Rules Ranjann: శ్రేయ ఘోషల్ వాయిస్‌లో ‘సమ్మోహనుడా’.. రొమాంటిక్ సాంగ్ ఎలా ఉందంటే..
ABN, First Publish Date - 2023-07-20T13:01:58+05:30
కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’. స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు. ‘సమ్మోహనుడా’ అంటూ సాగిన ఈ పాటని ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ ఆలపించారు.
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), నేహా శెట్టి (Neha Sshett) జంటగా రత్నం కృష్ణ (Rathinam Krishna) దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann). స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. అతి కొద్ది కాలంలోనే యువతకి ఎంతగానో చేరువైన నాయకానాయికలు కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి కలయికలో ఈ ‘రూల్స్ రంజన్’ రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, ఫస్ట్ లిరికల్ సాంగ్.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్‌ను మేకర్స్ విడుదల చేశారు.
‘సమ్మోహనుడా’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియోని చిత్ర బృందం గురువారం ఉదయం విడుదల చేసింది. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన రొమాంటిక్ సాంగ్ ఇది. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. ఇద్దరూ ఒకరిపై ఒకరికున్న మోహాన్ని తెలియజేస్తూ నిప్పు, నీరు నేపథ్యంలో పాటను చిత్రీకరించిన తీరు ఫ్రెష్‌గా అనిపిస్తోంది. అమ్రిష్ గణేష్ స్వరపరిచిన సంగీతం ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతోంది. ఈ పాటకి గీత రచయిత రాంబాబు గోసాలతో కలిసి దర్శకుడు రత్నం కృష్ణ సాహిత్యం అందించడం విశేషం. పాట సందర్భానికి తగ్గట్టుగా వారు అందించిన సాహిత్యం ఆకట్టుకుంటోంది. (Sammohanuda Song From Rules Ranjann)
‘సమ్మోహనుడా పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా.. ఇష్టసఖుడా నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా’ అంటూ హీరోయిన్ తన ప్రియుడైన హీరోకి తన దేహాన్ని అర్పిస్తానని పాడుతున్నట్టుగా పాట ప్రారంభమైంది. ‘సందెపొద్దే నువ్వైతే చల్లని గాలై వీస్తా. మంచు వర్షం నువ్వే అయితే నీటి ముత్యాన్నవుతా’ వంటి పంక్తులలో పాట ఎంతో అందంగా సాగింది. ఇక ఈ పాటని ప్రముఖ గాయని శ్రేయ ఘోషల్ (Shreya Ghoshal) ఆలపించారు. ఆమె తన గాత్రంతో పాటకి మరింత అందాన్ని తీసుకొచ్చారు. ఈ పాటకి శిరీష్ నృత్య రీతులు సమకూర్చారు. మొత్తానికి ‘సమ్మోహనుడా’ పాట కూడా.. మొదటి పాట ‘నాలో నేనే లేను’ తరహాలోనే చార్ట్‌బస్టర్ సాంగ్‌గా నిలిచేలానే ఉంది.
ఈ పాట విడుదల సందర్భంగా చిత్ర దర్శకుడు రత్నం కృష్ణ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో వేసిన నాలుగు ప్రత్యేక సెట్స్‌లో ఈ పాటను చిత్రీకరించాము. పాటలో ముంబై, రష్యాకి చెందిన డ్యాన్సర్స్ కనిపిస్తారు. శిరీష్ అనే కొత్త కొరియోగ్రాఫర్ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలోని ఐదు పాటలకూ ఆయనే నృత్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఎంతో టాలెంట్ ఉన్న యంగ్ మాస్టర్. మొత్తం టీమ్ అంతా కూడా ప్రతిభావంతులైన యువతే. శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈ పాటకి నేను, రాంబాబు గోసాల కలిసి సాహిత్యం అందించాం. పాటని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అని తెలుపగా.. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నట్లుగా నిర్మాతలు చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Sitara Ghattamaneni: గుర్తు పెట్టుకోండి.. త్వరలో ఈ పేరొక ప్రభంజనం కాబోతోంది
**************************************
*Leo: మైత్రీ మూవీ మేకర్స్ బాటలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. ఫస్ట్ సినిమా ‘లియో’నే!
**************************************
*Bro: షాకింగ్ నిర్ణయం తీసుకున్న నిర్మాతలు.. ఫ్యాన్స్‌కు నిరాశే ‘బ్రో’!
**************************************
*Klin Kaara: మెగా ప్రిన్సెస్‌కు తారక్ పంపిన గిఫ్ట్ ఏంటో తెలుసా.. ఎవరూ ఊహించి కూడా ఉండరు
**************************************
*Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’ విషయం బయటపెట్టేసింది
**************************************
*Project K: రెబల్‌స్టార్ ప్రభాస్ లుక్ వచ్చేసిందోచ్..
**************************************