వారి అనుభవం సమాజానికి అవసరం
ABN, First Publish Date - 2023-10-23T01:16:13+05:30
రాజేంద్రప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్ మదిరాజు రూపొందించిన చిత్రం ‘కృష్ణారామా’. వెంకట కిరణ్, కుమార్ కె, హేమ మాధురి నిర్మించారు...
రాజేంద్రప్రసాద్, గౌతమి ప్రధాన పాత్రల్లో దర్శకుడు రాజ్ మదిరాజు రూపొందించిన చిత్రం ‘కృష్ణారామా’. వెంకట కిరణ్, కుమార్ కె, హేమ మాధురి నిర్మించారు. ఆదివారం ఈ చిత్రం ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా రాజ్ మదిరాజు సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు. ‘బామ్మమాట బంగారు బాట’ తర్వాత రాజేంద్రప్రసాద్, గౌతమి మళ్లీ కలసి నటించిన చిత్రమిది. ఈ సినిమాలో అనన్యశర్మ పాత్ర ఆసక్తికరంగా ఉంటుంది. శ్రీకాంత్ అయ్యంగార్, చరణ్ లక్కరాజు, రవివర్మ పాత్రలన్నీ చక్కగా కుదిరాయి. రిటైర్ అయితే పెద్దవాళ్ల జీవితాలు అయిపోయినట్టే అనే భావనలో ఉన్నాం. కానీ వారి అనుభవం ఈ సమాజానికి అవసరం అని ఈ సినిమా ద్వారా చెప్పాం. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. నటుడిగా, దర్శకుడిగా కొన్ని ప్రాజెక్ట్‌లు చేస్తున్నా, వివరాలు త్వరలో వెల్లడిస్తా’ అన్నారు.