కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ట్రైలర్‌ వేరు.. సినిమా వేరు

ABN, First Publish Date - 2023-08-22T00:08:34+05:30

అనుష్క, నవీన్‌ పోలిశెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. మహేశ్‌ బాబు పి. దర్శకుడు. వంశీ, ప్రమోద్‌ నిర్మించారు...

అనుష్క, నవీన్‌ పోలిశెట్టి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి’. మహేశ్‌ బాబు పి. దర్శకుడు. వంశీ, ప్రమోద్‌ నిర్మించారు. సెప్టెంబరు 7న విడుదల అవుతోంది. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘అనుష్క, నవీన్‌ ఇద్దరికీ వయసు రీత్యా చాలా గ్యాప్‌ ఉంది. ఆ గ్యాప్‌ వల్లే వెండి తెరపై ఓ మ్యాజిక్‌ జరిగింది. రిలేషన్స్‌ పట్ల ఈతరం దృక్పథం ఎలా ఉందో ఈ సినిమాలో చెప్పాం. ట్రైలర్‌తో ప్రేక్షకుల్ని మిస్‌ గైడ్‌ చేస్తున్నాం. ఎందుకంటే ట్రైలర్‌లో చూపించిన కథ వేరు, తెరపై చూసేది వేరు. అంతకు మించిన సర్‌ప్రైజ్‌ సినిమాలో ఉంటుంద’’న్నారు. ‘‘జాతిరత్నాలు తరవాత ఎలాంటి కథని ఎంచుకోవాలని అనే విషయంలో చాలా తర్జనభర్జనలు పడ్డాను. అలాంటి సమయంలో ఈ కథ వచ్చింది. రెండేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పైనే వర్క్‌ చేస్తున్నాం. ప్రభాస్‌ అన్నకు మా ట్రైలర్‌ చాలా బాగా నచ్చింద’’న్నారు నవీన్‌ పొలిశెట్టి.

Updated Date - 2023-08-22T00:14:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!