Annapurna Photo Studio film review: ఇదొక పాత చింతకాయ పచ్చడి
ABN, First Publish Date - 2023-07-21T16:14:18+05:30
'పిట్టకథ' సినిమాతో తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమైన చందు ముద్దు ఇప్పుడు 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 'పెళ్లి చూపులు' లాంటి సినిమా నిర్మించిన యష్ రంగినేని ఈ సినిమాని నిర్మించడమే కాకుండా, ఇందులో ఒక ప్రధాన పాత్ర కూడా పోషించారు.
నటులు: చైతన్య రావు, లావణ్య, మిహిర, ఉత్తర, లలిత్ ఆదిత్య, వైవా రాఘవ, యష్ రంగినేని తదితరులు
సంగీతం: ప్రిన్స్ హెన్రీ
ఛాయాగ్రహణం: పంకజ్ తొట్టాడ
నిర్మాత: యష్ రంగినేని
రచన, దర్శకత్వం: చెందు ముద్దు
-- సురేష్ కవిరాయని
ఈమధ్య చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బాగా హడావిడి చేస్తున్నాయి. అందులో కొన్ని హిట్ అవుతున్నాయి, కొన్ని బోల్తా పడుతున్నాయి. అయితే ఏ ఓటిటి(OTT)లు వచ్చిన దగ్గర నుంచీ, చిన్న సినిమాలు ఎక్కువగానే వస్తున్నాయి. థియేటర్ లో ముందు విడుదల చేస్తే కానీ ఓటిటిలో విడుదల చెయ్యకూడదు అని అనుకుంటున్నారేమో, అందుకని చాలా చిన్న సినిమాలు చూస్తుంటే ఇదో ఓటిటి సినిమాలా అనిపిస్తోంది అనేలా వున్నాయి. ఆలా కొన్ని ఉంటే, 'బేబీ' #BabyMovie లాంటి చిన్న సినిమా చాలా పెద్ద ఘన విజయం సాధించి సినిమాలో విషయం ఉంటే అది చిన్న, పెద్దా తేడా లేకుండా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుంది అనేట్టుగా చెప్పింది. ఈమధ్య విడుదలైన చిన్న సినిమాలలో 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' #AnnapurnaPohotoStudioFilmReview ఒకటి. దీనికి చెందు ముద్దు (ChenduMuddu) దర్శకుడు, ఇతను ఇంతకు ముందు 'పిట్టకథ' #Pittakatha అనే సినిమా చేసాడు. ఇది రెండో సినిమా. 'పెళ్లిచూపులు' #PelliChoopulu లాంటి సినిమా నిర్మించిన యష్ రంగినేని (YashRangineni) దీనికి నిర్మాత. ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
Annapurna Photo Studio story కథ:
ఇది 1980లో గోదావరి #Godavari దగ్గర వున్న కపిలేశ్వరపురం అనే పల్లెటూరులో జరిగిన కథ. చంటి (చైతన్య రావు) అనే వయసైపోయిన పెళ్లికాని అబ్బాయి తన స్నేహితులతో అన్నపూర్ణ ఫోటో స్టూడియో నడుపుతూ ఉంటాడు. తండ్రి చుట్టుపక్కల వున్న చిన్న చిన్న వూర్లో వాళ్లందరికీ జ్యోతిష్యం చెపుతూ, అందరి చేత గౌరవం పొందుతూ వుంటారు. చంటికి వయసు పైబడుతున్న కొద్దీ పెళ్లి కాదు, అందుకని స్నేహితులు, ఊళ్ళోవాళ్ళు ఎగతాళి చేస్తూ వుంటారు. అదే వూర్లో చదువుకోవటానికి గౌతమి (లావణ్య) అనే అమ్మాయి వస్తుంది. ఆ అమ్మాయితో చంటి ప్రేమలో పడతాడు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు, కానీ చంటి తండ్రి గౌతమికి తన కొడుక్కి ఇంతవరకు ఎందుకు పెళ్లి చెయ్యలేదో దాని వెనక వున్న ఒక షాకింగ్ రహస్యం చెపుతాడు. ఇది తెలిసి గౌతమి ఏమి చేసింది, పెళ్లికి ఒప్పుకుందా లేదా? చంటి ఒక హత్య కేసులో ఎలా ఇరుక్కున్నాడు? ఎందుకు అతను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు? ఇవన్నీ తెలియాలంటే 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సినిమా చూడాల్సిందే ! #AnnapurnaPohotoStudioReview
విశ్లేషణ:
దర్శకుడు చందు ముద్దు ఇంతకు ముందు 'పిట్టకథ' అనే సినిమా తీసాడు. అది ఒక బడ్జెట్ సినిమా, అయినా ఓటిటిలో ఆ సినిమాని విపరీతంగా చూసి మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' సినిమా రెండోది. #AnnapurnaPohotoStudioReview ఇది ఒక పల్లెటూర్లో వున్న ఓ పెళ్లికాని అబ్బాయి కథ. వెంకటేష్ (VenkateshDaggubati) ని 'మల్లేశ్వరి' #Malliswari సినిమాలో పెళ్లికాని ప్రసాద్ అని పిలుస్తూ వుంటారు, అదొక పూర్తి కామెడీ సినిమా. అయితే ఇందులోకూడా పెళ్లికాని వయసుపైబడిన అబ్బాయి కథే. అయితే ఈ కథ పేపర్ మీద రాసుకొని చదువుకోటానికి బాగుంటుంది, కానీ అది స్క్రీన్ మీద చూపించటంలోనే దర్శకుడు ప్రతిభ అంతా ఇమిడి ఉంటుంది. ఇక్కడే చందు ముద్దు మొత్తం ఫెయిల్ అయ్యాడు అని చెప్పాలి.
సినిమా మొదలవ్వటమే కొత్త పోలీస్ ఆఫీసర్ ఛార్జ్ తీసుకోవడానికి వస్తూ ఉంటే కొండ మీద నుండి చంటి ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, అతను రాసుకున్న పేపర్స్ పోలీసులకు దొరకటం, వాళ్ళు అవి చదువుతుంటే సినిమా కథ మొదలవుతుంది. ఇవన్నీ చాలా సిల్లీ గా ఉంటాయి. ఈ కథ చాలా మెల్లగా ప్రతి సన్నివేశం సాగదీసేలా వెళుతూ ఉంటుంది. కథ పాత చింతకాయ పచ్చడిలా 80లో జరిగేది, అందుకో కొత్తగా ఏమీ ఉండదు, అదీ కాకుండా ఇందులో వచ్చే సన్నివేశాలు అన్నీ కూడా అవుట్ డేటెడ్ అయిపోయినవే. ఒక జోక్ కానీ, ఒక సన్నివేశం కానీ ప్రేక్షకుడిని నవ్వించడమో, ఆహ్లాదపరచడమో చెయ్యదు. పోనీ సన్నివేశాలు అయినా సహజంగా ఉంటాయా అనుకుంటే అవీ లేవు.
మధ్య మధ్యలో పోలీసులు గ్యాప్ ఇచ్చినప్పుడల్లా కథ మళ్ళీ ఆగటం, మళ్ళీ వాళ్ళు చదవటం, అవి ప్రేక్షకుడిని కొంచెం చికాకుకు గురి చేస్తాయి. అలాగే ఈ వయసుపైబడిన అబ్బాయి వెళ్లి కాలేజీ అమ్మాయిని ప్రేమించడం, వాళ్లిద్దరూ ప్రేమలో పడటం కొంచెం ఎబ్బెట్టుగానే కనిపించింది. ఎందుకంటే మధ్యలోనే చంటి క్లాస్ మేట్ ఒకామెని చూపించి పక్కనున్న ఆమె ఎవరు అని అడిగితే, మా అమ్మాయి అని చెప్పి, సంబంధాలు ఉంటే చెప్పు, నీకేమైనా అబ్బాయి ఉన్నడా అని అడుగుతుంది. మరి అలాంటి చంటికి కాలేజీలో చదువుతున్న అమ్మాయికి ప్రేమాయణం కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది కదా !
ఆ తరువాత చంటిని హత్య కేసులో ఇరికించటం, ఆత్మహత్య ఆ లాజిక్ లు అవన్నీ సరిగ్గా అనిపించలేదు. సినిమాలో ఒక్కటి మాత్రం బాగుంది, అదేంటంటే పచ్చని పొలాలు, గ్రామ వాతావరణం, కొండలు, వాగులు ఇవన్నీ చూడటానికి చాలా బాగున్నాయి. ఛాయాగ్రహణం బాగుంది. సంగీతం కూడా అంతంత మాత్రమే. ఆ పాటలు కూడా అంతగా గుర్తుపెట్టుకునేవి ఏవీ లేవు. ఆ డాన్సులు కూడా అదోలా వున్నాయి.
చంటిగా చైతన్య రావు (ChaitanyaRao) బాగానే నటించాడు. ఆ పాత్రకి అతను సరిపోయాడు. లావణ్య కూడా పల్లెటూరి అమ్మాయిలా బాగుంది. చంటి చెల్లెలు పద్దు పాత్రలో ఉత్తర కూడా పరవాలేదు అనిపించింది. ఇంక స్నేహితులుగా లలిత్ ఆదిత్య, మిహిర ఒకే అనిపించారు. మిగతావాళ్లు అందరూ బాగానే సపోర్ట్ చేశారు. కానీ చాలామంది కొత్తవాళ్లు లా అనిపించారు. అయితే ఒక్క విషయం మెచ్చుకోవాల్సింది వుంది, చాలామంది తెలుగువాళ్ళని పెట్టి ఈ సినిమా చేసినట్టు అనిపించింది. అలాగే గ్రామా వాతావరణాన్ని కూడా బాగా చూపించారు. #AnnapurnaPhotoStudioReview
చివరగా, 'అన్నపూర్ణ ఫోటో స్టూడియో' ఒక పాత చింతకాయ పచ్చడిలా ఉంటుంది. #AnnapurnaPhotoStudioReview ఈ కథని కొంచెం శ్రద్ధ పెట్టి రాసుకుంటే చాలా బాగా నేరేట్ చేసి తెర మీద చూపించవచ్చు కానీ అలా చెయ్యకుండా, చాలా డీలాగా పడిపోయాలా చూపించాడు దర్శకుడు. ప్రేక్షకుడుకి చాలా సహనం, ఓపిక ఉండాలి ఇలాంటి సినిమాలు చూడాలంటే, అంతే ఇక మీరు అర్థం చేసుకోండి.