సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Sattigani Rendekaralu Film Review: అంత పెద్ద ప్రొడక్షన్ సంస్థ నుండి వచ్చిన సినిమా ఎలా ఉందంటే...

ABN, First Publish Date - 2023-05-29T18:46:09+05:30

ఒక పెద్ద నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ 'సత్తిగాని రెండెకరాలు' అనే ఒక వెబ్ సినిమా తీసింది. ఇది ఆహా ఓటిటి లో విడుదల అయింది. 'పుష్ప' సినిమాలో కేశవ పాత్రలో మంచి పేరు సంపాదించినా జగదీష్ ఈ సినిమాలో కథానాయకుడు. వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి ఇంకా మరికొంతమంది నటీనటులు వున్న ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

Sattigani Rendekaralu Movie Poster
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సినిమా: సత్తిగాని రెండెకరాలు

నటీనటులు: జగదీష్ ప్రతాప్ బండారి, వెన్నెల కిషోర్, మోహన శ్రీ, రాజ్ తిరందాసు, అనీషా దామా, బిత్తిరి సత్తి, మురళీధర్ గౌడ్, రియాజ్ తదితరులు

ఛాయాగ్రహణం: విశ్వనాథ్ రెడ్డి సీహెచ్

సంగీతం: జై క్రిష్

నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

రచన, దర్శకత్వం: అభినవ్ రెడ్డి దండా

విడుదల: ఆహా ఓటిటి

-- సురేష్ కవిరాయని

జగదీష్ ప్రతాప్ బండారి (JagadeeshPrathapBandari) అనే పేరు 'పుష్ప' (Pushpa) సినిమా విడుదల తరువాత మారుమోగింది. సుకుమార్ (Sukumar) దర్శకత్వం వహించి, అల్లు అర్జున్ (AlluArjun) కథానాయకుడిగా నటించిన ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అనేది అందరికీ తెలిసిన విషయమే. అందులో అల్లు అర్జున్ తో పాటు మూవీ అంతా కనిపించిన మాత్ర కేశవ. ఆ కేశవ పాత్ర పోషించింది జగదీష్, ఆ సినిమాతో చాలా మంచి పేరు సంపాదించాడు. ఇప్పుడు అదే జగదీష్ కథానాయకుడిగా ఆ 'పుష్ప' సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ #MythriMovieMakers 'సత్తిగాని రెండెకరాలు' (Sattigani Rendakaralu) అనే వెబ్ సినిమా నిర్మించాడు. దీనికి అభినవ్ రెడ్డి దండా (AbhinavReddyDanda) దర్శకుడు. ఇందులో వెన్నెల కిశోర్ (VennelaKishore), మోహన శ్రీ, మురళీధర్ గౌడ్ (MuralidharGoud), అనీషా దామా తదితరులు నటించారు. ఇది ఆహా ఓటీటీ (Aha)లో విడుదలైంది. ఇంత పెద్ద నిర్మాణ సంస్థ నుండి వచ్చిన ఈ వెబ్ సినిమా ఎలా వుందో చూద్దాం.

Sattigani Rendakaralu story కథ:

సత్తి (జగదీష్)కి భార్య, ఇద్దరు పిల్లలతో ఒక గ్రామంలో బతుకుతూ ఉంటాడు. అతనికి వున్న ఆస్తి అంతా రెండెకరాల పొలం మాత్రమే, కానీ అతని తాత చనిపోతూ ఆ పొలం మాత్రం అమ్మకురా సత్తి అని చెప్పి చచ్చిపోతాడు. దాని మీద సరిగా పంట రాకపోయినా, బతుకు తెరువు కోసం అదే వూర్లో ఏవేవో చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటాడు. సత్తి కుమార్తెకి వైద్యం చెయ్యడానికి లక్షల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిసి, ఆ వూరు సర్పంచ్ (మురళీధర్ గౌడ్) సత్తిగానితో రెండెకరాలు అమ్మించేయాలని చూస్తాడు. ఎందుకంటే సత్తి ఆ పొలం అమ్మేస్తే సర్పంచ్ కి చాలా లాభం ఉంటుంది, అందుకని అతను అమ్మేయమంటాడు. ఈలోపల సత్తికి ఒక పొలంలో ప్రమాదం జరిగిన కారు ఒకటి కనపడుతుంది, వెంటనే కారు దగ్గరకి వెళతాడు, కారు డ్రైవర్ చనిపోతాడు. సత్తి కారులో వున్నా ఒక సూట్ కేసు కారు అద్దం పగలకొట్టి తీసుకుంటాడు. దానిని ఎలా ఓపెన్ చెయ్యాలో తెలియక తన స్నేహితుడు అంజి (రాజ్ తిరందాసు) దగ్గరకు వెళతాడు. అంజి చిన్న చిన్న దొంగతనాలు చేసి ఒకసారి జైలుకు కూడా వెళ్లి వస్తాడు. వాళ్లిద్దరూ కలిసి ఆ సూట్ కేసు ఓపెన్ చెయ్యడానికి ప్రయత్నం చేస్తూ వుంటారు. ఈలోపు హైదరాబాద్ లో లలిత్ (రియాజ్) అనే వ్యాపారి తన అనుచరులకు ఎలా అయినా ఆ కారులో వున్న సూట్ కేసు తీసుకురమ్మని, ఆ కారు ఆనవాలు లేకుండా చెయ్యమని ఒక ప్రొఫెషనల్ ని (వెన్నెల కిషోర్) పంపుతాడు. ఇంతకీ ఆ సూట్ కేసు లో ఏముంది? సత్తి, అంజి అది ఓపెన్ చేయగలిగారు? సత్తి రెండెకరాల భూమిని అమ్మేసాడా, అతని కూతురి వైద్యానికి డబ్బు ఎలా వచ్చింది? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

దర్శకుడు అభినవ్ రెడ్డి దండా ఒక మంచి కాన్సెప్ట్ ని తీసుకున్నాడు. ఒక వ్యక్తికి రెండెకరాల పొలం ఉంటుంది, అతని కూతురికి వైద్య సహాయం కోసం లక్షల డబ్బులు కావలి. ఆ పొలం అమ్మేయాలని అతనిమీద ఒత్తిడి వున్న సమయంలో అతనికి ఓ సూట్ కేసు దొరుకుతుంది. ఆ సూట్ కేసు కోసం హైదరాబాద్ నుండి ఒక ప్రొఫెషనల్ కిల్లర్ వస్తాడు. మధ్యలో ఒక అవినీతి పోలీస్ ఆఫీసర్. ఇవన్నీ కలిపి ఒక మంచి, క్రైమ్ కామెడీ తీయొచ్చు. కానీ దర్శకుడు అభినవ్ ఇవన్నీ కలిపి ఒక తెలుగు సీరియల్ కన్నా అర్ధానంగా ఈ వెబ్ సినిమా తీసాడు.

నేరేషన్ చాలా స్లో, అసలు కథ ఏమి చెప్పాలని అనుకున్నాడు, ఏమి చూపిస్తున్నాడు అనేది అతనికైనా అర్థం అయిందో లేదో మరి. టైటిల్ మాత్రం 'సత్తిగాని రెండెకరాలు' #SattiganiRendekaraluFilmReview అని పెట్టి, ఏదేదో తీసాడు, ఒక్క సన్నివేశం కూడా ఆసక్తికరంగా లేదు, అర్థవంతంగా లేదు. సినిమా అంత నత్తనడకలా ఎప్పుడు అయిపోతుందా అన్నట్టుగా ఉంటుంది. అయితే ఇది కేవలం టీవీ లో కాబట్టి, రిమోట్ మన చేతిలో ఉంటుంది కాబట్టి పరవాలేదు.

ఈ సినిమా తెలంగాణా నేపధ్యంలో సాగుతుంది. ఈమధ్య చాలా వెబ్ సినిమాలు, రెగ్యులర్ సినిమాలు తెలంగాణా నేపథ్యంలోనే వస్తున్నాయి. #SattiganiRendekaraluReview చాలా మంచిది. కానీ సరైన కథ లేకుండా, వూరికే పాత్రలకు తెలంగాణ యాస పెడితే సరిపోదు. మంచి కథ, పాత్రలని మలిచే తీరు తెలియాలి. అవేమీ లేకుండా ఈ 'సత్తిగాని రెండెకరాలు' #SattiganiRendekaraluFilmReview ప్రతి సన్నివేశం బోర్ కొట్టే విధంగా తీసాడు దర్శకుడు. బిత్తిరి సత్తి, వెన్నెల కిషోర్ లాంటి హాస్య నటులు వున్నా వాళ్ళని సరిగ్గా ఉపయోగించుకోలేక పోయాడు అనిపిస్తుంది.

ఇక నటీనటుల విషయానికి వస్తే, జగదీష్ సత్తిగా బాగా చేసాడు కానీ, పాత్రలో సరైన డెప్త్ లేదు, అతని తప్పు కాదు. అలాగే అంజి పాత్రలో రాజ్ తిరందాసు బాగున్నాడు. మురళీధర్ గౌడ్ ఈమధ్య చాలా సినిమాల్లో కనపడుతున్నాడు, అతను చాలా మంచి నటుడు, సహజంగా చేస్తున్నాడు ఏ పాత్ర ఇచ్చినా. ఇద్దరు నటీమణులు మోహన శ్రీ సత్తి భార్యగా సరిపోయింది, అలాగే అనీషా దామా అంజి గర్ల్ ఫ్రెండ్ గా బాగుంది. ఆమె చలాకీగా వుంది. బిత్తిరి సత్తి, వెన్నెల కిశోర్ పాత్రలు వేస్ట్ అయిపోయాయి, హాస్యం పండించలేకపోయారు. బిత్తిరి సత్తి పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాడు, కానీ సూట్ కాలేదు. అలాగే వెన్నెల కిషోర్ కూడా ప్రొఫెషనల్ కిల్లర్ గా చేస్తాడు, అతను అక్కడక్కడా బాగుంది అనిపించాడు అంతే.

ఇక చివరగా, ఈ 'సత్తిగాని రెండెకరాలు' #SattiganiRendekaraluFilmReview ఎప్పుడైపోతుందా అన్నట్టుగా ఉంటుంది. ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని, దానిని ఇటు క్రైమ్ కథ కాకుండా, అటు కామెడీగా కాకుండా ఏమీ చెయ్యలేక ఒక బోర్ సినిమాగా తీసాడు దర్శకుడు. ఒక పెద్ద నిర్మాణ సంస్థ అయినా మైత్రి మూవీ మేకర్స్ నుండి ఇటువంటి సినిమా రావటం, వాళ్ళు కేవలం ఓటిటి లకు కంటెంట్ సప్లయి చెయ్యడానికి ఈ సినిమా తీసినట్టున్నారు కానీ, ఈ సినిమాలో సరైన కంటెంట్ ఉందా లేదా అని చూడటం లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒక చిన్న సినిమా, అది కూడా డిజాస్టర్ సినిమానే తీశారు.

Updated Date - 2023-05-29T19:08:43+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!