Hidimba : సినిమా చూస్తే తెలుస్తుంది
ABN, First Publish Date - 2023-07-16T01:50:32+05:30
నందితా శ్వేత ప్రధాన పాత్ర పోషిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. ఈ నెల 20న విడుదలవుతున్న సందర్భంగా నందితా శ్వేత మీడియాతో మాట్లాడారు...
నందితా శ్వేత ప్రధాన పాత్ర పోషిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’. అనిల్ కన్నెగంటి దర్శకత్వంలో గంగపట్నం శ్రీధర్ నిర్మించారు. ఈ నెల 20న విడుదలవుతున్న సందర్భంగా నందితా శ్వేత మీడియాతో మాట్లాడారు.
‘‘ఇదొక సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. అనిల్ చెప్పిన కథ ఆసక్తిగా అనిపించింది. ఇప్పటివరకూ వచ్చిన థ్రిల్లర్ చిత్రాలకు ‘హిడింబ’ భిన్నంగా ఉంటుంది. ఇందులో నాది పోలీస్ పాత్ర. చాలా సీరియస్‌గా ఉంటుంది. బాడీ లాంగ్వేజ్, డైలాగ్ ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. లుక్ టెస్ట్ చేసినప్పుడే పూర్తి నమ్మకం వచ్చింది. రకరకాల లొకేషన్స్‌లో సినిమాను షూట్ చేశాం. నిర్మాతలు ఖర్చుకు వెనుకాడలేదు. ‘హిడింబ’ టైటిల్ పెట్టడానికి కారణం సినిమా చూస్తే తెలుస్తుంది. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాలానే ‘హిడింబ’ కూడా పెద్ద హిట్టవుతుంద’’న్నారు.