Vimanam: హృదయాన్ని హత్తుకునేలా ‘విమానం’.. ప్రోమో వైరల్
ABN, First Publish Date - 2023-04-14T17:59:53+05:30
వైవిధ్యమైన పరిస్థితులు, వాటికి సరిపోయేటువంటి సున్నితమైన పాత్రలను ఈ చిత్రంలో చూడొచ్చని అంటున్నారు మేకర్స్. వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని (Samuthirakani) అంగ వైకల్యంతో బాధపడే
జీవితంలో ఏదో సాధించాలని మనకు చెప్పే పాత్రలను వెండితెరపై చూడటానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడతారు. అలాంటి పాత్రలతో రూపొందిన చిత్రమే ‘విమానం’ (Vimanam) అనేది తాజాగా విడుదలైన ‘విమానం’ ప్రోమో (Vimanam Promo)తో తెలుస్తుంది. ద్విభాషా చిత్రంగా తెలుగు, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘విమానం’. వైవిధ్యమైన పరిస్థితులు, వాటికి సరిపోయేటువంటి సున్నితమైన పాత్రలను ఈ చిత్రంలో చూడొచ్చని అంటున్నారు మేకర్స్. వెర్సటైల్ యాక్టర్ సముద్రఖని (Samuthirakani) అంగ వైకల్యంతో బాధపడే మధ్య వయస్కుడిగా, భార్య లేకపోయినా పిల్లాడిని జాగ్రత్తగా చూసుకునే వీరయ్య (Veerayya) అనే తండ్రి పాత్రలో నటించారు. జీ స్టూడియోస్ (Zee Studios), కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్ (Kiran Korrapati Creative Works) బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. శివ ప్రసాద్ యానాల (Siva Prasad Yanala) దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రోమోని మేకర్స్ విడుదల చేశారు. హార్ట్ టచ్చింగ్ ఉన్న ఈ ప్రోమో.. సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తోంది.
ప్రోమోను గమనిస్తే.. ఇందులో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం కనిపిస్తుంది. రాజు అనే అబ్బాయి తన తండ్రి పాత్రలోని సముద్రఖనితో మాట్లాడుతూ.. ఓసారైనా తనని విమానం ఎక్కించమని అడుగుతుంటాడు. విమానం ఎక్కటానికి ఎందుకంత ఇష్టం నీకు అని అడిగితే పై నుంచి చూస్తే అన్నీ చిన్నగా కనిపిస్తాయని అంటాడు. అయితే బాగా చదువుకుంటే పెద్దయ్యాక నువ్వే విమానం ఎక్కొచ్చని తండ్రి అంటాడు. ఇందులో సున్నితంగా, చక్కగా తండ్రీ కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలను ప్రోమోలో ఎలివేట్ చేశారు రైటర్, డైరెక్టర్ శివ ప్రసాద్ యానాల (Vimanam Promo Review). ఈ ప్రోమో చూసిన వారంతా.. త్వరలో ఓ మంచి చిత్రం చూడబోతున్నామనే అనుభూతిని పొందుతున్నారంటే.. ఇందులో ఉన్న విషయం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
ఇక ఈ ప్రోమో విడుదల సందర్భంగా జీ స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ క్రేజీవాల్ (Akshay Kejriwal) మాట్లాడుతూ.. ‘‘కిరణ్ కొర్రపాటి క్రియేటివ్ వర్క్స్‌తో అసోసియేట్ కావటం చాలా సంతోషంగా ఉంది. మా కాంబోలో మంచి నటీనటులు, టెక్నీషియన్స్ టీమ్‌గా ఏర్పడి భావోద్వేగాల కలబోతగా బలమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రేక్షకులు నచ్చే, మెచ్చే కంటెంట్‌ను అందించటమే మా లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాం’’ అని తెలిపారు. సముద్రఖని, మాస్టర్ ధ్రువన్ (Master Dhruvan)తో పాటు ఇందులో మీరా జాస్మిన్ (Meera Jasmine), అనసూయ భరద్వాజ్ (Anasuaya Bharadwaj), రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna), ధన్‌రాజ్ (Dhanraj) తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. చరణ్ అర్జున్ (Charan Arjun) సంగీతాన్ని అందించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని జూన్ 9న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
*********************************
*Alia Bhatt- Ranbir Kapoor: ఏప్రిల్ 14, హ్యాపీ డే.. ఆలియా పోస్ట్ వైరల్
*Namitha: అది మన సంస్కృతి కాదు. మనకంటూ ఒక సంస్కృతి ఉంది
*Vijay Deverakonda: ‘శాకుంతలం’ విడుదల వేళ.. సమంతకు విజయ్ బూస్ట్
*KGF Actress: ‘కెజియఫ్’లో వణికించిన నటి.. ఇప్పుడు హాస్పిటల్‌లో ఉంది
*Shocking: యాంకర్ సుమ అరెస్ట్.. ఎందుకంటే?