సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Michael Film Review: అదే పాత ప్రతీకార కథ!

ABN, First Publish Date - 2023-02-03T19:58:15+05:30

ఉన్న యువనటుల్లో సుందీప్ కిషన్ (Sundeep Kishan) కొంచెం వెనకపడ్డాడు అనిపించింది, ఎందుకంటే అతనికి ఒక మంచి విజయం కోసం చూస్తున్నాడు. అదీ కాకుండా రెండేళ్లు అతని సినిమా కూడా విడుదల కాలేదు. ఇప్పుడు రెండేళ్ల తరువాత ఒక పాన్ ఇండియా సినిమా 'మైఖేల్' (Michael) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నటీనటులు : సందీప్ కిషన్, దివ్యాంశ కౌశిక్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, అనసూయ, వరుణ్ సందేశ్, అయ్యప్ప శర్మ, అనీష్ కురువిల్లా తదితరులు

ఛాయాగ్రహణం : కిరణ్ కౌశిక్

సంగీతం : సామ్ సిఎస్

నిర్మాతలు: భరత్ చౌదరి, పి. రామ్ మోహన్ రావు

దర్శకత్వం : రంజిత్ జయకొడి

-- సురేష్ కవిరాయని

ఉన్న యువనటుల్లో సుందీప్ కిషన్ (Sundeep Kishan) కొంచెం వెనకపడ్డాడు అనిపించింది, ఎందుకంటే అతనికి ఒక మంచి విజయం కోసం చూస్తున్నాడు. అదీ కాకుండా రెండేళ్లు అతని సినిమా కూడా విడుదల కాలేదు. ఇప్పుడు రెండేళ్ల తరువాత ఒక పాన్ ఇండియా సినిమా 'మైఖేల్' (Michael) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్ కిషన్. దీనికి తమిళ దర్శకుడు రంజిత్ జయకొడి (Ranjith Jayakodi) దర్శకుడు కాగా, ఈ సినిమా కి చాలామంది తమిళ నటులను తీసుకున్నారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautam Vasudev Menon), విజయ్ సేతుపతి (Vijay Sethupathi), వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar) లాంటి పెద్ద పెద్ద నటులతో పాటు వరుణ్ సందేశ్ (Varun Sandesh) ఇందులో మొదటిసారిగా విలన్ పాత్రలో కనపడనున్నాడు. అలాగే అనసూయ (Anasuya) కూడా ఒక ప్రధాన పాత్రలో కనపడతుంది. ప్రచార చిత్రాలు కూడా ఆసక్తికరంగా ఉండటంతో ఈ 'మైఖేల్' సినిమా మీద అంచనాలు బాగానే వున్నాయి. అయితే సినిమా ఎలా ఉందొ చూద్దాం.

Michael story కథ:

ఈ కథ 1990 దశకం లో బొంబాయి లో జరిగింది. మైఖేల్ (సందీప్ కిషన్) జైలు లో పుట్టి అక్కడే పెరిగి తండ్రి ని చంపటానికి ముంబై లో అడుగుపెడతాడు. బొంబాయి లో నేర సామ్రాజ్యానికి చక్రవర్తి అయిన గురురాజ్ (గౌతమ్ వాసుదేవ్ మీనన్) ని ఒక వ్యక్తి చంపబోతుంటే మైకేల్ అడ్డుకొని గురురాజ్ ని రక్షించి అతనికి చాలా దగ్గరవుతాడు. తనని హత్య చెయ్యడానికి కుట్ర పన్నిన వాళ్ళని గురురాజ్ నలుగురిని చంపేస్తాడు, కానీ అయిదవ వాడు అయిన రతన్ (అనీష్ కురువిల్లా) ని, అతని కూతురు తీరా (దివ్యాంశ కౌశిక్)ని చంపమని మైఖేల్ ని పురమాయిస్తాడు. మైఖేల్ వీళ్ళని చంపటం కోసం ఢిల్లీ వెళ్లి ముందుగా తీరా తో స్నేహం చేసి ఆమె ప్రేమలో పడతాడు. మైఖేల్ తీరా కి దగ్గరవడం వలన రతన్ దొరికినా కూడా చంపకుండా విడిచిపెట్టేస్తాడు. అదే సమయం లో గురురాజ్ కొడుకు (వరుణ్ సందేశ్) పన్నిన ఒక కుట్ర బయట పడుతుంది. అతను పన్నిన కుట్ర ఏంటి? రతన్ ని చంపకుండా వదిలేసిన మైఖేల్ ని గురురాజ్ ఏమి చేసాడు? ఇంతకీ మైకేల్ కి తన తండ్రి దొరికాడా, అతన్ని చంపాడా? ఈ సందేహాలు అన్నిటికీ సమాధానాలు కావాలంటే సినిమా చూడాల్సిందే. (Michael review)

విశ్లేషణ:

దర్శకుడు రంజిత్ జయకొడి ఒక పాత చింతకాయ పచ్చడినే మళ్ళీ తీసుకొని దానికి కొత్తగా పోపు వేసాడు. అంతే, ఈ 'మైకేల్' సినిమా కూడా. ఇదేమి కొత్త కథ కాదు, కొత్తగా చెప్పలేదు కూడా. పాత కథలే తిప్పి తిప్పి చెప్పాడు. కథ 1980-90 దశకాల్లో ముంబై అండర్ వరల్డ్ గ్యాంగ్ మధ్య జరిగిన కథ. ఈ వార్ ల మధ్య అమ్మ సెంటిమెంట్, అమ్మాయి సెంటిమెంట్ కూడా ఉంటుంది. అయితే దర్శకుడు సినిమా కథ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు అనిపిస్తోంది. ఎందుకంటే పైన చెప్పిన రెండు సెంటిమెంట్స్ వున్నప్పుడు దానికి తగ్గట్టుగా భావోద్వేగాలు కూడా ఉండాలి కదా (Emotions), అవి మొత్తం ఈ సినిమాలో లోపించాయి.

ఇదిలా ఉంటే చాలా సన్నివేశాలు బాగా సాగదీశాడు దర్శకుడు. కథ పాతదే అయినా, కొత్తగా ఏమైనా వివరించడమో లేదా చూపించడం చేస్తే అది వేరేలా ఉండేది, అదీ లేదు. సినిమా స్టార్ట్ చెయ్యడం కూడా 'కెజిఫ్' సినిమా మొదలెట్టినట్టుగా కథ ఒకరు ఇంకొకరితో ఎలా చెప్తారో, అలానే ఈ 'మైకేల్' కథ కూడా ఒకరు ఇంకొకరితో చెప్తారు. అదీ కాకుండా అందులోలానే ఇందులో కూడా అమ్మ సెంటిమెంట్ కొనసాగించాడు. కానీ అది ఇందులో అంతగా పండలేదు.

మైకేల్ ముంబై వచ్చి గురునాథ్ ని రక్షించటం తరువాత అతనికి దగ్గరవ్వటం ఇవన్నీ బాగానే వున్నాయి. కానీ ఆ తరువాతే కొంచెం గాడి తప్పింది. సన్నివేశాలు మరీ సాగదీశాడు దర్శకుడు. కొంచెం స్లిక్ గా, ఫాస్ట్ గా తీసి ఉంటే బాగుండేది. మైకేల్ రతన్ ని చంపటం కోసం ఢిల్లీ వెళ్ళటం అక్కడ తీరా తో ప్రేమ అవన్నీ కొంచెం బోర్ గా అనిపించాయి. ఎందుకంటే ఆ సన్నివేశాలు వూరికే సాగదీసాడు, అందులో ఫీల్ అస్సలు కనిపించదు. ఒక అమ్మాయి కోసం మైకేల్ అనే వ్యక్తి ఎంత దూరం అయినా వెళ్ళాడు అంటే, ఆ అమ్మాయి మీద అంత ప్రేమ ఉండేట్టు చూపించాలి, అంటే ఫీల్ అవ్వాలి ప్రేక్షకుడు, అది మిస్ అయింది సినిమాలో. అలాగే అమ్మ సెంటిమెంట్ కూడా అంతగా పడలేదు. గ్యాంగ్ వార్స్ మరీ ఎక్కువ అయిపోయాయి. వీటన్నిటి మధ్య 'మైకేల్' సినిమా టోటల్ గా అదే పాత కథ, అదే మూస సినిమా అయిపొయింది. విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ ల ఎపిసోడ్ కొంచెం ఈలలు గోలలు చేయిస్తుంది. అంతే. ప్రేక్షకుడు అన్నీ ముందుగానే వూహిచినట్టుగానే సన్నివేశాలు అన్నీ ఉంటాయి, సినిమాలో చెప్పుకోదగ్గ విశేషాలు ఏమి కనిపించవు.

ఇక నటీనటుల విషయానికి వస్తే మైకేల్ పాత్ర కోసం సందీప్ కిషన్ కష్టపడ్డాడు అని తెలుస్తోంది కానీ అతని నటనలో ఇంకా ఆ కృత్రిమంగా నటించటం పోలేదు. ప్రతీ రోల్ ని ఆకళింపు చేసుకొని అందులో లీనమయి సహజంగా నటించడానికి ప్రతి నటుడూ చేస్తాడు, కానీ సందీప్ కిషన్ తన ఫిజిక్ చూపించటం లోనూ, పోరాట సన్నివేశాలు లోనూ బాగా చేస్తే సరిపోయింది అనుకున్నాడు. అది కాదు, మిగతా భావోద్వేగాలు కూడా బాగా పండించాలి. అలాగే ఈ సినిమాకి హీరో గౌతమ్ మీనన్ లా కనిపిస్తాడు. ఎందుకంటే మొదటి నుండీ చివరి వరకు వున్నది అతనే. అదీ కాకుండా, అతని పాత్రలో రెండు రకాల షేడ్స్ వున్నాయి అవి బాగా చేసాడు అతను. దివ్యాంశ కౌశిక్ కథానాయకురాలు, ఆమె చాల బాగుంది, అందంగా కూడా వుంది, కానీ ఆమె పాత్రని సరిగా డిజైన్ చెయ్యలేదు. ఇంకా విజయ్ సేతుపతి, వరలక్ష్మి శరత్ కుమార్ లు రెండో సగం లో వచ్చి ప్రేక్షకులకు కొంచెం ఎంటర్ టైన్ మెంట్ ఇస్తారు. వరుణ్ సందేశ్ బాగున్నాడు కానీ, కొంచెం ఓవర్ చేసాడు అనిపిస్తుంది, కానీ అతనికి ఈ నెగటివ్ రోల్ చెయ్యడం కెరీర్ కి ఉపయోగపడుతుంది. అలాగే అనసూయ పాత్ర కూడా కొంచెం ఓవర్ గా వుంది. అనీష్ కురువిల్లా, అయ్యప్ప శర్మ కూడా పరవాలేదు. ఇంకా మిగతా చాలామంది కనపడుతూ వుంటారు. మాటలు మామూలుగా వున్నాయి, ఛాయాగ్రహణం చాలా బాగుంది, సినిమాకి 90వ దశకంలో ఉన్నట్టు బాగా చూపించాడు. నేపధ్య సంగీతం కూడా బాగుంది. సాంకేతిక విలువలు చక్కగా వున్నాయి.

చివరగా 'మైఖేల్' పాత కథే అయినా ఒక యాక్షన్ మూవీ గా తీయొచ్చు కానీ దర్శకుడు చాల సన్నివేశాలు సాగదీసి, భావోద్వేగాలు లేకుండా, ఫీల్ లేకుండా సినిమా కొంచెం బోర్ కొట్టించాడనే చెప్పాలి. పాన్ ఇండియా మీద పెట్టిన దృష్టి, కథ మీద కూడా కొంచెం పెడితే సినిమా బాగుండేది. చాలామంది పెద్ద నటులు ఈ సినిమాలో వున్నారు అని చెప్పుకోవటం కంటే, వాళ్ళకి మంచి రోల్ ఇచ్చి వాళ్ళతో బాగా నటింప చేస్తే అప్పుడు టికెట్ కొన్న సగటు ప్రేక్షకుడికి ఆనందంగా ఉంటుంది.

Updated Date - 2023-02-03T19:58:17+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!