Adipurush: తిరుమలలో ఓం రౌత్, కృతి సనన్‌ల హగ్గులు, ముద్దులపై ఎవరెలా రియాక్ట్ అవుతున్నారంటే..?
ABN, First Publish Date - 2023-06-07T15:12:55+05:30
‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక అనంతరం చిత్ర బృందం బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం గుడి బయట కృతి సనన్‌ని ఓం రౌత్ హగ్ చేసుకోవడంతో పాటు ముద్దు ఇవ్వడంపై ఇప్పుడంతటా హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. ఈ సంఘటనపై పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. వెంటనే వారిద్దరూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ (Om Raut) తిరుమల శ్రీవారి సన్నిధిలో చేసిన పనిపై హిందూత్వ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం జరిగిన ‘ఆదిపురుష్’ (Adipurush) ప్రీ రిలీజ్ వేడుక అనంతరం చిత్ర బృందం బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం గుడి బయట కృతి సనన్‌ని ఓం రౌత్ హగ్ చేసుకోవడంతో పాటు ముద్దు ఇవ్వడంపై ఇప్పుడంతటా హాట్ హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. ఓం రౌత్ తీరును కొన్ని ధార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, బిజెపి (BJP) నేతలు, ఆర్‌ఎస్ఎస్ (RSS) కార్యకర్తలు, శ్రీవారి భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సంఘటనపై ఎవరెలా రియాక్ట్ అవుతున్నారంటే..
ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రధారి కృతి సనన్‌ను దర్శకుడు ఓం రౌత్ తిరుమల దేవాలయం ముందు ముద్దులు పెట్టడం జుగుప్సాకరంగా ఉంది. ఇటువంటి విలువలు లేని చేష్టలు చేసిన దర్శకుడు ఓం రౌత్, హీరోయిన్ కృతి సనన్‌లు వెంటనే క్షమాపణలు చెప్పాలి.. అని విశాఖకు చెందిన ఆర్.ఎస్.ఎస్. సంఘటన్ జాతీయ అధికార ప్రతినిధి తురగా శ్రీరామ్ (Turaga Sriram) అన్నారు. ముద్దులు, హగ్గులు తిరుమల శ్రీవారి ఆలయం ముందు అంగీకారం కాదు. ఇలాంటివి పునరావృతం కాకుండా టీటీడీ కఠిన చర్యలు తీసుకోవాలని బి.జె.పి నేత రమేష్ నాయుడు (Ramesh Naidu) ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
‘ఆదిపురుష్’ సినిమా యూనిట్‌పై నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు (Tripuraneni Chittibabu) మండిపడ్డారు. ‘‘టీటీడీ ఆవరణలో ముద్దులు పెట్టడం ఏంటి? పరమ పవిత్ర స్థలమైన తిరుమలలో నటి కృతి సనన్ (Kriti Sanon)కి దర్శకుడు ముద్దు పెట్టడం జుగుప్సాకరంగా ఉంది. కోట్లాది మంది మనోభావాలను దెబ్బతీసే పనులివి. అసలు ఆ డైరెక్టర్‌కి బుద్ధి, జ్ఞానం ఉందా? సీతమ్మ తల్లి పాత్ర వేసిన నటికి స్లీవ్ లెస్ జాకెట్ వేశారు. దర్శకుడికి ఆ మాత్రం ఆలోచన లేదా?’’ అంటూ త్రిపురనేని చిట్టిబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘తిరుమల ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం. ఇదేమీ టూరింగ్ స్పాట్, పిక్‌నిక్ స్పాట్, షూటింగ్ స్పాట్ కాదిది. కోట్లాది మంది భక్తులకు ఆరాధ్య దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. సాక్షాత్తూ ఆయన అర్చన సేవలో పాల్గొని, ఆయనను సేవించి బయటకు వచ్చిన తర్వాత.. ఆలయ మహాద్వారం ముందు ఇలాంటి వెకిలి చేష్టలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అన్నారు బిజెపి నేత భాను ప్రకాశ్ రెడ్డి (Bjp Leader Bhanu Prakash Reddy). ఇంకా భక్తులెందరో ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అసలు వారిది భక్తి కాదు.. భక్తిని అమ్ముకోవడమే వారి పని అనేలా ‘ఆదిపురుష్’ (Adipurush) టీమ్‌పై ఫైర్ అవుతున్నారు.
ఇవి కూడా చదవండి:
************************************************
*Prabhas: పెళ్లి ప్రస్తావన.. ప్రభాస్ ఇచ్చిన సమాధానంతో మరింత కన్ఫ్యూజన్!
*Om Raut: శ్రీవారి ఆలయం ముందు చిల్లర పనులు.. హీరోయిన్ కృతి సనన్‌కు దర్శకుడు ముద్దు.. భక్తులు ఆగ్రహం
*Adipurush: ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎవరేం మాట్లాడారంటే..
*Liplock: ప్రియ భవానీ శంకర్‌తో సూర్య లిప్‌లాక్.. ఇప్పుడిదే హాట్ టాపిక్
*Adipurush: గందరగోళంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ వేడుక.. పోలీసుల తీరుపై నిర్వాహకులు అసహనం