సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Krishna Last Film: ‘ప్రేమ చ‌రిత్ర కృష్ణ విజ‌యం’ ట్రైల‌ర్ విడుదల

ABN, First Publish Date - 2023-06-02T07:14:37+05:30

నటశేఖరుడు, సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ఆయన నటించిన చివరి చిత్రమైన ‘ప్రేమ చరిత్ర కృష్ణ విజయం’ ట్రైలర్‌ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరుకాగా.. హెచ్ మధుసూదన్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. 2007లో తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో విడుదలకు నోచుకోలేదు. ఇప్పుడు సరికొత్త టెక్నాలజీని యాడ్ చేసి.. విడుదల చేయనున్నారు.

Prema Charitra Krishna Vijayam Trailer Launch Event
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న‌టశేఖ‌రుడు సూప‌ర్ స్టార్ కృష్ణ జ‌యంతి (మే 31) సంద‌ర్భంగా ఆయ‌న న‌టించిన ఆఖ‌రి చిత్రం (Super Star Krishna Last Film) ‘ప్రేమ చ‌రిత్ర కృష్ణ విజ‌యం’ (Prema Charitra Krishna Vijayam) చిత్రం ట్రైల‌ర్‌ను తాజాగా హైదరాబాద్ ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో ఆవిష్క‌రించారు. అంబ మూవీ ప‌తాకంపై క‌న్న‌డ‌లో ప‌లు చిత్రాలకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించి ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న హెచ్ మ‌ధుసూద‌న్ (H MadhuSudhan) ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్రీపాద్ హంచాటే నిర్మాత‌. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈనెలలోనే విడుద‌ల‌కానుంది. ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి కృష్ణ ప‌ర్స‌న‌ల్ మేక‌ప్‌మేన్ మాధ‌వ‌రావు (Madhava Rao), తుమ్మ‌ల‌ప‌ల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ (Rama Satyanarayana)‌, ల‌య‌న్ సాయి వెంక‌ట్ (Lion Sai Venkat), సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వినాయ‌క‌రావు (Journalist Vinayaka Rao) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా కృష్ణ ప‌ర్స‌న‌ల్ మేక‌ప్‌మేన్ మాధ‌వ‌రావు మాట్లాడుతూ.. గ‌త నాలుగైదు రోజులుగా సూపర్‌స్టార్ జ‌న్మదిన వేడుక‌లు బ్ర‌హ్మాండంగా జ‌రుగుతున్నాయి. మ‌ధుసూద‌న్‌గారి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఈ చిత్రం ట్రైల‌ర్ చూశాను. కృష్ణగారు చాలా గ్లామ‌ర్‌గా ఉన్నారు. ఎన‌ర్జిటిక్‌గా న‌టించారు. క‌చ్చితంగా ఈ చిత్రం మంచి విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది. అభిమానులు ఈ చిత్రాన్ని ఆద‌రించాల్సిందిగా కోరుతున్నానని తెలపగా.. నిర్మాత తుమ్మ‌ల‌పల్లి రామ‌స‌త్య‌నారాయ‌ణ మాట్లాడుతూ.. ద‌ర్శ‌కుడు మ‌ధుసూద‌న్ నాకు మంచి మిత్రుడు. క‌న్న‌డ‌లో ఆయ‌న ఎన్నో మంచి చిత్రాలు డైర‌క్ట్ చేశారు. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ‘ప్రేమ చ‌రిత్ర కృష్ణ విజ‌యం’ ట్రైల‌ర్ చాలా ఫ్రెష్‌గా, క‌ల‌ర్ ఫుల్‌గా ఉంది. ఇటీవ‌ల కృష్ణగారి జ‌యంతి సంద‌ర్భంగా ‘మోస‌గాళ్ల‌కు మోస‌గాడు’ (Mosagallaku Mosagadu) చిత్రం రీ-రిలీజ్ చేశారు. హౌస్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో ర‌న్ అవుతోంది. ఈ చిత్రం కూడా అదే విధంగా ఆడాల‌ని కోరుకుంటున్నానని కోరారు.

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ వినాయ‌కరావు మాట్లాడుతూ.. మే 31 అంటే కృష్ణగారి అభిమానుల‌కు పెద్ద పండ‌గే. అంత‌టా ఆయ‌న జయంతి వేడుక‌లు ఘ‌నంగా జరిగాయి. వారు లేకుండా జ‌ర‌ుగుతోన్న మొద‌టి పుట్టిన రోజు ఇది. ఆయ‌న గురించి నేను ‘దేవుడులాంటి మ‌నిషి’ పుస్త‌కం రాశాను. దానికి మంచి పేరొచ్చింది. ఒక రోజు పిలిచి రీ ప్రింట్ చేయ‌మ‌న్నారు. ఆ రీ ప్రింట్ వచ్చే లోపే దురదృష్ట‌వ శాత్తూ ఆయ‌న క‌న్నుమూశారు. ప్ర‌స్తుతం కొన్ని మార్పులు చేర్పుల‌తో ఆ పుస్త‌కాన్ని త్వ‌ర‌లో తీసుకొస్తున్నా. ఇక కృష్ణగారు న‌టించిన ఈ చిత్రం విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నానని అన్నారు.

‘క‌న్న‌డ‌లో మ‌ధుసూద‌న్‌గారికి ద‌ర్శ‌కుడుగా మంచి పేరుంది. కృష్ణ గారితో చేసిన ఈ సినిమా ట్రైల‌ర్ చాలా ఫ్రెష్‌గా ఉంది. ఈ సినిమాకు క‌చ్చితంగా కృష్ణగారి ఆశీస్సులు ఉంటాయ‌న్నారు ల‌య‌న్ సాయి వెంక‌ట్. అనంతరం చిత్ర ద‌ర్శ‌కుడు హెచ్ మ‌ధుసూద‌న్ మాట్లాడుతూ.. ‘వంశం’ చిత్రం డైరెక్ట‌ర్‌గా నా తొలి సినిమా. ఆ చిత్రానికి ఎన్నో అవార్డ్స్ వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో శ్రీపాద్ హంచాటే గారు పిలిచి కృష్ణగారితో సినిమా చేద్దామ‌న్నారు. సంతోషంగా ఓకే చేశాను. 2007లో సినిమా పూర్త‌యింది. విడుద‌ల కోసం ఎంతో వెయిట్ చేశాను. అయినా రిలీజ్ కాలేదు. ఈ లోపు నేను క‌న్న‌డ‌లో చాలా పిక్చ‌ర్స్ డైరెక్ట్ చేశాను. కానీ కృష్ణగారి సినిమా ఎలాగైనా రిలీజ్ చేయాల‌నీ... మా నిర్మాత ద‌గ్గ‌ర నుంచి తీసుకొని స‌రికొత్త హంగుల‌తో ప్ర‌స్తుతం ఉన్న టెక్నాల‌జీకి త‌గ్గ‌ట్టుగా మార్చుకుని నేనే విడుద‌ల చేస్తున్నా. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం. కృష్ణగారి అభిమానులు, ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని కోరుకుంటున్నానని తెలిపారు. కాగా.. య‌శ్వంత్, సుహాసిని జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు, అలీ, ఎమ్మెస్ నారాయ‌ణ ఇతర కీల‌క పాత్ర‌లలో నటించారు.

ఇవి కూడా చదవండి:

************************************************

*Anasuya: ఇప్పటిదాకా మోకాళ్ల పైన పట్టుకున్న మగాళ్లనే చూశా..!

*Mahesh Yuvasena: సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ ఎంత గొప్పగా ఆలోచించారో చూశారా?

*Natti Kumar: అది కరెక్ట్ కాదు... ఏపీ సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం

*Jurassic June: ‘జురాసిక్ పార్క్’‌కు 30 ఏళ్లు.. ఆ పేరు ఇక ఉండదు

*Shaitan: రెడ్ అలెర్ట్!.. బోల్డ్ అండ్ డిస్టర్బ్ చేసే కంటెంట్‌తో..

*Agent: ఓటీటీలో.. అందుకే విడుదల కాలేదా?

Updated Date - 2023-06-02T07:14:37+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!