సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Baby film review: ముగ్గురి మధ్యలో నడిచే ప్రేమాయణం ఎలా ఉందంటే...

ABN, First Publish Date - 2023-07-14T12:25:39+05:30

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన 'బేబీ' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జాతీయ పురస్కారం సొంతం చేసుకున్న 'కలర్ ఫోటో' రచయిత, నిర్మాత అయిన సాయి రాజేష్ ఈ 'బేబీ' సినిమాకి దర్శకుడు. ముగ్గురి మధ్య నడిచే ఈ ప్రేమ కథ ఎలా వుందో చదవండి.

Baby Film Review
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా: బేబీ

నటీనటులు: ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య, నాగబాబు, లిరిష, కుసుమ, సాత్విక్ ఆనంద్, బబ్లూ, సీత, మౌనిక, కీర్తన తదితరులు

సంగీతం: విజయ్ బుల్గానిన్

ఛాయాగ్రహణం: ఎంఎన్ బాల్ రెడ్డి

నిర్మాత: ఎస్.కె.ఎన్ (SKN)

రచన, దర్శకత్వం: సాయి రాజేష్

-- సురేష్ కవిరాయని

ఆమధ్య విడుదల అయినా 'కలర్ ఫోటో' #ColourPhoto అనే సినిమాకి జాతీయ పురస్కారం (NationalAward) వచ్చింది. ఆ సినిమాకి, రచయిత, నిర్మాత సాయి రాజేష్ (SaiRajesh). అదే సాయి రాజేష్ ఇప్పుడు 'బేబీ' #BabyFilmReview అనే సినిమాకి దర్శకత్వం వహించాడు, ఇది ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో విజయ్ దేవరకొండ (VijayDeverakonda) తమ్ముడు ఆనంద్ దేవరకొండ (AnandDeverakonda) కథానాయకుడిగా చేసాడు, అలాగే వైష్ణవి చైతన్య (VaishnaviChaitanya) అనే తెలుగు అమ్మాయిని కథానాయకురాలిగా దర్శకుడు పరిచయం చేసాడు. ఆమె ఇంతకు ముందు చిన్న చిన్న పాత్రలు వేసింది, అలాగే యూట్యూబ్ లో వీడియోస్ చేసి పేరు తెచ్చుకుంది. ఇంకొక కథానాయకుడి పాత్రలో విరాజ్ అశ్విన్ (VirajAshwin) కూడా నటించాడు. #BabyTheMovie జర్నలిస్ట్ నుండి, మేనేజర్, ఇప్పుడు నిర్మాతగా మారిన ఎస్ కె ఎన్ (శ్రీనివాస్) (SKN) దీనికి నిర్మాత. ఇంతకీ ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Baby story కథ:

ఈ సినిమాలో నటుల అసలైన పేర్లే కథలో కూడా పెట్టాడు దర్శకుడు. వైష్ణవి (వైష్ణవి చైతన్య) బస్తీలో అమ్మాయి, స్కూల్ లో చదువుతూ ఉంటుంది. ఆమె ఎదురింటిలో ఉన్న ఆనంద్ (ఆనంద్ దేవరకొండ) అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. ఆలా ఇద్దరూ స్కూల్ నుండే ప్రేమలో పడతారు. పదో తరగతి ఫెయిల్ కావడంతో ఆనంద్ ఆటో డ్రైవర్ అవుతాడు. వైష్ణవి మాత్రం చదువుతూ ఆలా ఇంజనీరింగ్ కాలేజీ లో చేరుతుంది. #BabyFilmReview కాలేజీలో వైష్ణవికి మొదట్లో బస్తీ పిల్లా అని అందరూ అంటూ వుంటారు, కానీ కొంతమంది ఆమెతో స్నేహం పెంచుకుంటారు, వారివలన వైష్ణవిలో చాలా మార్పు వస్తుంది. ఆలా పరిచయం అయినా వాళ్లలో విరాజ్ (విరాజ్ అశ్విన్) అనే అబ్బాయికి దగ్గర అవుతుంది. బస్తీ నుండి వచ్చే వైష్ణవి, ఒక్కసారిగా ఆధునిక యువతిగా తయారవుతుంది. పబ్ లకి, షికార్లకి, మందుకు కూడా అలవాటు పడుతుంది. విరాజ్ పుట్టిన రోజు నాడు పబ్ కి వెళ్లి అతనితో రొమాన్స్ చేస్తుంది. అయితే ఇంకో పక్క ఆనంద్ వైష్ణవిని ఘాడంగా ప్రేమిస్తూనే ఉంటాడు? #BabyTheMovie విరాజ్ తో వైష్ణవి సన్నిహితంగా మెలుగుతోందని ఆనంద్ కి తెలిసిపోయిందా? వైష్ణవికి స్కూల్ నుండే ఒక బాయ్ ఫ్రెండ్ వున్నాడని విరాజ్ కి తెలుసా? అసలు వైష్ణవి చివరికి ఎవరిని పెళ్లి చేసుకుంటుంది? అబద్దాలు చెపుతూ ఇద్దరినీ మేనేజ్ చేస్తున్న వైష్ణవి జీవితం చివరికి ఏమైంది? ఇవన్నీ తెలుసుకోవాలంటే 'బేబీ' సినిమా చూడండి.

విశ్లేషణ:

ప్రేమ కథలు చాలా వచ్చాయి తెలుగులో. స్కూల్, కాలేజీ, ఇంకా టీనేజ్ ప్రేమ కథలు చాలానే చూసాం కూడా. అయితే ఇలాంటి ప్రేమ కథలు తీసేటప్పుడు అందులో భావోద్వేగాలు, ఆ చిన్న వయసులో యువత చేసే చిన్న చిన్న తుంటరి పనులు అవన్నీ కూడా తెరమీద ఆసక్తికరంగా చూపించగలిగితే ఆ సినిమా ప్రేక్షకులకి నచ్చే అవకాశాలు ఎక్కువ అనటంలో సందేహం లేదు. దర్శకుడు సాయి రాజేష్ ఆలా యువత నాడి పట్టుకున్నాడు అనుకుంటా, లేదా ఎక్కడైనా అతను చూసాడా ఏంటో మరి, ఈ 'బేబీ' అనే సినిమాతో ఒక వైవిధ్యమైన ప్రేమ కథని చూపించాడు. చూపించటమే కాకుండా అన్నీ సహజంగా తెరమీద ప్రేక్షకులకు కథని నేరేట్ చేసాడు. ఇప్పటి యువత ఆలోచన సరళికి తగ్గట్టుగా ఈ 'బేబీ' కథని రాసుకున్నాడు, అలానే చూపించాడు.

అయితే ఇందులో కథ ఏంటిరా అంటే పెద్దగా కనిపించదు. బస్తీలో పెరిగే అమ్మాయి, అక్కడ అబ్బాయిని ప్రేమిస్తుంది, అతన్నే పెళ్లి చేసుకుంటాను అనుకుంటుంది. ఆ అబ్బాయి పదవతరగతి తప్పినా, అతన్నే ఇష్టపడుతుంది. అయితే ఈ బస్తీ అమ్మాయి కాలేజీకి వెళ్లేసరికి ఆమె ఆలోచన ధోరణి మారుతుంది. అక్కడ పరిస్థితులు, మిగతా అమ్మాయిలు, అబ్బాయిలను చూసి ఆమె వాళ్ళతో సమానంగా మారిపోతుంది. ఎంతో అమాయకంగా, ఏమీ తెలియనట్టు ఉంటే ఒక బస్తీ అమ్మాయి, పూర్తిగా మారిపోతుంది. ఆధునికంగా తయారవుతుంది, కొత్త అలవాట్లు నేర్చుకుంటుంది, ఆ సమయంలో తప్పులు చేస్తుంది. తరువాత గందరగోళంలో పడుతుంది. స్కూల్ నుండి ప్రేమిస్తున్న బస్తీ అబ్బాయిని వదులుకోవాలా, లేదా కాలేజీలో కొత్తగా పరిచయం అయిన ధనవంతుడి కొడుకుతో ఉండాలా, ఇలా ఆలోచిస్తూ ఆమె చివరికి ఏమి చేసింది అన్నది కథ. దర్శకుడు సాయి రాజేష్ బలమైన పాయింట్ రచన. ఈ సినిమాకి మాటలు చాలా బాగా రాసాడు, దానికి తోడు సంగీతం కూడా సరిగా కుదిరింది. వీటన్నిటికీ సాయం నటీనటుల నుండి మంచి నటన రాబట్టుకోగలిగాడు దర్శకుడు. ఇవ్వనీ తోడయి ఈ సినిమా బాగా రావటానికి దోహదపడింది. కొన్ని కొన్ని సన్నివేశాల్లో భావోద్వేగాలు కూడా బాగా పలికించాడు.

వైష్ణవి, ఆనంద్ మధ్య జరిగే సంఘర్షణ, నువ్వుచిన ఫోను డబ్బా ఫోన్ అనటం, ఆ తరువాత సన్నివేశాలు బలంగా తీసాడు. అలాగే చివర్లో వైష్ణవి ఆనంద్ ని వెతుక్కుంటూ వెళ్తే, ఆనంద్ ఆమెని తిడుతూనే చూడకుండా వుండలేకపోవటం, ఆటోలో వైష్ణవికి ఇద్దరు అబ్బాయిలు ఒకరి తరువాత ఒకరు ఫోన్ చేసినప్పుడు ఆమె చెప్పే 'అన్నయ్య' అబద్ధం నవ్వు తెప్పిస్తుంది. ఇలాంటివి చాలానే ఉంటాయి సినిమాలో.

అయితే ఈ సినిమాలో చాలా సన్నివేశాలు కొంచెం సాగదీసాడు అనిపిస్తుంది, ముఖ్యంగా మొదటి సగంలో. అవన్నీ కొంచెం ట్రిమ్ చేస్తే ఈ సినిమా ఇంకా బాగుంటుంది అనిపిస్తోంది. ఇది ఒక వైవిధ్యమైన ప్రేమ కథ అని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే క్లైమాక్స్ అందరూ అనుకుంటున్నట్టు ఉండదు. అలాగే ముగ్గురి మధ్య నడిచే ప్రేమాయణంలో గెలుపోటములు కాకుండా, ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయినప్పుడు ఆ మనుషులు ఎలా తయారవుతారు అని చూపించాడు దర్శకుడు. టీనేజ్ ప్రేమలో వుండే సాధక బాధకాలు, ఆ అట్రాక్షన్, ఆ చిన్న చిన్న తగాదాలు, ఆ వయసులో చేసే తప్పులు అవన్నీ మనం చూస్తూ ఉంటాం ఎక్కడో ఒక దగ్గర. #BabyTheMovie అవన్నీ ప్రేక్షకులని బాగా అలరిస్తాయి, ముఖ్యంగా యువతని. అయితే దర్శకుడు విరాజ్ అశ్విన్, వైష్ణవి మధ్య నడిచే ఆ రొమాన్స్ సన్నివేశాల నిడివి తగ్గిస్తే బాగుండేది. ఈ సినిమా క్రెడిట్ అంతా దర్శకుడు సాయి రాజేష్ కి దక్కుతుంది, ఎందుకంటే ఈ సినిమాలో మూడు ప్రధాన పాత్రలు, వాళ్ళ చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. అలాగే సంగీతం, ఛాయాగ్రహణం అన్నీ ఈ సినిమాకి బాగా హెల్ప్ అయ్యాయి అని చెప్పొచ్చు. ఒక కల్ట్ ప్రేమ కథని తెరమీద చూపించాడు సాయి రాజేష్.

ఇక నటీనటుల విషయానికి వస్తే, ఆనంద్ దేవరకొండ అన్న విజయ్ లాగే మంచి నటుడు అని ఇంతకు ముందే ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాతో అతని ప్రతిభ మరొక పెట్టు పైకి వెళుతుంది. అతని కెరీర్ లో ఈ సినిమా ఒక మైలురాయి అని చెప్పొచ్చు. #BabyFilmReview చివర్లో తన ప్రేయసిని ప్రేమిస్తూనే, ఆమె చేసిన తప్పు పనికి ద్వేషిస్తూ ఉంటాడు. ఆమెని వదులుకోలేడు, ఆలా అని దగ్గరికి తీసుకోలేడు ఇలా తపన, మధన పడే పాత్రలో మంచు భావాలతో ఆకట్టుకున్నాడు. అన్నలాగే ఈ తమ్ముడికి కూడా తన వాయిస్, మాట చెప్పే విధానం మంచి హెల్ప్. ఇక తెలుగు తెరకి మరో అద్భుతమైన తెలుగు అమ్మాయి పరిచయం అయింది వైష్ణవి పాత్ర ద్వారా వైష్ణవి చైతన్య. ఎవరన్నారండీ తెలుగు అమ్మాయిలు దొరకటం లేదని, అది చెప్పడానికి సాకు మాత్రమే, ఒకసారి అవకాశం ఇస్తే మేము ఏంటో చూపిస్తాం అని వైష్ణవి ఈ 'బేబీ' సినిమా ద్వారా చూపించింది. బస్తీ అమ్మాయిగా, ఆధునిక యువతిగా, గందరగోళం లో పడి ఏమి చెయ్యాలో తెలియక ఇలా అన్ని ఛాయలు ఒకే పాత్రతో మెప్పించి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది ఈ అమ్మాయి వైష్ణవి. ఆమెకి మంచి భవిష్యత్తు వుంది. చాలా రోజుల తరువాత ఒక తెలుగు అమ్మాయి కథానాయకురాలిగా కనిపించటం బాగుంది, ఆమె నటనలో అత్యుత్తమ ప్రతిభ కనపర్చటం ఇంకా బాగుంది. #BabyTheMovie సినిమా ఆమె మీదే ఎక్కువ ఆధారపడి వుంటుంది. విరాజ్ అశ్విన్ అందంగా వున్నాడు, తనకి ఇచ్చిన పాత్రని బాగా చేసాడు. అయితే మిగతా ఇద్దరితో పోలిస్తే ఇతని పాత్ర ఎక్కువ రెండో సగం లో వస్తుంది, ఇదే కీలకం సినిమాకి. మంచి నటుడు అయ్యే అవకాశాలు వున్నాయి. ఇక మిగతా పాత్రల్లో వైవా హర్ష, కుసుమ, నాగబాబు అందరూ బాగా సపోర్ట్ చేశారు.

చివరగా, 'బేబీ' సినిమా ఒక వైవిధ్యమైన ప్రేమ కథ. ప్రేమించుకోవటం, విడిపోవటం, కలుసుకోవటం ఇవన్నీ మనం చూసే రెగ్యులర్ ప్రేమ కథలు, కానీ ఇందులో దర్శకుడు సాయి రాజేష్ ఇంకో విధమైన కోణం చూపించాడు. ముగ్గురి మధ్య నడిచే ఈ ప్రేమాయణం సహజంగా వుండి అక్కడక్కడా, నవ్వులు, భావోద్వేగాలు పండిస్తుంది. ముఖ్యంగా సంగీతం, మాటలు ఇంకా నటీనటుల అద్భుత నటన ఆకట్టుకుంటుంది. దర్శకుడు సాయి రాజేష్ కి ఫుల్ మార్క్స్ ఇవ్వాలి.

Updated Date - 2023-07-14T16:07:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!