సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హై ఓల్టేజ్‌ మీటర్‌ ఇది!

ABN, First Publish Date - 2023-04-06T00:22:42+05:30

‘మాస్‌ ఆడియన్స్‌కు ఎలాంటి అంశాలతో సినిమా ఉండాలో అవన్నీ ‘మీటర్‌’ చిత్రంలో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హై ఓల్టేజ్‌ ఎనర్జిటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఎక్కడా బోర్‌ కొట్టదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘మాస్‌ ఆడియన్స్‌కు ఎలాంటి అంశాలతో సినిమా ఉండాలో అవన్నీ ‘మీటర్‌’ చిత్రంలో ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హై ఓల్టేజ్‌ ఎనర్జిటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. ఎక్కడా బోర్‌ కొట్టదు. అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది’ అన్నారు హీరో కిరణ్‌ అబ్బవరం. ఆయన నటించిన ‘మీటర్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ బుధవారం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నన్ను కొత్తగా చూస్తారు. ఈ సమ్మర్‌లో అసలు సిసలైన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మీటర్‌’. నా సినిమాను, రవితేజగారి సినిమాను చూసి ఎంజాయ్‌ చేయాలని కోరుకుంటున్నాను. ఈ నెల ఏడున మీటర్లు బ్లాస్ట్‌ అవుతాయని అనుకుంటున్నాను’ అన్నారు. ఈ చిత్రంతో కిరణ్‌ అబ్బవరం మాస్‌ హిట్‌ సాధించాలని దర్శకుడు గోపీచంద్‌ మలినేని చెప్పారు. నిర్మాత చెర్రీది వంద శాతం మాస్‌ మీటర్‌, ఈ సినిమా హిట్‌ అయి, ఆయనకు మంచి పేరు రావాలని దర్శకుడు బుచ్చిబాబు సాన కోరుకున్నారు. ఈ సినిమాతో కిరణ్‌ అబ్బవరం నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లాలనీ, ఆయన పాత్ర చాలా డైనమిక్‌గా, స్టయిలిష్‌గా ఉంటుందనీ నిర్మాత చెర్రీ చెప్పారు. ఈ సినిమా చూశాననీ సమ్మర్‌లో మంచి కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌ అనీ చెబుతూ టీమ్‌ని అభినందించారు నవీన్‌ యర్నేని. ‘ఒక కుటుంబం బాధ్యత తీసుకునే వ్యక్తి అందరికీ నచ్చుతాడు. ఈ సినిమాలో కిరణ్‌ పాత్ర కూడా అందరికీ నచ్చుతుంది. ఈ సమ్మర్‌లో హీట్‌ ఎంత ఉంటుందో ‘మీటర్‌’ కలెక్షన్లు కూడా అంత ఎక్కువగా ఉంటాయి’ అంటూ తన తొలి ప్రయత్నంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు దర్శకుడు రమేశ్‌ కడూరి.

Updated Date - 2023-04-06T00:22:44+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!