కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Japan: అనుతో టచ్చింగ్ టచ్చింగ్ పాటేసుకున్న కార్తీ.. పెప్పీ అండ్ మాసీ!

ABN, First Publish Date - 2023-10-25T12:15:39+05:30

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తీ.. ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ చిత్రం ‘జపాన్‌’ చేస్తున్నారు. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్‌ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఇటీవలే టీజర్‌ని విడుదల చేసిన మేకర్స్ తాజాగా ‘టచ్చింగ్ టచ్చింగ్’ అనే లిరికల్ వీడియోను విడుదల చేశారు.

Japan Movie Still

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తీ (Karthi).. ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ చిత్రం ‘జపాన్‌’ (Japan)చేస్తున్నారు. ‘జోకర్’ ఫేమ్ రాజు మురుగన్ (Raju Murugan) దర్శకత్వం వహించిన ఈ హీస్ట్ థ్రిల్లర్‌ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ (Dream Warrior Pictures) పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) సంస్థ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది. రీసెంట్‌గా విడుదలైన ‘జపాన్’ టీజర్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా మేకర్స్ ఈ సినిమా మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేశారు. ‘జపాన్’ ఫస్ట్ సింగిల్ ‘టచ్చింగ్ టచ్చింగ్’ లిరికల్ సాంగ్‌ (Touching Touching Lyrical Video Song)ని విజయదశమి స్పెషల్‌గా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పాట టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

ఈ మధ్య బిజీ మ్యూజిక్ డైరెక్టర్‌గా మారిన జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) ఈ పాటని పెప్పీ అండ్ మాసీ నెంబర్‌గా కంపోజ్ చేశారు. హీరో కార్తీ (Karthi), సింగర్ ఇంద్రావతి చౌహాన్‌ (Indravati Chauhan)తో కలసి ఎంతో ఎనర్జిటిక్‌‌గా ఈ పాటని ఆలపించడం విశేషం. భాస్కరభట్ల అందించిన లిరిక్స్ మరో ఆకర్షణగా నిలిచాయి. పాటలో కార్తీ, అను ఇమ్మాన్యుయేల్‌ (Anu Emmanuel)ల కెమిస్ట్రీ కలర్ ఫుల్‌గా వుంది.


జపాన్ కార్తీకి క్రేజీ క్యారెక్టర్. ఎక్స్‌ట్రార్డినరీ మేకోవర్‌‌తో కార్తి పూర్తిగా భిన్నమైన అవతార్‌లో కనిపించారు. కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సునీల్ (Sunil) కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ ఈ సినిమాతో తొలిసారిగా నటుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి ఎస్ రవి వర్మన్ డీవోపీ‌గా, ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీపావళికి ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

============================

*Bubblegum: రోషన్‌ కనకాల మూవీ నుండి మరో రొమాంటిక్ పిక్..

********************************

*Vinayakan: ‘జైలర్’ విలన్ వినాయకన్ అరెస్ట్.. ఎందుకంటే?

**********************************

*Saripodhaa Sanivaaram: శనివారం వరకు ఎందుకుని.. మంగళవారమే క్లాప్ కొట్టేశారు

************************************

Updated Date - 2023-10-25T12:15:39+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!