Kotabommali twitter review: ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్ ని టార్గెట్ చేసారా?
ABN, First Publish Date - 2023-11-24T09:56:29+05:30
కోటబొమ్మాళి పీఎస్ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా గురించి నెటిజన్స్ తో పాటు సెలబ్రిటీస్ కూడా చాలా ప్రసంశలు కురిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితి ఎలా వుందో చూపించనట్టుగా నెటిజన్స్ అంటున్నారు.
నటీనటులు: శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళి శర్మ తదితరులు
సంగీతం: మిథున్ ముకుందం
ఛాయాగ్రహణం: జగదీశ్ చీకటి
నిర్మాతలు: బన్నీ వాసు, విద్య కొప్పినీడి
రచన దర్శకత్వం: తేజ మార్ని
మలయాళంలో హిట్ అయిన 'నయట్టు' #Nayattu సినిమాని తెలుగులో 'కోటబొమ్మాళి పీఎస్' #KotabommaliPS Twitter Review గా నిర్మించారు. తేజ మార్ని దర్శకుడు, బన్నీ వాసు, విద్య కొప్పినీడి నిర్మాతలు. మలయాళంలో జోజు జార్జి పోషించిన పాత్రని తెలుగులో శ్రీకాంత్ పోషించాడు. రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ ఇతర ముఖ్య తారాగణం.
మలయాళం సినిమా ఒక డార్క్ కథతో కూడుకున్నది. ప్రస్తుత సమాజంలో రాజకీయనాయకులకి, పోలీసు వ్యవస్థకి మధ్య జరిగిన అధికార పోరులో పోలీసు వ్యవస్థ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది, అందుకు కొంతమంది పోలీసులు ఎలా బలయ్యారు అనేది కథ. ఇదే తెలుగులో అలాగే తీసినట్టుగా కనపడుతోంది. అయితే తెలుగులో తీసినప్పుడు ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ పరిస్థితులు కనిపిస్తూ వుంటాయని నెటిజన్స్ అంటున్నారు.
అలాగే ఈ సినిమాని చాలామంది సెలబ్రిటీస్ చూసి మెచ్చుకుంటున్నారు. దర్శకులు హరీష్ శంకర్ అయితే ప్రశంసల వర్షం కురిపించాడు. అలాగే ప్రస్తుత పరిస్థితులు, వ్యవస్థలు ఎలా ఉన్నాయో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది అని చెప్పాడు. చాలా పెద్ద నోట్ ఈ సినిమా గురించి రాసి పోస్ట్ చేసాడు హరీష్ శంకర్. శ్రీకాంత్ నటనని కూడా ప్రశంసించాడు.
మంచి కథలతో తన సినిమాల ద్వారా మెప్పించిన సెన్సిబుల్ దర్శకుడు చైతన్య దంతులూరి ఈ సినిమా ని ఎంతగానే ప్రశంసించారు. ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చినందుకు నిర్మాతలని అభినందించారు అతను. శ్రీకాంత్ నటనని చైతన్య ప్రశంసించారు. మురళి శర్మ పాత్ర బాగుంటుంది అని కూడా చెప్పారు.
యువ నటుడు నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఈ సినిమాపై ప్రశంశల వర్షం కురిపించాడు. ఇప్పుడే #KotaBommaliPS సినిమా చూసాను. ఇది ఒక ఈ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌లో అందరికీ కనెక్ట్ అయ్యే ఎమోషనల్ సినిమా. ఇంత మంచి సినిమాని తీసినందుకు బన్నీవాస్, విద్యాకొప్పినీడి, దర్శకుడు తేజమార్నిని అభినందిస్తున్నాను అని చెప్పాడు. అలాగే శ్రీకాంత్ నటనని ప్రశంసించాడు.