Major: మహేష్ బాబు నిర్మించిన సినిమాకు ఘోర అవమానం
ABN, First Publish Date - 2023-05-26T16:26:45+05:30
పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన అడివి శేష్ ‘మేజర్’ చిత్రం.. వెండితెరపై అద్భుతమైన విజయాన్ని నమోదు చేయగా.. బుల్లితెరపై మాత్రం ఘోరమైన టీఆర్పీని రాబట్టింది. ఈ సినిమా రీసెంట్‌గా బుల్లితెరపై ప్రసారం కాగా.. కేవలం 1.87 టీఆర్పీని మాత్రమే రాబట్టడంతో.. ఇది ఈ చిత్రానికి ఘోరమైన అవమానంగా అంతా భావిస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు (Super Star Mahesh Babu) నిర్మించిన చిత్రం ఘోర అవమానానికి లోనైంది. యంగ్ హీరోగా అడివి శేష్ (Adivi Sesh) హీరోగా శశికిరణ్ తిక్కా (Sasi Kiran Tikka) దర్శకత్వంలో.. ముంబై ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ (Sandeep Unnikrishnan) జీవితాధారంగా తెరకెక్కిన ‘మేజర్’ (Major) చిత్రాన్ని మహేష్ బాబుకి చెందిన జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో పాటు ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. వెండితెరపై అలాగే ఓటీటీలోనూ ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఎందరో ప్రముఖుల ప్రశంసలు ఈ చిత్రానికి దక్కాయి. రీసెంట్‌గా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం ‘మేజర్’ హీరో అడివి శేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. మరి అలాంటి చిత్రానికి ఘోర అవమానం ఏంటి? అని అంతా అనుకుంటూ ఉండవచ్చు. కానీ ఈ చిత్రం నిజంగానే బుల్లితెరపై అవమానించబడింది. అదెలా అంటే..
‘మేజర్’ సినిమా విడుదలైన దాదాపు సంవత్సరం తర్వాత రీసెంట్‌గా బుల్లితెరపై ప్రసారమైంది. మాములుగా అయితే బుల్లితెరపై ఈ సినిమా సంచలన టీఆర్పీని రాబట్టి ఉండాలి. ఎందుకంటే ఇదొక సైనికుడి కథ. కానీ బుల్లితెర ప్రేక్షకులు ఈ చిత్రాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఫలితంగా ఈ సినిమా బుల్లితెరపై భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ‘మేజర్’ టీఆర్పీకి సంబంధించి వినిపిస్తున్న సమాచారం ప్రకారం సిటీల్లో 1.87, రూరల్ ఏరియాల్లో 1.70 రేటింగ్‌ను మాత్రమే నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అంత పెద్ద బ్లాక్‌బస్టర్ మూవీకి ఇటువంటి టీఆర్పీ అంటే నిజంగా ఇది అవమానం కాక మరేంటి? థియేటర్లలో భారీ డిజాస్టర్ అయిన చిత్రాలు కూడా.. బుల్లితెరపై అద్భుతమైన టీఆర్పీని రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య కొన్ని చిత్రాలు నాలుగు, ఐదవ సారి ప్రసారం అయినప్పుడు కూడా 4 ప్లస్ టీఆర్పీని రాబట్టాయి. కానీ, ‘మేజర్’ వంటి చిత్రం కనీసం 2 టీఆర్పీని కూడా నమోదు చేయకపోవడంతో.. ఇదో పెద్ద అవమానంగా అంతా భావిస్తున్నారు. (Major Movie TRP)
అయితే ఈ సినిమాకు ఇటువంటి డిజాస్టర్ రేటింగ్ రావడానికి కారణం లేకపోలేదు. అదేంటంటే.. ఈ మధ్య విడుదలైన సినిమాలన్నీ ఫోకస్‌లో ఉండగానే.. అంటే విడుదలైన నెలలోపే ఓటీటీలలో, ఆ తర్వాత బుల్లితెరపై ప్రత్యక్షమవుతున్నాయి. కానీ ‘మేజర్’ విషయంలో దాదాపు సినిమా విడుదలై సంవత్సరం కావడం, సరైన ప్రమోషన్ లేకుండా ప్రసారం చేయడం, అలాగే ఐపీఎల్ మ్యాచ్ (IPL Match).. వంటి వన్నీ ఈ సినిమా టీఆర్పీపై ప్రభావం చూపాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా అయితే.. పాన్ ఇండియా స్థాయిలో సంచలనానికి కేంద్రబిందువుగా మారిన ‘మేజర్’ చిత్రం.. బుల్లితెరపై మాత్రం భారీ అవమానానికి గురైందని చెప్పుకోవాలి.
ఇవి కూడా చదవండి:
************************************************
*TholiPrema Re Release: సపోర్ట్ చేసేదే లేదంటోన్న మెగా ఫ్యాన్స్.. కారణం ఏంటంటే?
*Virinchi Varma: కామ్‌గా షూటింగ్ మొదలెట్టేసిన దర్శకుడు
*Tiger Nageswara Rao Glimpse: పులుల్ని వేటాడే పులిని చూశారా? అయితే చూడండి..
*Nene Raju Nene Mantri: జోగేంద్ర పాత్రను మించేలా.. కాంబినేషన్ రిపీట్!