కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మాజీ మంత్రి సమక్షంలో గ్రాండ్‌గా ‘తీస్ మార్ ఖాన్’ నిర్మాత జన్మదిన వేడుక

ABN, Publish Date - Dec 25 , 2023 | 08:12 PM

‘తీస్ మార్ ఖాన్’ అంటూ ఆది సాయి కుమార్‌తో తీసిన చిత్రం మంచి ప్రశంసలు అందుకుని నిర్మాతగా డా.నాగం తిరుపతి రెడ్డికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ నిర్మాత తన జన్మదిన వేడుకలను ఆయన కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో జరుపుకున్నారు.

సినిమా రంగంలోకి నిర్మాతగా అడుగు పెట్టడం అంటే సాహసమే. కేవలం డబ్బులుంటే నిర్మాతగా మారవచ్చు అనుకుంటే పొరబాటే. సినిమాల మీద ప్యాషన్, మంచి కథలను ప్రేక్షకులకు అందించాలనే ఆసక్తి ఉంటేనే సినీ ఫీల్డ్‌లో నిర్మాతగా రాణించగలుగుతారు. అలాంటి ఓ విజన్‌తో వచ్చిన నిర్మాతే డా.నాగం తిరుపతి రెడ్డి (Nagam Tirupathi Reddy). ‘తీస్ మార్ ఖాన్’ (Tees Maar Khan) అంటూ ఆది సాయి కుమార్‌తో తీసిన చిత్రం మంచి ప్రశంసలు అందుకుని నిర్మాతగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ నిర్మాత తన జన్మదిన వేడుకలను ఆయన కార్యాలయంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో జరుపుకున్నారు.

నాగం తిరుపతి రెడ్డి సతీసమేతంగా పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) సతీసమేతంగా హాజరయ్యారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. వనపర్తి నియోజక వర్గం నుండి రాజకీయ ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 2024 డైరీ, క్యాలెండర్‌ను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.


అనంతరం నిర్మాత నాగం తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నిరంజన్ రెడ్డి గారికి, అలాగే హాజరైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఇప్పటి వరకు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఇకపై మరింతగా విస్తరింపజేయాలని అనుకుంటున్నాను. అందరికీ సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం నాలుగు వెంచర్లతో పాటు మంచి కంటెంట్ ఉన్న సినిమా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాను. నా నాలుగో ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేయజేస్తానని తెలిపారు.

Updated Date - Dec 25 , 2023 | 08:12 PM
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!