సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆ వార్త నన్ను కదిలించింది

ABN, First Publish Date - 2023-04-30T00:50:30+05:30

‘ఉగ్రం’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకునేలా సినిమా ఉంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ఉగ్రం’ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకునేలా సినిమా ఉంటుంది. ఇందులో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచే అంశాలు చాలా ఉన్నాయి. ‘ఉగ్రం’తో అల్లరి నరేశ్‌కు కొత్త ఇమేజ్‌ వస్తుంది’ అని దర్శకుడు విజయ్‌ కనకమేడల అన్నారు. ‘నాంది’ చిత్రం తర్వాత విజయ్‌, నరేశ్‌ కలయికలో వస్తున్న చిత్రమిది. మే 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్‌ కనకమేడల మీడియాతో మాట్లాడారు.

కరోనాతో కొన్నాళ్లు ‘నాంది’ చిత్రం షూటింగ్‌ నిలిచిపోయింది. ఆ సమయంలో ‘ఉగ్రం’ చిత్రం కథ తయారుచేసుకున్నాం. ఇది నరేశ్‌ గారికి బావుంటుందనిపించింది. ఇప్పటిదాకా ఆయన పూర్తిస్థాయిలో రౌద్రరసం ఒలికించే పాత్ర చేయలేదు. నరేశ్‌కు కొత్తగా ఉంటుంది అనిపించి కథ చెప్పాం. ఆయనకు నచ్చింది. కథ కోసం ఆరు నెలలు పరిశోధన చేశాం.

పత్రికల్లో నిత్యం తప్పిపోయిన వ్యక్తుల వార్తలు కనిపిస్తున్నాయి. దీనిపై తెలంగాణ హైకోర్టు కూడా స్పందించి ఇలా తప్పిపోతున్నవారంతా ఏమవుతున్నారో ఓ నివేదిక ఇవ్వాలని పోలీస్‌ శాఖను కోరినట్లు వచ్చిన ఓ వార్త చదివాను, అది నన్ను కదిలించింది. ఎవరైనా తప్పిపోయినప్పుడు ఆ కుటుంబం పడే బాధ పైన సినిమా చేస్తే బావుంటుందనిపించింది.

ఇందులో ‘నాంది’ కంటే ఎక్కువ ఎమోషన్స్‌, మాస్‌, ఇంటెన్స్‌ ఉంటుంది. పోలీస్‌ కథ కాబట్టి ‘ఉగ్రం’ మాంచి యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం. కథలో చాలా కొత్త ఎలిమెంట్స్‌ ఉంటాయి.

ఇందులో హీరోయిన్‌ కాలేజీ అమ్మాయిగా, భార్యగా, తల్లిగా మూడు భిన్నమైన కోణాల్లో కనిపించాలి. మిర్నాఅయితే చక్కగా చేస్తుందని ఆమెను ఎంపిక చేశాం.

ఫ సీరియ్‌సగా సాగే కథ కావడంతో నరేశ్‌ గెటప్‌, బాడీ లాంగ్వేజి కొత్తగా ఉంటాయి. ‘ఉగ్రం’లో యాక్షన్‌ సీక్వెన్స్‌ ఎక్కువే. కథ స్పీడ్‌గా పరిగెడుతుంది.

Updated Date - 2023-04-30T00:50:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!