Vijay Deverakonda: మా అందరినీ కలిపింది సినిమానే..
ABN, First Publish Date - 2023-10-30T13:50:59+05:30
‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ వంటి బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రశంసలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం. ఇప్పుడాయన తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ 'కీడా కోలా'తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్ పై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కిన ఈ సినిమా ఘన విజయం సాధించాలని తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో విజయ్ దేవరకొండ కోరారు.
‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రశంసలు అందుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ దాస్యం (Tharun Bhascker D) తన మూడో చిత్రంగా యూనిక్ క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’ (Keedaa Cola)తో వస్తున్నారు. విజి సైన్మా బ్యానర్‌పై ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కె. వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీపాద్ నిర్మిస్తున్నారు. హీరో రానా దగ్గుబాటి సమర్పిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపధ్యంలో చిత్రయూనిట్ తాజాగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. (Keedaa Cola Pre Release Event)
ఈ కార్యక్రమంలో హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) మాట్లాడుతూ.. నన్ను మీ అందరికీ ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోగా పరిచయం చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. నేను, నాగ్ అశ్విన్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా.. వేరే వేరే చోట పెరిగాం. మా నేపధ్యాలు వేరు. మా అందరినీ సినిమా కలిపింది. నాగ్ అశ్విన్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’లో ఓ పాత్ర చేయించారు. అప్పుడే తరుణ్‌తో పరిచయం ఏర్పడింది. తర్వాత ‘పెళ్లి చూపులు’ చేశాం. ఆ సినిమా పెద్ద విజయం సాధించింది. తరుణ్‌కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. అలాంటి సక్సెస్ తర్వాత ఏమైనా చేయొచ్చు. కానీ తరుణ్ నమ్మింది, నచ్చిన స్క్రిప్ట్, నచ్చిన వాళ్ళతో చేసే దర్శకుడు. ‘పెళ్లి చూపులు’తో నాకు లాంచ్ ఇచ్చాడు. తర్వాత ఇంకొంత మంది కొత్త వాళ్లతో ‘ఈ నగరానికి ఏమైంది’ చేసి వారికి కెరీర్ ఇచ్చాడు. ఇప్పుడు ‘కీడా కోలా’ సినిమాలో కూడా మంచి టాలెంటెడ్ యాక్టర్స్ కనిపిస్తున్నారు.
తరుణ్‌కి తనపై, తన కథలపై నమ్మకం. ఈ విషయంలో అతన్ని గౌరవిస్తాను. తరుణ్ ఇండస్ట్రీకి దొరికిన అదృష్టం. ‘కీడా కోలా’ ఖచ్చితంగా మజా ఇస్తుంది. ఎందుకంటే నాకు తరుణ్ భాస్కర్ మీద నమ్మకం. ‘పెళ్లి చూపులు’ (Pelli Choopulu), ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi) నచ్చినట్లయితే ‘కీడా కోలా’ కూడా వందశాతం నచ్చుతుంది. నవంబర్ 3న అందరూ థియేటర్స్‌లో చూడండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేయండి. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. మీకు ఇంకో విషయం చెప్పాలి. తరుణ్ ఓ కథ తీసుకొచ్చాడు. స్క్రిప్ట్ లాక్ చేశాం. త్వరలోనే మా కాంబినేషన్‌లో సినిమా వస్తుందని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
========================
*MLC Kavitha: మెగాస్టార్ చిరంజీవి తర్వాత కవితకు ఏ హీరో ఇష్టమంటే..
***********************************
*Satyam Rajesh: సత్యం రాజేష్ టైమ్ నడుస్తోంది
***********************************
*Rekha: ఊపిరి ఉన్నంత వరకు.. నా కోరిక అదే..
*********************************