సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Emi Sethura Linga Web Film review: ఈ వెబ్ సినిమా ఎలా ఉందంటే...

ABN, First Publish Date - 2023-05-24T20:33:15+05:30

'ఏమి సేతురా లింగ' అనే సినిమా ఆహా ఓటిటి లో విడుదల అయింది. సందీప్ దీనికి రచయిత, దర్శకుడు. ఒక అబ్బాయి సాఫ్ట్ వేర్ వుద్యోగం చేస్తున్న, సంతోషంగా వుండలేకపోతాడు, కానీ అతని జీవితంలోకి స్వేచ్ఛ అనే ఒక అమ్మాయి వచ్చి అతన్ని ఎలా మారుస్తుంది, అతను ఏమి పోగొట్టుకున్నాడు అనే విషయం చెప్తుంది.

Emi Sethura Linga Review
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెబ్ సినిమా: ఏమి సేతురా లింగ (EmiSethuraLingaReview)

నటీనటులు: వినోద్ వర్మ (VinodVarma), జ్ఞానేశ్వరి కాండ్రేగుల, కేశవ్ దీపక్, మేకా రామకృష్ణ, ఆనంద చక్రపాణి తదితరులు

ఛాయాగ్రహణం: అభిరాజ్ నాయర్

రచన, దర్శకత్వం: సందీప్

నిర్మాతలు: మురళీకృష్ణ, సందీప్

విడుదల: ఆహా ఓటిటి లో (Aha)

-- సురేష్ కవిరాయని

ఈమధ్య ఓటిటి లు వచ్చాక, చిన్న నిర్మాతలకి, దర్శకులకి తమ సినిమాలు థియేటర్ లో విడుదల కాకపోయినా, ఎదో ఒక ఓటిటిలో విడుదల చేసుకోవచ్చు అన్న ధీమా అయితే వచ్చింది. అలాగే కొందరు కేవలం ఓటిటి ల్లో విడుదల చెయ్యడం కోసమే సినిమాలు తీస్తున్నారు కూడా. ఆలా తీసినదే ఈ 'ఏమి సేతురా లింగ' #EmiSethuraLingaReview అనే సినిమా. ఇది ఆహా #Aha ఓటిటి లో విడుదల అయింది. దీనికి సందీప్ దర్శకుడు, రచయిత కూడాను.

Emi Sethura Linga story కథ:

భాను (వినోద్ వర్మ) ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తూ ఉంటాడు. ఎప్పుడూ ఉద్యోగానికి లేట్ గా వెళుతూ ఉంటాడు, బాస్ చేత చివాట్లు తింటూ ఉంటాడు. మంచి వుద్యోగం వున్నా, భాను కి జీవితంలో ఆనందం ఉండదు, అలాగే ఎప్పుడూ ఎదో పోగొట్టుకున్న వాడిలా ఉంటాడు. ఎవరో రిలేషన్ షిప్ చూసుకో బాగుంటుంది అంటే, అదీ ట్రై చేస్తాడు, కానీ అందులో కూడా సఫలం కాలేడు. ఒక అమ్మాయికి ఒక గోల్డ్ రింగ్ ఇచ్చి ప్రొపోజ్ చేద్దాం అనుకుంటాడు కానీ ఆమె మోసం చేసి ఆ ఉంగరం పట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ సమయంలో స్వేచ్ఛ (జ్ఞానేశ్వరి కాండ్రేగుల) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఆమె అతని జీవితంలోకి వచ్చాక అతనిలో ఎటువంటి మార్పు వచ్చింది, అతను కోరుకున్న సంతోషం అతనికి దక్కిందా అన్నదే మిగతా సినిమా.

విశ్లేషణ:

ఒక వ్యక్తికి తాను ఏ రంగంలో ఏమి చెయ్యాలని అనుకుంటాడో అందులో చేస్తేనే సంతోషం ఉంటుంది. తల్లిదండ్రుల బలవంతం వలనో, లేదా వుద్యోగం చెయ్యాల్సి వస్తుందని చెయ్యాలనో, ఇలా ఇష్టం లేని దాంట్లో చేస్తే అతనికి సంతోషం ఉండదు అని దర్శకుడు చెప్పాలని అనుకోని వుండి ఉంటాడు. ఎందుకంటే సినిమాలో చివరి 25 నిముషాలు సినిమా కొంచెం అర్థం వచ్చేట్టు తీసాడు. దర్శకుడు చాలా సేపు కథలోకి రాకుండా, టీవీ సీరియల్ లాగా చూపించాడు. కథానాయకుడు ఆఫీస్ కి లేట్ గా రావటం, బాస్ తిట్టడం అవన్నీ అంత సహజంగా లేవు. అలాగే నేరేషన్ ఇంకా కొంచెం స్పీడ్ గా చూపిస్తే బాగుండేది. సీరియల్స్ లో చూపించినట్టుగా, డైలాగ్స్ చెప్పకుండా వాళ్ళ మొహాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి వూరికే విసుగుపుట్టించాడు. అయితే చివరి 25 నిముషాలు మాత్రం కొంచెం బాగుంది. అంతే. సందీప్ కథ మీద ఇంకా కొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఎందుకంటే కాన్సెప్ట్ బాగుంది, కానీ నేరేషన్ చాలా స్లో గా ఉంటుంది. సన్నివేశాలు సహజంగా ఉంటే ఇంకా బాగుండేది.

ఇక నటీనటుల విషయానికి వస్తే, వినోద్ వర్మ (VinodVarma) కథానాయకుడిగా నటించాడు, కానీ ఇంకా కొంచెం హోమ్ వర్క్ చెయ్యాలి. కొన్ని సన్నివేశాల్లో సహజత్వం లేదు. జ్ఞానేశ్వరి కాండ్రేగుల (JnaneswariKandregula) బాగా చేసింది, ఆ పాత్రలో మెప్పించింది. కేశవ్ దీపక్ (KesavDeepak) సాఫ్ట్ వేర్ కంపెనీ బాస్ గా కనిపిస్తాడు. ఆనంద చక్రపాణి (AnandaChakrapani) సినిమాల్లో నటించే అనుభవం వుంది కాబట్టి తండ్రిగా బాగా చేసాడు. మిగతా వాళ్ళు కూడా బాగానే సపోర్ట్ చేశారు.

చివరగా, ఈ 'ఏమి సేతురా లింగ' అనే సినిమాలో 'ఏమి చూతురా లింగ' అన్నట్టుగా చూడటానికి ఏమీ లేదు. చివర 25 నిముషాలు ఈ సినిమా కొంచెం బాగుంటుంది. ఓటిటి లో విడుదల అవడమే కరెక్టు. సీరియల్స్ చూసి నచ్చే ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చుతుందేమో మరి!

Updated Date - 2023-05-24T20:33:15+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!