బరిలో దిగుతున్న ఉస్తాద్..
ABN, First Publish Date - 2023-08-22T00:23:22+05:30
పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబోలో రూపొందిన ‘గబ్బర్‌సింగ్’ బాక్సాఫీసు దగ్గర దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో చిత్రం రూపుదిద్దుకొంటోంది..
పవన్ కల్యాణ్ - హరీశ్ శంకర్ కాంబోలో రూపొందిన ‘గబ్బర్‌సింగ్’ బాక్సాఫీసు దగ్గర దుమ్ము రేపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో చిత్రం రూపుదిద్దుకొంటోంది. అదే.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. శ్రీలీల కథానాయిక. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. సెప్టెంబరు 5 నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందుకోసం కళా దర్శకుడు ఆనంద్ సాయి నేతృత్వంలో ఓ భారీ సెట్‌ని కూడా రూపొందించారు. సుదీర్ఘంగా సాగే షెడ్యూల్ ఇదని, పవన్‌తో పాటు ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాల్ని రూపొందిస్తామని చిత్రబృందం తెలిపింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో అశితోష్ రాణా, నవాబ్ షా, ‘కేజీఎఫ్’ అవినాష్. గౌతమి తదితరులు నటిస్తున్నారు.