Hanu-Man: ‘హను-మాన్’.. మీసం తిప్పి మరీ సంక్రాంతికే అని మరోసారి కన్ఫర్మ్ చేశారోచ్..
ABN, First Publish Date - 2023-10-24T21:23:11+05:30
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘హను-మాన్’. టాలెంటెడ్ హీరో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది. దసరాను పురస్కరించుకుని మేకర్స్ ఈ సినిమా సంక్రాంతికే అని తెలియజేస్తూ హీరో పరాక్రమాన్ని తెలియజేసే ఓ పోస్టర్‌ని విడుదల చేశారు.
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి పాన్ ఇండియా చిత్రం ‘హను-మాన్’ (Hanu-Man). టాలెంటెడ్ హీరో తేజ సజ్జా (Teja Sajja) హీరోగా నటిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమాలో కొంత హై-ఎండ్ వీఎఫ్ఎక్స్ ఉంటుంది కాబట్టి టీమ్ పోస్ట్ ప్రొడక్షన్‌కి తగిన సమయాన్ని కేటాయిస్తుంది. అయితే ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యంలో మరోసారి మీసం తిప్పే పోస్టర్ వదిలి మేకర్స్ ‘నో డౌట్స్’ అనేలా క్లారిటీ ఇచ్చారు.
తాజాగా హనుమాన్ టీమ్.. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ, కథానాయకుడు మీసాలు తిప్పుతూ కనిపించారు. అతని షేడ్స్ గ్లాస్‌లో వినయ్ రాయ్ పోషించిన విలన్ ఇమేజ్‌ని ప్రజెంట్ చేస్తోంది. అతను రావణుడి దిష్టిబొమ్మ వెనుక నిలబడి కనిపించాడు. తొమ్మిది తలలుగా చూపబడిన డ్రోన్లతో ఆ పాత్ర రావణాసురుడిని ప్రతిబింబిస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా నాడు రావణ దహనం చేసే సంప్రదాయం వుంది. ఈ స్టిల్‌కి అది చక్కగా సింక్ అవుతోంది. (Team Hanu-Man Extends Happy Dussehra Wishes)
ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ త్వరలోనే కొన్ని ఎక్సయిటింగ్ అప్‌డేట్‌లతో రానున్నారు. హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్ , జపనీస్‌తో సహా పలు భారతీయ భాషలలో జనవరి 12, 2024న పాన్ వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా, వినయ్ రాయ్ విలన్‌గా, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. (Hanu-Man Movie)
ఇవి కూడా చదవండి:
============================
*Saripodhaa Sanivaaram: శనివారం వరకు ఎందుకుని.. మంగళవారమే క్లాప్ కొట్టేశారు
************************************
*Devil: ‘డెవిల్’ స్టన్నింగ్ పోస్టర్.. సీక్రెట్ ఏజెంట్ ఏం ఉన్నాడులే..
**********************************************
*Bhagavanth Kesari: ‘భగవంత్ కేసరి’ సక్సెస్‌పై బాలకృష్ణ ఏమన్నారంటే..
*********************************************