రిలీజ్ డేట్ ప్రకటించారు
ABN, First Publish Date - 2023-10-10T00:48:21+05:30
నితిన్, శ్రీలీల జంటగా రూపొందుతున్న నాన్‌స్టా్‌ప ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్’ రిలీజ్ డేట్ ప్రకటించారు. దర్శకుడైన రచయిత వక్కంతం వంశీ రూపొందిస్తున్న చిత్రమిది. శరవేగంతో తయారవుతున్న ఈ చిత్రాన్ని...
నితిన్, శ్రీలీల జంటగా రూపొందుతున్న నాన్‌స్టా్‌ప ఎంటర్‌టైనర్ ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్’ రిలీజ్ డేట్ ప్రకటించారు. దర్శకుడైన రచయిత వక్కంతం వంశీ రూపొందిస్తున్న చిత్రమిది. శరవేగంతో తయారవుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 8న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు సుధాకర్‌రెడ్డి, నికితా రెడ్డి చెప్పారు. ఈ సినిమాలో నితిన్ లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన అభిమానులనే కాకుండా ప్రేక్షకుల్ని కూడా మెప్పించే విధంగా నితిన్ నటన ఉంటుందని తెలిపారు. ‘కిక్’ సినిమా తర్వాత ఆ రేంజ్ జోన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రోలర్ కోస్టర్ లాంటి అనుభూతితో ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఉంటుందని మేకర్స్ చెప్పారు. హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన ‘డేంజర్ పిల్లా.. ’ పాటకు అద్భుతమైన స్పందన వచ్చిందని నిర్మాతలు చెప్పారు.