొమాన్స్ ఆలా నడిచిపోతుంది. ఈ సినిమాలో నేరేషన్ కూడా కొత్తగా ఏమీ ఉండదు, అలాగే ఎక్కడా ట్విస్ట్స్ కూడా వుండవు. సాఫీగా ఆలా సాగిపోతూ ఉంటుంది. అంతే.

సినిమా కోర్ట్ కేసులు చూపించారు మొదట, కానీ దాని మీద దర్శకురాలు అంత దృష్టి పెట్టలేదు ఎందుకో. ఎందుకంటే అదే కదా అసలు పాయింట్. లీడ్ పెయిర్ రొమాన్స్, ప్రేమ సన్నివేశాల మీదే ఎక్కువ దృష్టి పెట్టింది. #AnniManchiSakunamuleReview అవన్నీ మామూలుగానే ఉంటాయి. అయితే మధ్యమధ్యలో చూపించిన ఆ కుటుంబ సన్నివేశాలు మాత్రం హృదయాన్ని హత్తుకుంటాయి. చివరి 20 నిముషాలు మాత్రం ఈ సినిమాకి ఆయువుపట్టు అని చెప్పాలి. ఎందుకంటే క్లైమాక్స్ లో ఆ భావోద్వేగాలు తారాస్థాయిలో ఉంటాయి. ముఖ్యంగా ఆసుపత్రిలో రాజేంద్ర ప్రసాద్ (RajendraPrasad) తో, రావు రమేష్ (RaoRamesh) చెప్పిన ఆ డైలాగ్స్ హృదయాన్ని హత్తుకుంటాయి. అయితే ఈ సినిమాకి ఒక్కటే లోపం, అదేంటి అంటే, సినిమా చాలా స్లో గా నేరేట్ చేసింది దర్శకుడురాలు. అలాగే ఆ పాత పాటలకు డాన్సులు చేసే సన్నివేశాలు కూడా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోవు అనిపిస్తుంది. అదంతా కూడా సినిమాకి అడ్డంకే.

నటీనటులు ఎలా చేసారంటే:

ఈ సినిమాలే నటీనటులు అందరూ బెస్ట్ ప్రదర్సన ఇచ్చారు. కానీ సినిమాలో హైలైట్ మాత్రం మాళవిక నాయర్. ఈ అమ్మాయి చాలా ప్రతిభ వున్న అమ్మాయి, ఎటువంటి పాత్రలో అయినా అందులో లీనమయి చాలా చక్కగా చేస్తుంది. 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా నుండి మాళవిక నటనలో మాత్రం చాలా చక్కగా అభినయిస్తూ ఆ పాత్రని మరికొంచెం హైలైట్ అయ్యేలా చేస్తుంది. మాళవిక ఒక మంచి నటి, అలాగే సినిమా సినిమాకి చాలా ఎదుగుతూ వస్తోంది. ఇంకా సంతోష్ శోభన్ చాలా ఎనెర్జిటిక్ గా, యాక్టివ్ గా బాగా చేసాడు, అలాగే చివర్లో భావోద్వేగాలను కూడా బాగా చేసి చూపించాడు. రాజేంద్ర ప్రసాద్ ఎన్నో వందల సినిమాలు చేసినా, ఇందులో అతని నటన మరో స్థాయిలో ఉంటుంది. రావు రమేష్ ఒక వైవిధ్యమైన నటుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలామంది నటులు మొదటి నుండి చివరి వరకూ స్క్రీన్ ప్రెజెన్స్ వున్నా, చివరలో రావు రమేష్ తన అద్భుత నటనతో ఆకట్టుకుంటాడు. అదే అతని ప్రతిభ. సీనియర్ నటుడు నరేష్ (VKNaresh) కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా చేసాడు. #AnniManchiSakunamuleReview

ఇక గౌతమి,(Gautami) సంతోష్ శోభన్ తల్లిగా చూడటం చాలా ఫ్రెష్ గా వుంది. అలాగే గౌతమి కూడా అత్యుత్తమ ప్రతిభ కనపరించింది. ఆమె ఎన్నో సినిమాలు చేసిన నటి, చాలా బాగా చేసింది. గౌతమ్ వలన ఈ సినిమా స్థాయి కూడా పెరిగింది అనే చెప్పాలి. అలాగే 'తొలిప్రేమ' లో పవన్ కళ్యాణ్ సిస్టర్ గా చేసిన వాసుకి (Vasuki) ఇందులో సంతోష్ శోభన్ సిస్టర్ గా కనపడుతుంది. ఆ పాత్రకి ఆమె బాగుంది. అలాగే షావుకారు జానకి (ShavukarJanaki) ఇంట్లో ఒక పెద్దామెలా బాగుంది. సంతోష్ బావ పాత్ర వేసిన పాత్ర నటుడికన్నా అతనికి గాత్ర దానం చేసిన రాహుల్ రవీంద్రన్ (RahulRavindran) గొంతు బాగుంది, అతనే కనపడుతున్నాడు స్క్రీన్ మీద. ఛాయాగ్రహణం బాగుంది, మంచి లొకేషన్స్ ని బాగా కేప్చర్ చేశారు. మిక్కీ జె మేయర్ సంగీతం సాఫ్ట్ గా వుంది, నేపధ్య సంగీతం ఇంకా బాగుంది.

చివరగా, 'అన్నీ మంచి శకునములే' మంచి ఫీల్ గుడ్ సినిమానే, కాకపోతే చాలా స్లోగా ఉంటుంది నేరేషన్. ప్రేమ సన్నివేశాలు, ఆ పాత పాటలకు డాన్స్ సన్నివేశాలు లాంటివి కొంచెం కట్ చేస్తే, సినిమా ఇంకా కొంచెం బాగా తీయొచ్చు అని అనిపిస్తుంది. సీనియర్ నటులతో పాటు, లీడ్ పెయిర్ కూడా మంచి నటన కనపరిచారు. అక్కడక్కడా సన్నివేశాలు హృదయాలను హత్తుకుంటాయి, అలాగే చివరి 20 నిముషాలు సినిమా పీక్స్ లో ఉంటుంది. ఇదొక టైం పాస్ చిత్రం.

Updated Date - 2023-05-18T14:10:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!