సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Young Tiger NTR: విశ్వక్ సేన్ దర్శకత్వం మానేయాలని కోరుకుంటున్నా..

ABN, First Publish Date - 2023-03-17T23:13:18+05:30

ఒక యాక్టర్ ఫస్ట్ సినిమాలో ఎక్స్‌ప్రెషన్‌ని, ఎమోషన్‌ని కంట్రోల్ చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి.. అది విశ్వక్‌లో చూశానని అన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR). విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించి

Jr NTR And Vishwak Sen
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక యాక్టర్ ఫస్ట్ సినిమాలో ఎక్స్‌ప్రెషన్‌ని, ఎమోషన్‌ని కంట్రోల్ చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి.. అది విశ్వక్‌లో చూశానని అన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR). విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా నటించి దర్శకత్వం వహించిన చిత్రం ‘దాస్ కా ధమ్కీ’ (Das Ka Dhamki). ఈ చిత్ర ప్రీ రిలీజ్ (Pre Release Event) వేడుక తాజాగా హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు యంగ్ టైగర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో యంగ్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ‘‘ఎప్పటి నుంచో బాకీ ఇది. బాకీ కాదు బాధ్యత. నేను మూడ్ ఆఫ్ అయినప్పుడు చాలా తక్కువ చిత్రాలు చూస్తుంటాను. అందులో ‘ఈ నగరానికి ఏమైంది’ అనే చిత్రం చాలా ఇంపార్టెంట్. అందులో విశ్వక్ పాత్రని చూస్తుండిపోవచ్చు. ఒక నటుడిగా కామెడీ చేయకుండా కామెడీ పండించాడు తను. ఎంత కామెడీ అందులో పండిస్తాడో.. అంతే బాధని కూడా లోపల దిగమింగుకుని ఉంటాడు. ఫస్ట్ ఒక యాక్టర్ అంత ఎక్స్‌ప్రెషన్‌ని, అంత ఎమోషన్‌ని కంట్రోల్ చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ స్వతహాగా వచ్చిందో.. వాళ్ల నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందో.. తను చూసినటువంటి సమాజం నుంచి వచ్చిందో నాకు తెలియదు. కానీ అది చాలా మంచే చేసింది తనకి. ఈ చిత్రం తర్వాత ‘ఫలక్‌నుమా దాస్’ చూశాను. తనే దర్శకత్వం వహించాడు దానికి. యాక్టర్‌గా ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటాడో దర్శకుడిగా అంతే కాన్ఫిడెంట్‌గా చేశాడు. ఆ తర్వాత ‘పాగల్’ అనే సినిమా చేశాడు. విశ్వక్ ఓ చట్రంలోకి వెళ్లిపోతున్నాడా అని అనుకుంటున్నప్పుడు.. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చేశాడు. ఆ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నేను రావాలి. కానీ కుదరలేదు. ఆ సినిమా చూసినప్పుడు మాత్రం షాకయ్యాను. ఇంత యాటిట్యూడ్ ఉన్న మనిషి.. అంతలా ఛేంజ్ అవుతాడా? అని అనిపించింది. ఈ విషయంలో నేను నా కెరీర్‌లో చాలా సినిమాల తర్వాత రియలైజ్ అయ్యాను. అప్పుడే నేనొక మాట చెప్పాను.. మీ అందరినీ కాలర్ దించుకోనివ్వకుండా చేస్తాను అని. నాకు బాగా గుర్తుంది. ఆ రోజే నేను మళ్లీ నటుడిగా పుట్టాను. ఆ నటన కోసమే ఇప్పటికీ తాపత్రయ పడుతున్నాను. (Young Tiger NTR About Vishwak Sen)

‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ చూసి షాకయ్యాను. ఇంత పరిణితి సాధించాడా అనుకున్నాను. ఇక ‘హిట్’ అనే మూవీ చూసి అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. చాలా కంపోజ్డ్‌గా తనని తాను క్యారీ చేశాడు. ఇది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. చాలా చాలా కష్టం. అది విశ్వక్‌కి కుదిరింది. అది పూర్వ జన్మ సుకృతం. అది దేవుడు, అభిమానుల, వాళ్ల అమ్మనాన్నల ఆశీస్సులు. తను చేసుకున్న పుణ్యమది. తనకి తాను ప్రూవ్ చేసుకోవాలని బయలుదేరిన నటుడు తను. ఇప్పుడు ‘దాస్ కా ధమ్కీ’ అనే చిత్రం చేస్తున్నాడు. మళ్లీ తనే దర్శకత్వం చేశాడు. ఈ సినిమా నిజంగా బ్లాక్‌బస్టర్ కావాలి. ఎందుకంటే తను దర్శకత్వం చేయడం ఆపేయాలి. ఎందుకంటే బోలెడంత మంది దర్శకులు ఉన్నారిక్కడ. విశ్వక్ లాంటి హీరో వారి డైరెక్షన్‌లో హీరోగా సినిమాలు చేయాలి. అలాంటి దర్శకులని చూసి.. వాళ్లతో మేమూ సినిమాలు చేయాలి. దయచేసి ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ కొట్టేసి దర్శకత్వం ఆపేయాలని విశ్వక్‌ని కోరుతున్నాను. ఎందుకంటే తెలుగు సినిమా ఆల్ టైమ్ టాప్‌లో ఉంది. మనందరం కలిసి కట్టుగా ముందుకు వెళ్లాలి. ప్రపంచ పటంపై తెలుగు సినిమాని పడిపోనివ్వకుండా చూసుకోవాలి. (Young Tiger NTR Speech at Das ka Dhamki Event)

విశ్వక్ మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పిన ఒక మాట నాకు చాలా బాధగా అనిపించింది. అన్నా.. ఈ సినిమా కోసం ఉన్నదంతా పెట్టేశానని చెప్పాడు. సినిమా అంటే అతనికి అంత పిచ్చని అప్పుడు నాకు అనిపించింది. ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి పిచ్చి తగ్గిపోకూడదు. ఇలాంటి వాళ్లే ఇండస్ట్రీని ముందుకు తీసుకువెళ్లగలరు. ఇలాంటి వాళ్లని మనం ఎంకరేజ్ చేయాలి. ఇలాంటి వారి చిత్రాలను ఆదరించాలి. అప్పుడే మనం ఇంకా ముందుకు వెళతాం. మార్చి 22వ తారీఖు ఈ చిత్రం విడుదలవుతుంది. ఉగాదికి కొత్త తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఆ పండగ రోజు.. విశ్వక్‌కి కూడా నిజమైన పండగ రావాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను..’’ అని చెప్పుకొచ్చారు. (Young Tiger NTR About Vishwak Sen Das Ka Dhamki)

ఇవి కూడా చదవండి:

*********************************

*Jr NTR: ఆస్కార్ క్రెడిట్ ఎవరిదంటే.. ఎన్టీఆర్ స్పీచ్ వైరల్

*Bigg Boss Himaja: ఘోరంగా ఏడ్చాను.. కానీ?

*Shruti Haasan: సిల్లీ క్వశ్చన్ అడగమంటే.. శృతిని అలాంటి ప్రశ్నేనా అడిగేది?

*Pavitra Lokesh: పెద్ద బాంబ్ పేల్చిన పవిత్రా లోకేష్ మొదటి భర్త.. పాపం నరేష్..?

*Kantara: ఆస్కార్‌తో ‘ఆర్ఆర్ఆర్’‌ చరిత్ర సృష్టించింది.. ఇక ‘కాంతార’ వంతు!

*The Elephant Whisperers: ఆస్కార్ అందుకున్న ఆనందం ఆవిరైంది

*Ram Gopal Varma: డిగ్రీ పట్టాని అలా వదిలేశాడేంటి? 37 ఏళ్ళ తర్వాత..

*Richa Panai: అవకాశాలు లేక ఈ భామ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

*SS Rajamouli: జక్కన్న మంట పుట్టించాడు.. ఈ పిక్‌కి అర్థం అదేనా?

Updated Date - 2023-03-17T23:13:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!