Tiger Nageswara Rao: సైన్ లాంగ్వేజ్‌లో కూడా.. ఫస్ట్ పాన్ ఇండియా సినిమాతోనే రవితేజ రికార్డ్
ABN, First Publish Date - 2023-10-06T20:01:56+05:30
మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ సినిమాతో ఈ దసరాకి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి టైగర్ సిద్ధమవుతున్నాడు. వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. అక్టోబర్ 20న ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లుగా తాజాగా మేకర్స్ ప్రకటించారు.
మాస్ మహారాజా రవితేజ (Mass Maharaja Ravi Teja) నటిస్తోన్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). ఈ సినిమాతో ఈ దసరాకి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి టైగర్ సిద్ధమవుతున్నాడు. వంశీ (Vamsee) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ (Abhishek Agarwal Arts) బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ (Abhishek Agarwal) ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోయేలా చేయడానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రమోషన్స్‌పై భారీగా ఖర్చు చేస్తూ, సినిమా ప్రేక్షకులలోకి తీసుకెళ్లేందుకు మేకర్స్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో రవితేజ (Ravi Teja) అండ్ టీం విడుదల చేసిన విషయం తెలిసిందే. మేకర్స్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో కూడా ట్రైలర్‌ను విడుదల చేశారు. అందులో ఒక యాంకర్ క్లిప్‌లోని కంటెంట్‌ను వివరిస్తున్నారు. భారతదేశంలోనే సైన్ భాష (Sign Language)లో విడుదలైన తొలి ట్రైలర్ ఇదే. మిగతా ట్రైలర్స్‌తో పాటు సైన్ లాంగ్వేజ్ ట్రైలర్‌కి కూడా అద్భుతమైన వస్తుండటంతో మేకర్స్ సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నారు. అదేంటంటే..
ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ సినిమాని చేరువ చేయాలని అక్టోబర్ 20న ఇండియన్ సైన్ లాంగ్వేజ్‌లో కూడా ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా నిర్మాత అధికారికంగా ప్రకటించారు. టైగర్ నాగేశ్వరరావు (TNR) ఇండియన్ సైన్ లాంగ్వేజ్ (Indian Sign Language)లో విడుదలైయ్యే మొదటి భారతీయ చిత్రం. భారతీయ సినిమాలో ఇది నిజంగా స్వాగతించదగిన మార్పు. అలాగే మొదటి పాన్ ఇండియా సినిమాతోనే ఇలాంటి ప్రయత్నం చేసి రవితేజ రికార్డ్‌ని క్రియేట్ చేయబోతున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కోసం మేకర్స్ అంతా రెడీ అవుతున్నారు. తదుపరి ప్రమోషన్‌ల కోసం వారు బిగ్గర్ ప్లాన్స్‌తో వున్నట్లుగా తెలుస్తోంది. దసరా సందర్భంగా అక్టోబర్ 19న అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు.
ఇవి కూడా చదవండి:
============================
*Mad: ‘మ్యాడ్’ బొమ్మకి హిట్ టాక్.. సంతోషంలో యూనిట్..
********************************
*Mechanic: పిల్లే కాదు.. సిద్ శ్రీరామ్ పాడిన పాట కూడా జనాలకి బాగా నచ్చేసింది.. అందుకే ఎక్కేసింది
********************************
*Siddharth: తలైవా ఫోన్ చేశారు.. చెన్నై వచ్చాక ‘చిత్తా’ చూస్తానన్నారు
*********************************
*Prema Vimanam Trailer: వేసుకోవడానికి చెడ్డీ లేదు కానీ.. విమానంలో పోతారంట..
********************************
*Unstoppable with NBK Season 3: మరో దరువుకి సిద్ధమైన బాలయ్య.. ఎప్పటి నుంచి అంటే..
**********************************