సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

VV Vinayak: డైరెక్టర్ వి.వి. వినాయక్ చేతుల్లో ‘సాక్షి’

ABN, First Publish Date - 2023-07-01T18:18:29+05:30

సూపర్‌స్టార్ కృష్ణ‌ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వస్తున్న శ‌రణ్ కుమార్ హీరోగా.. శివ కేశన కుర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాక్షి’. ఈ చిత్రం జూలై 21న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్‌ను మాస్ దర్శకుడు వి.వి. వినాయక్ ఆవిష్కరించి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

VV Vinayak
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూపర్‌స్టార్ కృష్ణ‌ (Super Star Krishna) ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి మరో హీరో శ‌రణ్ కుమార్ (Saran Kumar) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన హీరోగా ప‌రిచయం కాబోతున్న సినిమా ‘సాక్షి’ (Sakshi). శివ కేశ‌న కుర్తి (Siva Kesana Kurthi) ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను ఆర్.యు. రెడ్డి, బేబీ లాలిత్య సమర్పణలో.. శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా మునగాల సుధాక‌ర్ రెడ్డి (Munagala Sudhakar Reddy) నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్‌ను మాస్ డైరెక్టర్ వి.వి. వినాయక్ (VV Vinayak) చేతుల మీదుగా చిత్రయూనిట్ విడుదల చేసింది.

పోస్టర్ విడుదల అనంతరం వి.వి. వినాయక్ మాట్లాడుతూ.. విజయ నిర్మల (Vijaya Nirmala)గారి ఫ్యామిలీ నుంచి శరణ్ హీరోగా వస్తున్నాడు. ఈ సినిమాను సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్.యు.రెడ్డి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. ఈ మూవీతో శరణ్‌కు మంచి పేరు రావాలని, కొత్త దర్శకుడిగా పరిచయం కాబోతున్న శివకు ఈ సినిమా హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ మంచి పేరు తీసుకురావాలని, సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు. (VV Vinayak Launches Sakshi Release Date Poster)

చిత్ర సమర్పకుడు ఆర్.యు.రెడ్డి (R U Reddy) మాట్లాడుతూ.. నా ఆప్తుడు, సెన్సేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కు ధన్యవాదాలు. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా మా ఆహ్వానాన్ని మన్నించి మా ఈ చిన్న సినిమాకు పెద్ద మనసు చేసుకుని వచ్చారు. ఆయన ఈవెంట్‌కు రావడమే మొదటి విజయం. మీడియా సహకారం మా టీంకు ఉండాలని కోరుకుంటున్నానని కోరగా.. సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన వి.వి.వినాయక్ ధన్యవాదాలు తెలుపుతూ.. జూలై 21న ఈ సినిమా విడుదల కాబోతున్నట్లుగా నిర్మాత సుధాకర్ రెడ్డి తెలిపారు. టీమ్ ఎంతగానో సహకరించినట్లుగా దర్శకుడు శివ, త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించాలని హీరో శరణ్ కోరారు. జాన్వీర్ కౌర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం మెగాబ్రదర్ నాగబాబు (Mega Brother Nagababu) మెయిన్ విలన్‌గా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

ఇవి కూడా చదవండి:

**************************************

*TSPSC Group 4 Exam: గ్రూప్ 4 పరీక్షలో ‘బలగం’ సినిమాపై ప్రశ్న.. దానికి సమాధానమిదే!

**************************************

*D Imman: విద్యార్థిని చదువు కోసం సంగీత దర్శకుడి సాయం

**************************************

*Priyanka Chopra: ‘అపురూపం’గా టాలీవుడ్‌కి పరిచయం అవ్వాల్సిన నటి.. ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా!

**************************************

Updated Date - 2023-07-01T18:22:19+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!