కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Satyam Rajesh: సత్యం రాజేష్ టైమ్ నడుస్తోంది

ABN, First Publish Date - 2023-10-28T20:56:53+05:30

గతం వారం పదిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోన్న పేరు.. సత్యం రాజేష్. ఆయన నటించిన ‘మా ఊరి పొలిమేర 2’ చిత్రం నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్ర ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఉండగానే.. తాజాగా ఆయన నటిస్తోన్న మరో చిత్రం ‘టెనెంట్’ టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Tenant Movie Still

గతం వారం పదిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తోన్న పేరు.. సత్యం రాజేష్ (Satyam Rajesh). ఆయన నటించిన ‘మా ఊరి పొలిమేర 2’ (Ma Oori Polimera 2) చిత్రం నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్ర ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా ఈ సినిమా యూనిట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా సత్యం రాజేష్ బాగా ఫోకస్ అవుతున్నారు. అయితే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే.. సత్యం రాజేష్ నటించిన మరో సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదలవడంతో అతని పేరు సోషల్ మీడియాలో సైతం వైరల్ అవుతోంది.

మహాతేజ క్రియేషన్స్ (Maha Teja Creations) బ్యానర్‌పై సత్యం రాజేష్, మేఘా చౌదరి (Megha Choudhary) హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘టెనెంట్’. తాజాగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్ర కాన్సెప్ట్‌ని కూడా మేకర్స్ తెలియజేశారు. ఈ సినిమా మన చుట్టూ జరిగే సంఘటనలకి దగ్గరగా ఉండే ఒక సింపుల్ ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ కథ అని.. ముఖ్యంగా ఆడవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇదని మేకర్స్ ప్రకటించారు. దీంతో సత్యం రాజేష్ మరో సినిమాతో తన టాలెంట్ చూపించడానికి సిద్ధం అవుతున్నాడనేలా వార్తలు మొదలయ్యాయి.


‘టెనెంట్’ విషయానికి వస్తే.. ‘అద్భుతం’ చిత్రాన్ని నిర్మించిన మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రానికి దర్శకత్వం వహించిన వై. యుగంధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ.. స్ర్కీన్‌ప్లే, సంభాషణల్ని కూడా అందిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను తెలియజేస్తామని మేకర్స్ ప్రకటించారు. చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నొరోన్హ, ధనా బాల, చందు తదితరులు ఈ సినిమాలో ఇతర పాత్రలలో నటిస్తున్నారు. (Tenant Title Glimpse Out)


ఇవి కూడా చదవండి:

========================

*Rekha: ఊపిరి ఉన్నంత వరకు.. నా కోరిక అదే..

*********************************

*Chiranjeevi - Khaidi : ఖైదీ చిత్రానికి 40 ఏళ్లు!

********************************

*Vijay Deverakonda: విజయ్ సినిమాలో రష్మిక కదా హీరోయిన్, మరి శ్రీలీల ఏంటి!

***********************************

Updated Date - 2023-10-28T20:56:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!