KCPD: కేసీపీడీ టైటిల్‌తో చిత్రం.. అర్థం ఏమిటంటే..
ABN, First Publish Date - 2023-02-15T17:15:18+05:30
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), డైరెక్టర్ మోహన్ రాజా (Mohan Raja) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గాడ్‌ఫాదర్’ (God Father) చిత్ర టైమ్‌లో బాగా వినిపించిన వర్డ్ ‘KCPD’. ఈ వర్డ్‌కి అర్థం ఏదైనప్పటికీ..
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), డైరెక్టర్ మోహన్ రాజా (Mohan Raja) కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గాడ్‌ఫాదర్’ (God Father) చిత్ర టైమ్‌లో బాగా వినిపించిన వర్డ్ ‘KCPD’. ఈ వర్డ్‌కి అర్థం ఏదైనప్పటికీ.. ఆ సినిమా టైమ్‌లో మాత్రం మెగా ఫ్యాన్స్.. ఈ వర్డ్‌ని తమకి అనుకూలంగా మార్చుకున్నారు. ‘కొణిదెల చిరంజీవి ప్యూర్ డామినేషన్’ అంటూ సోషల్ మీడియాలో హంగామా చేశారు. ఇప్పుడీ KCPD వర్డ్‌కి సరికొత్త అర్థాన్ని చెబుతూ వేద ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. వేద ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై గోదావరి రెస్టారెంట్ దుబాయ్ సహా నిర్మాణంలో గౌతమ్ మన్నవ (Gautham Mannava) దర్శకత్వ సారథ్యంలో కార్తిక్ రెడ్డి , వరుణ్ దగ్గుబాటి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం కేసీపీడీ. ఈ KCPD అంటే అర్థం ఏమిటంటే.. ‘కొంచం చూసి ప్రేమించు డూడ్’ (Koncham Choosi Preminchu Dude).
తాజాగా వాలెంటైన్స్ డే (Valentine's Day)ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. ఫస్ట్ లుక్ ఆకర్షణగా ఉండటమే కాకుండా.. సినిమాపై అంచనాలు పెంచేదిగా ఉంది. ఈ సినిమా షూటింగ్‌ని మార్చి నెలలో మొదలుకొని సమ్మర్‌కి విడుదలకి సిద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు. ప్రజెంట్ జనరేషన్‌లో యువత మనస్తత్వం, వారి ఆలోచనల ధోరణి నేపథ్యంలో.. రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ (Romantic Comedy Entertainer)గా ఈ చిత్రాన్ని చిత్రీకరించనున్నామని వారు తెలిపారు.
తనీష్ అల్లాడి, శ్రీరామ్ రెడ్డి, ద్వారక విడిఎన్ (బంటి), సుభశ్రీ రాయగురు, ప్రియాంక పాసల, దివ్య దిల్చోకర్ ప్రధాన తారాగణంగా నటించనున్న ఈ చిత్రానికి కథని బంకుపల్లి నాగ భరద్వాజ్ మరియు లింగాచారి అందించగా.. కథనం, దర్శకత్వ బాధ్యతలను గౌతమ్ మన్నవ నిర్వహిస్తున్నారు. (KCPD Movie first Look)