Brahmaji: మొదటి సినిమాకు మెగాస్టార్, సూపర్‌స్టార్, యంగ్‌టైగర్.. తర్వాత మనం కష్టపడాల్సిందే..
ABN, First Publish Date - 2023-07-10T18:16:50+05:30
నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు హీరోగా, ప్రణవి మానుకొండ హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’. చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రం జూలై 21న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ సోమవారం ప్రకటించారు.
నా కొడుకు మొదటి సినిమాకు మెగాస్టార్, సూపర్‌స్టార్, యంగ్‌టైగర్ ముందుకు వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చి.. ప్రమోట్ చేశారు. ప్రతీ సినిమాకు అలా అందరినీ పిలవడం బాగుండదని అన్నారు నటుడు బ్రహ్మాజీ (Brahmaji). ఆయన కుమారుడు సంజయ్ రావు (Sanjay Rrao) హీరోగా, ప్రణవి మానుకొండ (Pranavi Manukonda) హీరోయిన్‌గా నటిస్తోన్న చిత్రం ‘స్లమ్ డాగ్ హజ్బెండ్’ (Slum Dog Husband). చిన్న సినిమాగా మొదలైన ఈ చిత్రాన్ని రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ లాంటి పెద్ద సంస్థ రిలీజ్ చేయబోతోంది. మైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ (AR Sreedhar) దర్శకత్వం వహిస్తున్నారు. కంప్లీట్ కామికల్ ఎంటర్‌టైనర్‌గా వస్తోన్న ఈ సినిమాలో బ్రహ్మాజీ, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించేందుకు చిత్రయూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన యంగ్ హీరో సత్య దేవ్ (Satyadev) చిత్ర విడుదల తేదీ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సినిమా జూలై 21న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ మంచి స్పందనను రాబట్టుకుంటున్నాయి. మరో ‘సామజవరగమన’ వంటి చిత్రం బాక్సాఫీస్‌ని పలకరించబోతుందనేలా ఫీడ్‌బ్యాక్ రావడంతో.. సినిమాపై భారీగా అంచనాలు మొదలయ్యాయి. బిజినెస్ కూడా అదే రేంజ్‌లో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల అనంతరం సత్యదేవ్ మాట్లాడుతూ.. ‘‘స్లమ్ డగ్ హజ్బెండ్ కాన్సెప్ట్ నాకు ముందే తెలుసు. జ్యోతిలక్ష్మి టైంలోనే విన్నాను. పూరి దగ్గర మేం ఉన్న సమయంలోనే ఈ కథ తెలుసు. కానీ ఇంత ఎంటర్టైనర్‌గా ఉంటుందని అనుకోలేదు. సంజయ్, ప్రణవిలకు ఆల్ ది బెస్ట్. ట్రైలర్ బాగుంది. సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
బ్రహ్మాజీ (Brahmaji) మాట్లాడుతూ.. నా కొడుకు హీరోగా ఎదిగినందుకు, ఎదుగుతున్నందుకు సంతోషంగా ఉంది. కానీ ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అతనికి సపరేట్‌గా నేనేమీ సలహాలు ఇవ్వలేదు, ఇవ్వను. ఈ తరంలో హీరోలు అందరూ సహజంగానే నటిస్తున్నారు. ఈ సినిమాలో ఓ పాత్ర కోసం నన్ను అప్రోచ్ అయ్యారు. తరువాత హీరో కోసం మా అబ్బాయిని తీసుకున్నారు. కథలు ఎంచుకోవడం, సినిమాలు సెలెక్ట్ చేసుకునే విషయంలో మా అబ్బాయికి ఎలాంటి సలహాలు ఇవ్వను. మొదటి సినిమా వరకు చిరంజీవి (Chiranjeevi)గారు, మహేష్ బాబు (Mahesh Babu)గారు, ఎన్టీఆర్ (Jr NTR)గారు ముందుకు వచ్చి ప్రమోషన్స్ చేశారు. ప్రతీ సినిమాకు అలా అందరినీ పిలవడం బాగుండదు. మొదటి సినిమాకు అందరూ ఆశీర్వాదం అందించారు. తర్వాత అన్నీ సినిమాలు మన కష్టం మీద ఆధారపడి ఉంటాయి. ఇక్కడ ఎంత కష్టపడితే.. అంత సక్సెస్ వస్తుంది. మా అబ్బాయికి కూడా కష్టాన్నే నమ్ముకోమని చెబుతుంటాను. సినిమా విషయానికి వస్తే.. ఆద్యంతం అందరినీ చక్కగా ఎంటర్‌టైన్ చేసే సినిమా ఇది. సినిమా విడుదల తర్వాత ప్రతి ఒక్కరూ ఇదే అంటారని అన్నారు.
ఇవి కూడా చదవండి:
**************************************
*Janhvi Kapoor: జాన్వీ కపూర్ కోలీవుడ్ ఎంట్రీ అలా ప్లాన్ చేశారా?
**************************************
*Deen Raj: ఎన్నో కష్టాలు అనుభవించాం.. అయినా తెలుగు వాళ్లు గర్వపడే సినిమా తీశాం
**************************************
*Kushi: సమంత, విజయ్.. పాట ఏమోగానీ.. పోస్టర్‌తోనే పడేశారుగా..
**************************************
*Rangabali: సక్సెస్ మీట్‌లో జర్నలిస్ట్ అడిగిందేంటి?.. దానికి నాగశౌర్య అంత ఫీలయ్యాడేంటి?
**************************************